OnePlus Keyboard 81 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 09:06:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన OnePlus TV 65 Q2 Pro, OnePlus Keyboard 81 Pro https://www.91mobiles.com/telugu/oneplus-tv-65-q2-pro-keyboard-81-pro-hub-5g-launched-india-price-specs-availability/ Wed, 08 Feb 2023 06:52:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4842 ఎట్టకేలకు వన్ ప్లస్ సంస్థ తన OnePlus TV 65 Q2 Pro టీవీని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. పేరులో ఉన్నట్లుగా ఈ టీవీ 65 ఇంచెస్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫ్లాగ్షిప్ టీవీ క్యూఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది. OnePlus TV 65 Q2 Pro లో 70 వాట్ స్పీకర్ సెటప్ ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఓఎస్ […]

The post భారత్‌లో లాంచైన OnePlus TV 65 Q2 Pro, OnePlus Keyboard 81 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 65-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్ సర్టిఫికేషన్ తో లాంచైన OnePlus TV 65 Q2 Pro
  • 70 వాట్ సౌండ్ ఔట్‌పుట్, డాల్బి అట్మాస్ సర్టిఫికేషన్ కలిగిన OnePlus TV 65 Q2 Pro
  • మార్చి 10 నుంచి భారత్ లో సేల్ కి వస్తోన్న OnePlus TV 65 Q2 Pro

ఎట్టకేలకు వన్ ప్లస్ సంస్థ తన OnePlus TV 65 Q2 Pro టీవీని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. పేరులో ఉన్నట్లుగా ఈ టీవీ 65 ఇంచెస్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫ్లాగ్షిప్ టీవీ క్యూఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది. OnePlus TV 65 Q2 Pro లో 70 వాట్ స్పీకర్ సెటప్ ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఓఎస్ ఆధారిత గూగుల్ టీవీ స్కిన్ పై టీవీ పని చేస్తుంది.

OnePlus TV 65 Q2 Pro తో పాటు, వన్ ప్లస్ కీబోర్డ్ 81 ప్రో, వన్ ప్లస్ హబ్ 5జీ రూటర్ కూడా లాంచ్ అయ్యాయి. సరే ఓసారి OnePlus TV 65 Q2 Pro ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకోండి.

భారత్ లో OnePlus TV 65 Q2 Pro ధర, లభ్యత

భారత్ లో OnePlus TV 65 Q2 Pro ధర రూ.99,999 గా ఉంది. మార్చి 6 నుంచి దేశంలో ఈ టీవీ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తుంది.

OnePlus TV 65 Q2 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus TV 65 Q2 Pro టీవీ లో క్యూఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 97 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 120 లోకల్ డిమ్మింగ్ జోన్స్, గామా ఇంజిన్ అల్ట్రా, డాల్బి విజన్, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

OnePlus TV 65 Q2 Pro లో శక్తివంతమైన 70 వాట్ స్పీకర్ సెటప్ ఉంటుంది. దీంట్లో 40 వాట్ సౌండ్ బార్, 4 ఫ్రంట్-ఫేసింగ్ స్పీకర్స్, సైడ్ ఫేసింగ్ ట్వీటర్స్ ఉంటాయి. 30 వాట్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది. వన్ ప్లస్ తన లేటెస్ట్ టీవీ కోసం డైన్ ఆడియో తో జట్టుకట్టింది.

OnePlus TV 65 Q2 Pro టీవీ ఎ‌మ్‌టీ9617 ప్రాసెసర్ తో వచ్చింది. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ టీవీ 11 ఓఎస్ ఆధారిత గూగుల్ టీవీ స్కిన్ పై పని చేస్తుంది. ఇప్పటికే వన్‌ప్లస్ ఆక్సిజన్ ప్లే 2.0 ని తన లేటెస్ట్ టీవీ కోసం రిలీజ్ చేసింది.

OnePlus Keyboard 81 Pro

కీక్రాన్ తో కలిసి వన్ ప్లస్ సంస్థ OnePlus Keyboard 81 Pro ని డెవలప్ చేసింది. OnePlus Keyboard 81 Pro ఒక మెకానికల్ కీ బోర్డ్. వైట్ మరియు గ్రే కలర్ కీ క్యాప్స్ ని ఈ కీబోర్డ్ కలిగి ఉంది. రిటర్న్ మరియు ఎస్కేప్ కీస్ కోసం బోల్డ్ రెడ్ కలర్ ని వాడారు.

OnePlus Keyboard 81 Pro లో రొటేటింగ్ నాబ్ ఉంది. దీన్ని పలు విధాలుగా కస్టమైజ్ చేసుకునే వీలుంది. వైర్డ్ మరియు వైర్లెస్ మోడ్స్ కి మారేందుకు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ని ఈ కీబోర్డ్ లో అందించారు. ఏప్రిల్ లో OnePlus Keyboard 81 Pro ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఈ కీబోర్డ్ ధరను ప్రకటించాల్సి ఉంది.

OnePlus Hub 5G Router

OnePlus Hub 5G Router కూడా భారత్ లో లాంచైంది. ఇది వన్‌ప్లస్ నుంచి వచ్చిన తొలి 5జీ రూటర్. OnePlus Hub 5G Router ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం 4జీ/5జీ సిమ్ కార్డ్స్ పై ఆధారపడుతుంది. వై-ఫై 6 కి ఈ రూటర్ సపోర్ట్ చేస్తుంది. ఈ రూటర్ ధరను, లభ్యతను వన్ ప్లస్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో లాంచైన OnePlus TV 65 Q2 Pro, OnePlus Keyboard 81 Pro first appeared on 91Mobiles Telugu.

]]>