OnePlus Nord N30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 May 2023 13:45:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఇప్పటి వరకు లీకైన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-nord-n30-5g-design-specs-leaked-details/ Fri, 12 May 2023 13:22:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=6281 వన్‌ప్లస్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ పై పని చేస్తోంది. దాని పేరు OnePlus Nord N30 5G. నార్డ్ ఎన్-సిరీస్ లో ఇది కొత్త ఫోన్. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దీనికి సంబంధించిన లీక్స్ ఎన్నో బయటకు వచ్చాయి. వాటి ద్వారా ఫోన్ లుక్, డిజైన్, ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసాయి. ఈ వివరాలను కలిపి ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివేయండి. […]

The post ఇప్పటి వరకు లీకైన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే లేదా జూన్ నెలలో లాంచ్ కానున్న డివైజ్
  • శాంసంగ్ కెమెరా సెన్సర్ తో రానున్న ఫోన్
  • 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఫీచర్ ఈ ఫోన్లో ఉండే అవకాశం

వన్‌ప్లస్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ పై పని చేస్తోంది. దాని పేరు OnePlus Nord N30 5G. నార్డ్ ఎన్-సిరీస్ లో ఇది కొత్త ఫోన్. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దీనికి సంబంధించిన లీక్స్ ఎన్నో బయటకు వచ్చాయి. వాటి ద్వారా ఫోన్ లుక్, డిజైన్, ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసాయి. ఈ వివరాలను కలిపి ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివేయండి.

OnePlus Nord N30 5G డిజైన్

  • ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్
  • 0.83 సె.మీ. మందం

లీకైన ఫోటోలను బట్టి, OnePlus Nord N30 5G డివైజ్ ఫ్లాట్ ఎడ్జ్ స్క్రీన్, బెజెల్-లెస్ ఎడ్జెస్ మరియు సన్నని చిన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో పంచ్-హోలట్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ 0.83 సెంటీమీటర్ల మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.

బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరా సెన్సర్స్ కనిపిస్తున్నాయి. కెమెరా సెటప్ ఫోన్ వెనకాల పై భాగాన ఎడమవైపున ఉంది. బ్యాక్ ప్యానెల్ షైనీ మరియు గ్లాసీ గా ఉంది. వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉండగా, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎడమవైపున ఉంది. అదే విధంగా యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి.

OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ఐ కంఫర్ట్, స్క్రీన్ కలర్ టెంపరేచర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్

  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • స్నాప్ డ్రాగన్ 695

OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. లీక్స్ నిజమే అయితే గనుక, ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ సంస్థ ఈ ఫోన్ ని 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ తో లాంచ్ చేయనుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 1టిబి వరకు మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకునే వీలుంది.

కెమెరా విభాగం

  • 108ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్ అని భావిస్తున్నారు. దీనికి తోడు 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post ఇప్పటి వరకు లీకైన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-n30-5g-spotted-google-play-console-and-supported-devices-list/ Thu, 20 Apr 2023 09:39:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=5972 ఈ నెల మొదట్లో భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ అయ్యింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ 5జీ కనెక్టివిటీ, సరసమైన ధరతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord N30 5G గా రీబ్రాండ్ అయి లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు OnePlus Nord N30 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ మరియు సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ పై […]

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గూగుల్ ప్లే కన్సోల్ మరియు సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన OnePlus Nord N30 5G
  • OnePlus Nord CE 3 Lite కి రీబ్రాండ్ గా వస్తోందని టాక్
  • త్వరలోనే యూఎస్ లో OnePlus Nord N30 5G లాంచ్ అయ్యే చాన్స్

ఈ నెల మొదట్లో భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ అయ్యింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ 5జీ కనెక్టివిటీ, సరసమైన ధరతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord N30 5G గా రీబ్రాండ్ అయి లాంచ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు OnePlus Nord N30 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ మరియు సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ పై కనిపించింది. తొలుత ఈ విషయాన్ని MySmartPrice వెబ్ సైట్ గుర్తించింది.

OnePlus Nord N30 5G లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ తో పాటు, మోడల్ నంబర్ CPH2513/CPH2515 రివీల్ అయ్యాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకునే ముందు, అసలు ఈ సర్టిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానుఫాక్చరర్లకు గూగుల్ కి చెందిన అత్యంత పాపులర్ అయిన యాప్స్ ని తమ ఆండ్రాయిడ్ డివైజెస్ పై ప్రీ-ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

మరోవైపు గూగుల్ కి చెందిన ఆండ్రాయిడ్ టీమ్ ఈ డివైజెస్ ఎంతవరకు సెక్యూర్ గా ఉన్నాయో మరియు గూగుల్ నుంచి ఇంకా ప్లే స్టోర్ నుంచి వచ్చే యాప్స్ కి కంపాటిబుల్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది.

OnePlus Nord N30 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో రానున్నట్లు తెలిసింది. OnePlus Nord N30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ తో రానున్నట్లు సమాచారం.

ఈ హ్యాండ్సెట్ గూగుల్ ప్లే-సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై OnePlus Nord N30 5G అనే పేరుతో లిస్ట్ అయ్యింది.

OnePlus Nord CE 3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 3 Lite లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 91.40 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OnePlus Nord CE 3 Lite లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు.

కెమెరాలు: OnePlus Nord CE 3 Lite లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, ఎఫ్/1.75 అపర్చర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ర్యామ్ మరియు స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కనెక్టివిటీ: ఈ డివైజ్ లో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

బ్యాటరీ: OnePlus Nord CE 3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

ఓఎస్: OnePlus Nord CE 3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>