OnePlus Nord N300 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 25 Oct 2022 09:48:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 810 చిప్సెట్, 90Hz డిస్ప్లే OnePlus Nord N300 https://www.91mobiles.com/telugu/oneplus-nord-n300-launched-in-usa-price-specs/ Tue, 25 Oct 2022 09:10:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=3038 హైలైట్స్ యూఎస్ఏ లో లాంచ్ అయిన OnePlus Nord N300 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ OnePlus Nord N300 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 228 డాలర్లు (సుమారు రూ.18,900) ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ యూఎస్ఏ లో OnePlus Nord N300 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని యూఎస్ఏ లో లాంచ్ […]

The post MediaTek Dimensity 810 చిప్సెట్, 90Hz డిస్ప్లే OnePlus Nord N300 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • యూఎస్ఏ లో లాంచ్ అయిన OnePlus Nord N300 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • OnePlus Nord N300 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 228 డాలర్లు (సుమారు రూ.18,900)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ యూఎస్ఏ లో OnePlus Nord N300 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని యూఎస్ఏ లో లాంచ్ చేసింది. ఇది గతేడాది వచ్చిన నార్డ్ ఎన్200 కి సక్సెసర్. OnePlus Nord N300 లో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ ని గమనించవ్చు. యూఎస్ లో ప్రస్తుతం అత్యంత చౌకైన వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ OnePlus Nord N300.

OnePlus Nord N300 మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ని కలిగి ఉంది. ఈ కొత్త నార్డ్ ఫోన్ యొక్క చార్జింగ్ స్పీడ్ ని కంపెనీ పెంచింది. డిస్ప్లే కూడా కొంచెం భారీగానే కనిపిస్తోంది. మరి OnePlus Nord N300 యొక్క స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OnePlus Nord N300 ధర, స్పెసిఫికేషన్స్

OnePlus Nord N300 4జిబి ర్యామ్ + 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ యూఎస్ఏలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 228 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.18,900. OnePlus Nord N300 ఫోన్ మిడ్నైట్ జేడ్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం యూఎస్ఏ మార్కెట్ లోనే కొనుగోలుకి అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం దాదాపుగా లేదు. దీని బదులుగా భారత్ లో నార్డ్ సీఈ సిరీస్ లో వన్ ప్లస్ ఓ ఫోన్ ని లాంచ్ చేసే చాన్స్ ఉంది.

OnePlus Nord N300 లో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. OnePlus Nord N300 లో వాటర్ డ్రాప్ నాచ్ లో కెమెరా ఉంది. ఇదొక్కటే OnePlus Nord N200 తో పోల్చితే డౌన్ గ్రేడ్. ఎందుకంటే ఎన్200 లో టాప్ లెఫ్ట్ కార్నర్ లో హోల్-పంచ్ కటౌట్ ఉంది.

OnePlus Nord N300 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. OnePlus Nord N300 లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. అలాగే ఏఐ ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది.

OnePlus Nord N300 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 13 అప్డేట్ ఎన్నో ఫీచర్లను తీసుకురానుంది. న్యూ స్మార్ట్ లాంచర్, ఏఐ సిస్టమ్ బూస్టర్, డిజైన్ చేంజెస్ వంటివెన్నో కొత్త అప్డేట్ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 810 చిప్సెట్, 90Hz డిస్ప్లే OnePlus Nord N300 first appeared on 91Mobiles Telugu.

]]>