OnePlus Nord CE 4 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 08:44:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/#respond Tue, 24 Sep 2024 08:44:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=13706 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో Nord CE 4 Lite 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE […]

The post OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nord CE 4 Lite 5G పై డిస్కౌంట్
  • డీల్ ధర రూ.16,999
  • వన్‌ప్లస్ బుల్లెట్స్ జెడ్2 ఉచితం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో Nord CE 4 Lite 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE 4 Lite 5G యొక్క ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర, ఆఫర్లు

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ధరతో లాంచ్ అయ్యింది. ఆఫర్ లో భాగంగా రూ.3,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఫోన్ రూ.16,999 కే లభిస్తుంది. ఇది కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కలిపి వర్తిస్తుంది. ఈ ఫోన్ కొనే వారికి రూ.1,299 విలువ గల OnePlus Bullets Z2 నెక్‌బ్యాండ్‌ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది.

OnePlus Nord CE 4 Lite 5G ఎక్కడ కొనాలి?

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ ని రూ.3,000 డిస్కౌంట్ తో కొనాలంటే ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో సాధ్యమవుతుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ ధరకి ఫోన్ లభిస్తుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సేల్ మొదలవుతుంది. ప్రైమ్ మెంబర్స్ కి సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి వస్తుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 480 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్వా టచ్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord CE 4 Lite 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/feed/ 0
OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/#respond Wed, 21 Aug 2024 18:27:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13104 రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. […]

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు

OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
8జిబి+256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Realme P1: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499 గా ఉంది.

గీక్‌బెంచ్

బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 914 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2056 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ పీ1, సింగిల్-కోర్ టెస్ట్ లో 959 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2390 పాయింట్లు స్కోర్ చేసింది.

బెంచ్‌మార్క్ స్కోర్స్ ప్రకారం, సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టాస్కుల్లో రియల్మీ పీ1 పనితనం బాగుంటుందని తెలుస్తోంది. వెబ్‌ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ అనే విషయాలు సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి. ఇక, ఫోటో, వీడియో ఎడిటింగ్ మరియు 3డీ గేమింగ్ అనేవి మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి.

విజేత: Realme P1

అంటుటు

గీక్‌బెంచ్ టెస్ట్ తో పోల్చితే అంటుటు టెస్ట్ అనేది మరింత లోతైనది. ఈ టెస్టు, ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క ఓవరాల్ పెర్ఫామెన్స్‌ను అంచనా వేస్తుంది. సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విభాగాలు ఈ టెస్టులో కవర్ అవుతాయి. OnePlus Nord CE4 Lite 4,75,981 పాయింట్లు నమోదు చేసింది. Realme P1 డివైజ్ 6,02,920 స్కోరు నమోదు చేసింది.

ఈ టెస్టులో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ కంటే రియల్మీ పీ1 మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

సీఈ4 లైట్ సీపీయూ స్కోర్ 154830 గా ఉంది. రియల్మీ పీ1 సీపీయూ స్కోర్ 181016 గా ఉంది.

సీఈ4 లైట్ జీపీయూ స్కోర్ 85405 గా ఉంది. రియల్మీ పీ1 జీపీయూ స్కోర్ 112468 గా ఉంది.

సీఈ4 లైట్ మెమొరీ స్కోర్ 115196 గా ఉంది. రియల్మీ పీ1 మెమొరీ స్కోర్ 149719 గా ఉంది.

సీఈ4 లైట్ యొక్క యూజర్ ఎక్స్‌పీరియన్స్ స్కోర్ 112590 గా ఉంది. రియల్మీ పీ1 స్కోర్ 159699 గా ఉంది.

ఈ స్కోర్లను గమనిస్తే, Realme P1 స్పష్టమైన ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.

విజేత: Realme P1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క స్టెబిలిటీని అంచనా వేసేదే ఈ సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం Burnout బెంచ్‌మార్క్ యాప్ వినియోగించాం. ఇది స్మార్ట్‌ఫోన్‌ని థర్మల్ థ్రాట్లింగ్ కి గురిచేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ రాబడుతుంది. OnePlus Nord CE4 Lite 55.4 శాతం ఔట్‌పుట్‌తో స్టేబుల్‌గా లేదని తెలిసింది. మరోవైపు, Realme P1 76.7 శాతం ఔట్‌పుట్‌తో స్టెబిలిటీ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ కంటే మెరుగ్గా ఉంది.

మీరు గనుక రెగ్యులర్ గా ఇంటెన్సివ్ టాస్కులను చేసే వారైతే, మీకు రెండు ఫోన్లలో Realme P1 బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

విజేత: Realme P1

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ లో భాగంగా రెండు ఫోన్లలో, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ మరియు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్‌ని ఆడటం జరిగింది. మీడియమ్ సెట్టింగ్స్ తో రెండు ఫోన్లు కూడా గేమ్స్‌ను బాగానే రన్ చేస్తున్నాయి. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీలో 50ఎఫ్‌పీఎస్ వద్ద, బీజీఎంఐ లో 30ఎఫ్‌పీఎస్ వద్ద ఫ్రేమ్ రేట్స్ స్టడీగా ఉన్నాయి.

రియల్మీ పీ1 లో శక్తివంతమైన చిప్సెట్ ఉండటం వల్లన, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ తో పోల్చితే, బీజీఎంఐని హయ్యర్ రెజుల్యూషన్ పై రన్ చేయగలదు. అలాగే కాస్త బెటర్ ఫ్రేమ్ రేట్స్ ను కూడా అందించగలదు.

గేమింగ్ పెర్ఫామెన్స్ తో పాటు, ఈ ఫోన్లు గేమ్ ఆడేటప్పుడు, హీట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా మేం టెస్ట్ చేశాం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ యొక్క టెంపరేచర్ 6.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మరోవైపు రియల్మీ పీ1 యొక్క టెంపరేచర్ 5.2 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. రియల్మీ పీ1 హీట్‌ని బాగా మేనేజ్ చేసింది. దీని ద్వారా ఫోన్ యొక్క జీవితకాలం పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

విజేత: Realme P1

ఏది బెటర్?

పెర్ఫామెన్స్ కంపారిజన్ లో Realme P1 స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 Lite కంటే బాగా పెర్ఫామ్ చేసింది. మేం జరిపిన ప్రతీ టెస్టులో రియల్మీ పీ1, తన ప్రత్యర్థి అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ పై పైచేయి సాధించింది. రూ.20,000 లోపు మీకు బెటర్‌గా పెర్ఫామ్ చేసే ఫోన్ కావాలంటే, రెండింట్లో Realme P1 మీకు సరైన ఆప్షన్ గా నిలుస్తుంది.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/feed/ 0
Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/#respond Fri, 26 Jul 2024 18:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12715 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.20,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 24 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే, కేవలం 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఇక ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి/256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme P1

Realme P1 స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 20 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

ఇప్పుడు టెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూస్తే, 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి.

Realme P1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.

OnePlus Nord CE 4 Lite

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ డివైజ్ 11 గంల 30 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

ఇప్పుడు టెస్ట్ వివరాలు చూద్దాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

OnePlus Nord CE 4 Lite యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Tecno POVA 6 Pro

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 15 గంటల 56 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme Narzo 70

Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్‌ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. బ్యాటరీ 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 14 గంటల 49 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. Realme Narzo 70 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 70 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/feed/ 0
OnePlus Nord CE 4 Lite 5G: 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో భారత్‌లో లాంచైన నార్డ్ సీఈ 4 లైట్ 5జీ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-launched-india-50mp-ois-camera/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-launched-india-50mp-ois-camera/#respond Mon, 24 Jun 2024 16:27:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12198 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో కొత్త నార్డ్ ఫోన్ లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE 4 Lite 5G యొక్క ధర, […]

The post OnePlus Nord CE 4 Lite 5G: 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో భారత్‌లో లాంచైన నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OnePlus Nord CE 4 Lite 5G లాంచ్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో కొత్త నార్డ్ ఫోన్ లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE 4 Lite 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర, లభ్యత

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.22,999 గా పెట్టారు.

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 480 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్వా టచ్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord CE 4 Lite 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G: 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో భారత్‌లో లాంచైన నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-launched-india-50mp-ois-camera/feed/ 0
OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/#respond Tue, 18 Jun 2024 18:23:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12131 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జూన్ 24వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ ఇమేజ్ తో పాటు, కెమెరా […]

The post OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 24న Nord CE 4 Lite 5G విడుదల
  • రివీలైన ఇమేజ్, కెమెరా వివరాలు
  • 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జూన్ 24వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ ఇమేజ్ తో పాటు, కెమెరా వివరాలను కంపెనీ రివీల్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర (లీక్)

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు ధరతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.22,999 ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. 1టిబి మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/feed/ 0
OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-announced-by-oneplus/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-announced-by-oneplus/#respond Fri, 14 Jun 2024 17:10:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=12088 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ డివైజ్ జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ లాంచ్ వివరాలు […]

The post OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 18న Nord CE 4 Lite 5G లాంచ్
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • డివైజ్ ప్రారంభ ధర రూ.18,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ డివైజ్ జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ వివరాలు

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వన్‌ప్లస్ బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 18వ తేదీ ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

జూన్ 18వ తేదీన రాత్రి 7 గంటలకు OnePlus Nord CE 4 Lite 5G లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఈ ఫోన్ యొక్క ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది.

OnePlus Nord CE 4 Lite 5G ధర (లీక్)

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ లో లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 ఉండవచ్చు. టాప్ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-announced-by-oneplus/feed/ 0