OnePlus Pad - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 25 Apr 2023 16:47:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తన తొలి ట్యాబ్లెట్ OnePlus Pad ని లాంచ్ చేసిన వన్‌ప్లస్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-pad-launched-india-price-specs-availability-2/ Tue, 25 Apr 2023 16:45:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=6038 OnePlus 11 మరియు OnePlus 11R స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడంతో పాటు, వన్ ప్లస్ సంస్థ తన తొలి ట్యాబ్లెట్ OnePlus Pad ని ఫిబ్రవరిలో ప్రదర్శించింది. మొబైల్ ఫోన్స్ కాకుండా ట్యాబ్లెట్ డివైజ్ వైపు వెళ్ళడం కంపెనీకి ఇదే తొలిసారి. నేడు అఫీషియల్ గా OnePlus Pad ని లాంచ్ చేసిన కంపెనీ, ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ లో OnePlus Pad ధర 8జిబి ర్యామ్ + […]

The post తన తొలి ట్యాబ్లెట్ OnePlus Pad ని లాంచ్ చేసిన వన్‌ప్లస్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో OnePlus Pad ప్రారంభ ధర రూ.37,999
  • మే 2 వ తేదీ నుంచి సేల్ కి వస్తోన్న OnePlus Pad
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 9510ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్

OnePlus 11 మరియు OnePlus 11R స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడంతో పాటు, వన్ ప్లస్ సంస్థ తన తొలి ట్యాబ్లెట్ OnePlus Pad ని ఫిబ్రవరిలో ప్రదర్శించింది. మొబైల్ ఫోన్స్ కాకుండా ట్యాబ్లెట్ డివైజ్ వైపు వెళ్ళడం కంపెనీకి ఇదే తొలిసారి. నేడు అఫీషియల్ గా OnePlus Pad ని లాంచ్ చేసిన కంపెనీ, ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్ లో OnePlus Pad ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.37,999
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = రూ.39,999

OnePlus Pad డివైజ్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచైంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుండగా, టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది. ధర గురించి మాట్లాడితే, 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. 12జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. మే 2 వ తేదీ నుంచి OnePlus Pad సేల్ మొదలవుతుంది.

OnePlus Pad ఆఫర్లు

OnePlus Pad కొనుగోలుపై పలు ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో OnePlus Pad ని కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ట్యాబ్ ని 12 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ఎక్స్‌చేంజ్ ప్రొగ్రామ్ ద్వారా మీ పాత వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ ని ఇచ్చి రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. ఏప్రిల్ 28 నుంచి మే 2 మధ్య ఎవరైతే OnePlus Pad ని ప్రీ-ఆర్డర్ చేసుకుంటారో వారికి ఉచితంగా రూ.1499 విలువజేసే ఫోలియో కేస్ లభిస్తుంది.

OnePlus Pad స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

OnePlus Pad 7:5 యాస్పెక్ట్ రేషియో తో వచ్చింది. దీన్ని కంపెనీ రీడ్‌ఫిట్ స్క్రీన్ అని పిలుస్తోంది. ఈ డివైజ్ 11.61-ఇంచ్ డిస్ప్లే, 2800*2000 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. హెచ్డీఆర్10+, 500 నిట్స్ బ్రైట్నెస్, 296పీపీఐ పిక్సెల్ డెన్సిటీని ఈ డిస్ప్లే కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ డివైజ్ 6.54ఎంఎం మందం, 552 గ్రాముల బరువు ఉంటుంది.

ర్యామ్, చిప్సెట్

OnePlus Pad లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ ఈ ట్యాబ్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ట్యాబ్ లాంచైంది.

కెమెరా విభాగం

OnePlus Pad లో 13ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ట్యాబ్ లో ఈఐఎస్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లను అందించారు. ఫ్రంట్ కెమెరా ద్వారా 1080పి రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OnePlus Pad డివైజ్ లో 9510 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post తన తొలి ట్యాబ్లెట్ OnePlus Pad ని లాంచ్ చేసిన వన్‌ప్లస్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Pad ధర, ఈ నెలలో సేల్‌కి వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/oneplus-pad-india-price-revealed-before-launch/ Fri, 14 Apr 2023 10:42:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=5889 వన్ ప్లస్ సంస్థ ఫిబ్రవరిలో OnePlus 11 మరియు OnePlus 11R స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అలాగే OnePlus Pad ట్యాబ్లెట్ ని కూడా పరిచయం చేసింది. ట్యాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలిపిన కంపెనీ, ధర మరియు సేల్ తేదీని వెల్లడించలేదు. కానీ, నేడు ఒక కొత్త లీక్ ద్వారా OnePlus Pad ధర రివీల్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. OnePlus Pad ధర ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ […]

The post లీకైన OnePlus Pad ధర, ఈ నెలలో సేల్‌కి వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.39,999 ధర వద్ద లభించనున్న OnePlus Pad
  • వన్‌ప్లస్ నుంచి వస్తోన్న మొట్టమొదటి ట్యాబ్లెట్ డివైజ్ ఇదే
  • ఈ నెలాఖరున మొదలుకానున్న OnePlus Pad సేల్

వన్ ప్లస్ సంస్థ ఫిబ్రవరిలో OnePlus 11 మరియు OnePlus 11R స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అలాగే OnePlus Pad ట్యాబ్లెట్ ని కూడా పరిచయం చేసింది. ట్యాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలిపిన కంపెనీ, ధర మరియు సేల్ తేదీని వెల్లడించలేదు. కానీ, నేడు ఒక కొత్త లీక్ ద్వారా OnePlus Pad ధర రివీల్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Pad ధర

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా OnePlus Pad ధర రివీల్ అయ్యింది. తన ట్వీట్ లో ముకుల్ శర్మ OnePlus Pad ధర, ఫోటోను షేర్ చేశాడు. భారత్ లో రూ.39,999 ధరతో OnePlus Pad సేల్ కి రానుందని తెలుస్తోంది. అయితే, ఇది ఆఫర్ ధర అయి ఉండొచ్చని, అసలు ధర రూ.42,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

OnePlus Pad ఇండియా లాంచ్

OnePlus Pad డివైజ్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ప్రస్తుతం ప్రొడక్ట్ పేజీ లైవ్ లో దర్శనమిస్తోంది. అయితే ప్రొడక్ట్ లాంచ్ తేదీని అమెజాన్ రివీల్ చేయలేదు. కానీ, కమింగ్ సూన్ అని మాత్రం మెన్షన్ చేసింది. ఈ నెలాఖరులో వన్ ప్లస్ సంస్థ OnePlus Pad ని అఫీషియల్ గా లాంచ్ చేయనుందని భావిస్తున్నారు.

OnePlus Pad స్పెసిఫికేషన్స్

OnePlus Pad లో 11.6-ఇంచ్ 2.8కే డిస్ప్లే, 60హెర్ట్జ్/90హెర్ట్జ్/120హెర్ట్జ్/ 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7:5 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్, 2.5డి కర్వ్డ్ గ్లాస్, డాల్బి విజన్, హార్డ్‌వేర్-లెవెల్ బ్లూ లైట్ రిడక్షన్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 9510 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 67 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus Pad ట్యాబ్లెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, మాలి-జీ710 జీపీయూ, 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus Pad లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ట్యాబ్లెట్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మాస్, క్వాడ్-స్పీకర్స్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Pad ధర, ఈ నెలలో సేల్‌కి వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 9000 చిప్, 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన OnePlus Pad https://www.91mobiles.com/telugu/oneplus-pad-launched-india-price-specs-availability/ Wed, 08 Feb 2023 04:26:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4839 OnePlus Pad ట్యాబ్లెట్ ని వన్‌ప్లస్ సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నుంచి ఇదే మొట్టమొదటి ట్యాబ్లెట్. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ట్యాబ్లెట్ ని తీసుకొచ్చారు. గత కొన్నేళ్ళుగా ట్యాబ్లెట్ మార్కెట్ లో శాంసంగ్ ఆదిపత్యం చెలాయించడం మనం చూశాం. తర్వత రియల్మీ, షావోమి, రెడ్మీ, ఒప్పో తదితర సంస్థలు కూడా ట్యాబ్లెట్ మార్కెట్ లోకి ప్రవేశించాయని మనకు తెలుసు. ఇప్పుడు 2023 లో OnePlus కూడా ఈ జాబితాలోకి […]

The post డైమెన్సిటీ 9000 చిప్, 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన OnePlus Pad first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన OnePlus Pad ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 11.61-ఇంచ్ డిస్ప్లే, 9510ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన OnePlus Pad
  • ఏప్రిల్ నుంచి మొదలుకానున్న OnePlus Pad ప్రీ-ఆర్డర్స్

OnePlus Pad ట్యాబ్లెట్ ని వన్‌ప్లస్ సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నుంచి ఇదే మొట్టమొదటి ట్యాబ్లెట్. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ట్యాబ్లెట్ ని తీసుకొచ్చారు. గత కొన్నేళ్ళుగా ట్యాబ్లెట్ మార్కెట్ లో శాంసంగ్ ఆదిపత్యం చెలాయించడం మనం చూశాం. తర్వత రియల్మీ, షావోమి, రెడ్మీ, ఒప్పో తదితర సంస్థలు కూడా ట్యాబ్లెట్ మార్కెట్ లోకి ప్రవేశించాయని మనకు తెలుసు. ఇప్పుడు 2023 లో OnePlus కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది.

న్యూఢిల్లీలో జరిగిన క్లౌడ్ ఈవెంట్ లో OnePlus Pad, OnePlus 11, OnePlus 11R, OnePlus Buds Pro 2 లాంచ్ అయ్యాయి. వన్ ప్లస్ నుంచి వచ్చిన మొట్టమొదటి ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, భారీ బ్యాటరీ ప్యాక్, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అంతేకాదండోయ్, ఈ ట్యాబ్ స్టైలస్, మ్యాగ్నెటిక్ కీబోర్డ్ తో రావడం విశేషం. అయితే ఈ స్టైలస్, మ్యాగ్నెటిక్ కీబోర్డ్ లను సెపరేట్ గా కొనాలి. సరే పదండి, మిగతా వివరాలను తెలుసుకుందాం.

భారత్ లో OnePlus Pad ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే ఏప్రిల్ నుంచి ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయని కంపెనీ తెలిపింది. OnePlus Stylo (Stylus), OnePlus Magnetic Keyboard ల ధరలు కూడా తర్వాత అనౌన్స్ అవుతాయని సమాచారం.

OnePlus Pad స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus Pad ట్యాబ్ 11.61-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*2000 పిక్సెల్స్ రెజుల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్, 7:5 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ సపోర్ట్, 2.5డి కర్వ్డ్ మెటల్ యూనిబాడీ డిజైన్ తో వచ్చింది. ఈ ట్యాబ్ 6.54 మిల్లీ మీటర్ల మందం, 552 గ్రాముల బరువు ఉంటుంది.

OnePlus Pad డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వచ్చింది. డైమెన్సిటీ 9000 చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. OnePlus Pad లో పవర్ బ్యాకప్ కోసం 9,510ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 60 నిమిషాలు చార్జ్ చేస్తే దాదాపు 90 శాతం చార్జ్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే, ఈ ట్యాబ్ లో 13ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

OnePlus Pad ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా క్వాడ్ స్పీకర్ సెటప్, డాల్బి అట్మాస్, వై-ఫై 6, ఓమ్నీ-బేరింగ్ సౌండ్ ఫీల్డ్ ఈ ట్యాబ్ లో ఉన్నాయి. ఓటీపీ వెరిఫికేషన్, సెల్యులర్ షేరింగ్, రిచ్ టెక్ట్స్ మెసేజెస్, పైల్ షేరింగ్ కోసం వన్‌ప్లస్ డివైజెస్ తో ఈ ట్యాబ్ ఆటో-కనెక్ట్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డైమెన్సిటీ 9000 చిప్, 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన OnePlus Pad first appeared on 91Mobiles Telugu.

]]>