OPPO A17k - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 19 Nov 2022 10:22:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ https://www.91mobiles.com/telugu/oppo-a17k-price-cut-bank-offers-flipkart/ Fri, 18 Nov 2022 14:21:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3535 హైలైట్స్ 3జిబి, 64జిబి వేరియంట్ అసలు ధర రూ.10,974, రూ.700 తగ్గింపుతో రూ.10,274 కి తగ్గిన ఫోన్ ధర OPPO A17k కొనుగోలు పై అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ఏఐ కెమెరా, కలర్-రిచ్ ఐ-కేర్ డిస్ప్లే, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO పలు ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. చాలా ఫోన్ల ధరలను ఒప్పో తగ్గించింది. దీంతో జనాలు ఒప్పో […]

The post Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 3జిబి, 64జిబి వేరియంట్ అసలు ధర రూ.10,974, రూ.700 తగ్గింపుతో రూ.10,274 కి తగ్గిన ఫోన్ ధర
  • OPPO A17k కొనుగోలు పై అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ఏఐ కెమెరా, కలర్-రిచ్ ఐ-కేర్ డిస్ప్లే, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO పలు ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. చాలా ఫోన్ల ధరలను ఒప్పో తగ్గించింది. దీంతో జనాలు ఒప్పో ఫోన్లపై ఓ కన్నేశారు. మాంచి డీల్ దొరికితే కొనేయాలని వారు వేచి చూస్తున్నారు. తాజాగా ఒప్పో సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ అయిన OPPO A17k పై రూ.700 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాదండోయ్.. అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి.

OPPO A17k పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గోల్డ్ మరియు నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,274 గా చూపిస్తోంది. రూ.700 డిస్కౌంట్ తర్వాత ధర ఇది.

అయితే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా OPPO A17k ని కొనుగోలు చేస్తే 10 శాతం (రూ.1500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్ (రూ.1250 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ అందించారు. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. అంటే మొత్తం 7జిబి ర్యామ్ తో ఈ ఫోన్ మల్టీపుల్ యాప్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

OPPO A17k లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఎఫ్ఎం రేడియో ఫీచర్ ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO A17k కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ సెన్సర్ అమర్చారు. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A17k ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు OPPO A17k ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
5000mAh బ్యాటరీ, MediaTek Helio G35 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A17k https://www.91mobiles.com/telugu/oppo-a17k-launched-in-india-price-specs/ Wed, 19 Oct 2022 08:30:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=2962 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ OPPO A17k మీడియాటెక్ జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ రెడ్మీ 10 ప్రైమ్, రియల్మీ సీ25వై, రియల్మీ నార్జో 50, మోటో ఈ32 ఫోన్లతో పోటీ పడనున్న OPPO A17k OPPO A17k స్మార్ట్ ఫోన్ లాంచ్ తో ఒప్పో కంపెనీ భారత్ లో తన ఏ-సిరీస్ లైనప్ ని విస్తరించింది. కొత్తగా లాంచ్ అయిన ఈ బడ్జెట్ […]

The post 5000mAh బ్యాటరీ, MediaTek Helio G35 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A17k first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ OPPO A17k
  • మీడియాటెక్ జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • రెడ్మీ 10 ప్రైమ్, రియల్మీ సీ25వై, రియల్మీ నార్జో 50, మోటో ఈ32 ఫోన్లతో పోటీ పడనున్న OPPO A17k

OPPO A17k స్మార్ట్ ఫోన్ లాంచ్ తో ఒప్పో కంపెనీ భారత్ లో తన ఏ-సిరీస్ లైనప్ ని విస్తరించింది. కొత్తగా లాంచ్ అయిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO A17 తో OPPO A17k జత చేరింది. ఇప్పుడు ఏ17 సిరీస్ లో రెండు హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండు ఫోన్లలో OPPO A17k అత్యంత చౌకైన ఫోన్.

OPPO A17k సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. అలాగే రెండు కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఇంకా ఈ ఫోన్ యొక్క సేల్ వివరాలను వెల్లడించలేదు. ఈలోపు, భారత్ లో OPPO A17k యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A17k ధర, స్పెసిఫికేషన్స్

3జిబి ర్యామ్ వేరియంట్ లో OPPO A17k స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతం భారత్ లో ఇదొక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఫోన్ లో 64జిబి స్టోరేజీ ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ ధర రూ.10,499 గా నిర్ణయించారు. గోల్డ్, నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

OPPO A17k లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 189 గ్రాములు, మందం 8.3 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ డివైజ్ ఐపీఎక్స్4 రేటింట్ తో వస్తోంది. OPPO A17k లో ఎంట్రీ లెవెల్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ అమర్చారు.

OPPO A17k కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ సెన్సర్ అమర్చారు. OPPO A17k 4జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A17k ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు OPPO A17k ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000mAh బ్యాటరీ, MediaTek Helio G35 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A17k first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు https://www.91mobiles.com/telugu/oppo-a17k-a17-a77s-specs-leaked-before-launch/ Thu, 29 Sep 2022 12:58:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2652 హైలైట్స్: OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
  • OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా
  • MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు

OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s స్మార్ట్ ఫోన్ వార్తల్లో నిలిచింది. 91మొబైల్స్ హిందీ ఒప్పో త్వరలోనే 3 బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలిపింది. పండుగ సీజన్లో OPPO A17k, A17, A77s ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. చూస్తుంటే మూడు ప్రైస్ సెగ్మెంట్స్ లో ఒప్పో ఫోన్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అవి: ఎంట్రీ లెవెల్, లో-బడ్జెట్ మరియు మిడ్-బడ్జెట్.

ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా ఒప్పో ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, ఫోన్ల ధరలు రూ.10,000 నుంచి రూ.18,000 మధ్య ఉంటాయని తెలుస్తోంది. మరి OPPO A17k, A17, A77s యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో ఓసారి చూద్దాం పదండి.

భారత్ లో OPPO A17k, A17, A77s ధరలు (అంచనా)

OPPO A17k రూ.10,499 (3జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OPPO A17 విషయానికి వస్తే, ఇది రూ.12,499 (4జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇక OPPO A77s ధర రూ.17,999 (8జిబి+128జిబి) ఉండనుందని తెలుస్తోంది. మూడింట్లో కెల్లా ఈ మోడల్ ధర ఎక్కువగా ఉంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17k లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1, 3జిబి/4జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.29 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

OPPO A17 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ ప్లస్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

OPPO A77s స్పెసిఫికేషన్స్

OPPO A77s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5జిబి వర్చువల్ ర్యామ్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, గ్లో డిజైన్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టంట్ బ్యాక్ ప్యానెల్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, హెచ్డీఆర్ సపోర్ట్ ఉన్నాయి. OPPO A77s 7.99 మిల్లీ మీటర్ల మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది. OPPO A77s ఒక 4జీ హ్యాండ్సెట్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>