OPPO A2x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Oct 2023 05:32:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్ తో లాంచైన OPPO A2x 5G https://www.91mobiles.com/telugu/oppo-a2x-5g-launched-china-price-specs-availability/ Tue, 10 Oct 2023 05:32:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=8320 ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO తాజాగా చైనాలో OPPO A2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. భారత లాంచ్ పై ఇంకా క్లారిటీ లేదు. OPPO A2x 5G డివైజ్ ఐపీ52 రేటింగ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి OPPO A2x 5G డివైజ్ […]

The post 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్ తో లాంచైన OPPO A2x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OPPO A2x 5G
  • గత నెల TENAA పై కనిపించిన డివైజ్
  • డైమెన్సిటీ 6020 చిప్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO తాజాగా చైనాలో OPPO A2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. భారత లాంచ్ పై ఇంకా క్లారిటీ లేదు. OPPO A2x 5G డివైజ్ ఐపీ52 రేటింగ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి OPPO A2x 5G డివైజ్ యొక్క చైనా మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A2x 5G ధర

OPPO A2x 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 6జిబి+128జిబి వేరియంట్ ధరను రూ.12,599 గా నిర్ణయించారు. మరోవైపు 8జిబి+256జిబి మోడల్ ధర రూ.15,999 గా ఉంది. OPPO A2x 5G డివైజ్ బ్లాక్, గోల్డ్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A2x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO A2x 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A2x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: OPPO A2x 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: OPPO A2x 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ టెక్నాలజీ ద్వారా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OPPO A2x 5G లో 13ఎంపి ఏఐ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO A2x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A2x 5G లో డ్యూయల్-మోడ్ 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

OPPO A2x 5G ఫీచర్స్

  • OPPO A2x 5G డివైజ్ ఐపీ54 రేటింగ్ తో రావడం వల్లన తేలికపాటి నీటి జల్లులు పడినా తట్టుకోగలదు.
  • భధ్రత కోసం OPPO A2x 5G లో సైడ్ మౌంటెడ్ పింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ చేయబడి ఉంటుంది.
  • ఫోన్ కి బాటమ్ లో అందించబడిన లౌడ్ స్పీకర్ 300% సూపర్ వాల్యూమ్ ఔట్‌పుట్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • OPPO A2x 5G లో 4096 లెవెల్ స్మార్ట్ డిమ్మింగ్ ఫీచర్ ఉంది. ఇంకా 24/7 ఏఐ ఇంటెలిజెంట్ ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది.

The post 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్ తో లాంచైన OPPO A2x 5G first appeared on 91Mobiles Telugu.

]]>