OPPO A2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jul 2023 09:04:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో రానున్న Oppo A2 https://www.91mobiles.com/telugu/oppo-a2-tenaa-certification-specs-via-tipster/ Thu, 27 Jul 2023 06:03:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7345 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Oppo A2 అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ పొందింది. దీంతో డివైజ్ లాంచ్ త్వరలోనే ఉండనుందని అర్థమైంది. ఇక లిస్టింగ్ ద్వారా Oppo A2 డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. స్పెసిఫికేషన్స్ ని చూస్తే అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఫోన్ ప్రైస్ సెగ్మెంట్ ఏంటో ఇంకా తెలియదు […]

The post 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో రానున్న Oppo A2 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Oppo A2
  • TENAA సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Oppo A2 అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ పొందింది. దీంతో డివైజ్ లాంచ్ త్వరలోనే ఉండనుందని అర్థమైంది. ఇక లిస్టింగ్ ద్వారా Oppo A2 డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. స్పెసిఫికేషన్స్ ని చూస్తే అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఫోన్ ప్రైస్ సెగ్మెంట్ ఏంటో ఇంకా తెలియదు కానీ, స్పెసిఫికేషన్స్ చూస్తే మిడ్-రేంజ్ డివైజ్ అని తెలుస్తోంది.

Oppo A2 డివైజ్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. Oppo A2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Oppo A2 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Oppo A2 డివైజ్ TENAA లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Oppo A2 TENAA లిస్టింగ్, లాంచ్ వివరాలు

త్వరలో రాబోవు Oppo A2 డివైజ్ PJG110 అనే మోడల్ నంబర్ తో TENAA లిస్టింగ్ పై కనిపించింది. అలాగే సర్టిఫికేషన్ కూడా పొందింది. సదరు సర్థిఫికేషన్ Oppo A2 ఇమేజెస్ ని రివీల్ చేసింది. అయితే స్పెసిఫికేషన్స్ ని మాత్రం వెల్లడించలేదు. కానీ, టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Oppo A2 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. PJG110 ఫోన్ Oppo A2 అని పిలవబడుతుందని, త్వరలోనే చైనా మార్కెట్ లో లాంచ్ అవుతుందని తెలిపింది.

Oppo A2 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Oppo A2 లో 6.7-ఇంచ్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉంటాయి.

చిప్సెట్: Oppo A2 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ ఉంటుందని సమాచారం. ఇదొక 5జీ చిప్సెట్.

ఓఎస్: Oppo A2 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Oppo A2 డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: Oppo A2 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Oppo A2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో రానున్న Oppo A2 first appeared on 91Mobiles Telugu.

]]>