OPPO A17 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Oct 2022 08:04:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G35 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A17 https://www.91mobiles.com/telugu/oppo-a17-launched-india-price-specs/ Tue, 04 Oct 2022 08:04:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=2728 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన OPPO A17 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్, 4జిబి ర్యామ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్న OPPO A17 భారత్ లో OPPO A17 ధర రూ.12,499 భారత మార్కెట్ లో OPPO A17 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. ఇక భారత్ లో OPPO A17 ధర […]

The post MediaTek Helio G35 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A17 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన OPPO A17 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ35 చిప్, 4జిబి ర్యామ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్న OPPO A17
  • భారత్ లో OPPO A17 ధర రూ.12,499

భారత మార్కెట్ లో OPPO A17 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. ఇక భారత్ లో OPPO A17 ధర రూ.12,499 గా నిర్ణయించబడింది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న వివో వై16 కి ఈ ఫోన్ పోటీ ఇవ్వనుంది. మిడ్ నైట్ బ్లాక్, సన్ లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో OPPO A17 లభిస్తుంది.

OPPO A17 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు OPPO A17 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OPPO A17 గ్లోబల్ మోడల్ మాదిరి కనిపిస్తోంది. OPPO A17 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్, ఐఎంజీ జీఈ8320 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

OPPO A17 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO A17 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

OPPO A17 లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఉన్నాయి. OPPO A17 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. OPPO A17 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది.

OPPO A17 మిడ్నైట్ బ్లాక్, సన్ లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, బైడూ, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. OPPO A17 ఐపీఎక్స్4 రేటింగ్ తో వస్తోంది.

OPPO A17 స్మార్ట్ ఫోన్ ని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.12,499.

5జీ ఫోన్ల హవా నడుస్తోన్న ఈ రోజుల్లో 4జీ ఫోన్ ని జనాలు ఎలా ఆదరిస్తారో తెలియదు. కానీ, 5జీ ఇంకా దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు చాలా సమయం పట్టనుంది. అలాగే 5జీ లాంచ్ తర్వాత కూడా 4జీ వినియోగించే కస్టమర్లే ఎక్కువ శాతం ఉంటారని తాజాగా మోటోరోలా సంస్థ మోటో జీ72 ఫోన్ లాంచ్ సందర్భంగా తెలిపింది. అందుకే ఇటీవలి కాలంలో 4జీ బడ్జెట్ ఫోన్ల తాకిడి మార్కెట్ లో ఎక్కువైంది. మరి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Helio G35 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A17 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు https://www.91mobiles.com/telugu/oppo-a17k-a17-a77s-specs-leaked-before-launch/ Thu, 29 Sep 2022 12:58:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2652 హైలైట్స్: OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
  • OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా
  • MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు

OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s స్మార్ట్ ఫోన్ వార్తల్లో నిలిచింది. 91మొబైల్స్ హిందీ ఒప్పో త్వరలోనే 3 బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలిపింది. పండుగ సీజన్లో OPPO A17k, A17, A77s ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. చూస్తుంటే మూడు ప్రైస్ సెగ్మెంట్స్ లో ఒప్పో ఫోన్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అవి: ఎంట్రీ లెవెల్, లో-బడ్జెట్ మరియు మిడ్-బడ్జెట్.

ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా ఒప్పో ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, ఫోన్ల ధరలు రూ.10,000 నుంచి రూ.18,000 మధ్య ఉంటాయని తెలుస్తోంది. మరి OPPO A17k, A17, A77s యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో ఓసారి చూద్దాం పదండి.

భారత్ లో OPPO A17k, A17, A77s ధరలు (అంచనా)

OPPO A17k రూ.10,499 (3జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OPPO A17 విషయానికి వస్తే, ఇది రూ.12,499 (4జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇక OPPO A77s ధర రూ.17,999 (8జిబి+128జిబి) ఉండనుందని తెలుస్తోంది. మూడింట్లో కెల్లా ఈ మోడల్ ధర ఎక్కువగా ఉంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17k లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1, 3జిబి/4జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.29 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

OPPO A17 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ ప్లస్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

OPPO A77s స్పెసిఫికేషన్స్

OPPO A77s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5జిబి వర్చువల్ ర్యామ్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, గ్లో డిజైన్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టంట్ బ్యాక్ ప్యానెల్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, హెచ్డీఆర్ సపోర్ట్ ఉన్నాయి. OPPO A77s 7.99 మిల్లీ మీటర్ల మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది. OPPO A77s ఒక 4జీ హ్యాండ్సెట్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
50MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A17: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a17-launched-malaysia-specs-price/ Mon, 26 Sep 2022 11:37:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=2565 హైలైట్స్: మలేషియాలో లాంచ్ అయిన OPPO A17 స్మార్ట్ ఫోన్ OPPO A16 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చిన OPPO A17 50ఎంపి డ్యూయల్-రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్4 రేటింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు కొత్త బడ్జెట్ ఫోన్ ని కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో OPPO A17 ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A16 ఫోన్ కి ఇది […]

The post 50MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A17: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మలేషియాలో లాంచ్ అయిన OPPO A17 స్మార్ట్ ఫోన్
  • OPPO A16 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చిన OPPO A17
  • 50ఎంపి డ్యూయల్-రియర్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్4 రేటింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

కొత్త బడ్జెట్ ఫోన్ ని కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో OPPO A17 ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A16 ఫోన్ కి ఇది సక్సెసర్. OPPO A17 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్-రియర్ కెమెరా, ఐపీఎక్స్4 స్ప్లాష్ రెసిస్టన్స్ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఐపీఎక్స్4 రేటింగ్ ఉండటం వల్లన చిరుజల్లులు పడతున్నప్పుడు కూడా మీరు ఈ ఫోన్ ని వాడుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫోన్ మలేషియన్ మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. త్వరలోనే ఒప్పో కంపెనీ ఈ ఫోన్ ని భారత మార్కెట్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం OPPO A17 యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A17 ధర, లభ్యత

OPPO A17 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర మలేషియాలో RM599 (దాదాపు రూ.10,629) గా నిర్ణయించారు. ఒప్పో బ్రాండ్ స్టోర్స్, ఒప్పో అధికార వెబ్ సైట్, ఒప్పో అథరైజ్డ్ డీలర్స్ నుంచి, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఫోన్ ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం భారత్ లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అలాగే భారత్ లో ఈ ఫోన్ ధర మారే అవకాశం ఉంది.

ఇప్పుడు OPPO A17 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OPPO A17 లో 6.56-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 100% డీసీఐ-పీ3 హై-కలర్ గేముత్, ఇంటెలిజెంట్ డిమ్మింగ్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ (1టీబీ), 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. OPPO A17 ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లేక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ అందించారు.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO A17 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. మెయిన్ కెమెరాలో ఏఐ, 360-డిగ్రీ ఫిల్ లైట్, పొట్రెయిట్ రీటచింగ్, హెచ్డీఆర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 50MP డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A17: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO A17 స్మార్ట్ ఫోన్ డిజైన్ https://www.91mobiles.com/telugu/oppo-a17-design-leaked-launch-timeline/ Sat, 24 Sep 2022 06:37:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2551 హైలైట్స్: ఇటీవలి కాలంలో వరుసగా ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తున్న ఒప్పో లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ OPPO A17 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఒప్పో తాజాగా లీకైన OPPO A17 రెండర్ ఇమేజ్ OPPO A16 ఫోన్ ని రిప్లేస్ చేసేందుకు OPPO A17 ఫోన్ వచ్చేస్తోంది. ఏడాది మొత్తం ఏ-సిరీస్ హ్యాండ్సెట్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న ఒప్పో కంపెనీ మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ OPPO A17 ని […]

The post లీకైన OPPO A17 స్మార్ట్ ఫోన్ డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇటీవలి కాలంలో వరుసగా ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తున్న ఒప్పో
  • లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ OPPO A17 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఒప్పో
  • తాజాగా లీకైన OPPO A17 రెండర్ ఇమేజ్

OPPO A16 ఫోన్ ని రిప్లేస్ చేసేందుకు OPPO A17 ఫోన్ వచ్చేస్తోంది. ఏడాది మొత్తం ఏ-సిరీస్ హ్యాండ్సెట్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న ఒప్పో కంపెనీ మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ OPPO A17 ని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క రెండర్స్ లీక్ అయ్యాయి.

OPPO A17 యొక్క డిజైన్ ఎలిమెంట్స్ ని పరిశీలిస్తే, సంప్రదాయ ఏ-సిరీస్ డిజైన్ శైలిని కలిగి ఉంది. చిన్నపాటి వాటర్ డ్రాప్ నాచ్, వర్టికల్ గా అమరిన రియర్ కెమెరాలు కనిపిస్తున్నాయి. సర్క్యులర్ మాడ్యూల్ లో కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పెద్దగా ఉన్న రింగ్స్ లో కెమెరాలను అమర్చుతున్నారు. ఈ టైప్ చూడటానికి బాగుంటోంది. అందుకే ఇండస్ట్రీలో దాదాపుగా అన్ని సంస్థలు ఈ రింగ్ లో కెమెరా డిజైన్ ని ఫాలో అవుతున్నాయి. ప్రత్యేకించి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఈ డిజైన్ తో కూడిన కెమెరా మాడ్యూల్స్ ని తమ ఫోన్లలో అమర్చుతున్నాయి.

తాజాగా OPPO A17 లో కూడా ఇదే విధంగా ఫోన్ బ్యాక్ ప్యానెల్ లో రెండు రింగ్స్ లో కెమెరాలు ఒదిగి కనిపిస్తున్నాయి. లీకైన OPPO A17 రెండర్ ఇమేజెస్ ని బట్టి ఫోన్ లుక్ చాలా బాగుందనిపిస్తోంది. ఆకర్షణీయంగా ఫోన్ డిజైన్ ని తీర్చిదిద్దారు. ఇటీవలి కాలంలో బడ్జెట్ సెగ్మెంట్ లో ఫీచర్ల కంటే, డిజైన్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటోంది. ఫోన్ డిజైన్ ని చూసి జనాలు మారు మాట్లాడకుండా కొనేస్తున్నారు. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా ముఖ్యమే అన్న సంగతి మరవకూడదు. ఏదేమైనా తక్కువ బడ్జెట్ ఫోన్లలో ఉండాల్సిన మినిమమ్ ఫీచర్లు అందిస్తూ, చక్కటి డిజైన్ ని అందిస్తే అప్పుడు అటు కంపెనీలకు, ఇటు కొనుగోలుదారులకు బిగ్ ప్లస్ అవుతుంది.

ఈ నెలాఖరు వరకు OPPO A17 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల్లో ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు బయటకు రానున్నాయన్న మాట. ఈ నెల పూర్తయ్యేందుకు మరొక ఐదారు రోజుల సమయమే ఉన్నందున ఏ క్షణమైనా ఒప్పో నుంచి ప్రకటన రావచ్చు.

OPPO A17 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటి వరకు OPPO A17 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమీ బయటకు రాలేదు. కానీ, ఇందులో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 270 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 11, కలర్ ఓఎస్ 11 కస్టమ్ స్కిన్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన OPPO A17 స్మార్ట్ ఫోన్ డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>