OPPO A3 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Aug 2024 17:35:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/ https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/#respond Fri, 16 Aug 2024 17:35:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=13029 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ గా రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. OPPO A3, OPPO A3x పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు ప్రస్తుతం మలేషియాలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లో 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OPPO A3, OPPO A3x స్పెసిఫికేషన్స్ డిస్ప్లే: OPPO […]

The post OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా OPPO A3, A3x లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్లు
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ గా రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. OPPO A3, OPPO A3x పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు ప్రస్తుతం మలేషియాలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లో 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO A3, OPPO A3x స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 మరియు OPPO A3x డివైజెస్ లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO A3, OPPO A3x డివైజెస్ లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్లలో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ, 256జిబి వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

OPPO A3 4జీ కెమెరా: OPPO A3 లో 50ఎంపి ఏఎఫ్ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO A3x 4జీ కెమెరా: OPPO A3x లో 8ఎంపి రియర్ కెమెరా ఇచ్చారు. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3, OPPO A3x ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.

సాఫ్ట్‌వేర్: OPPO A3, OPPO A3x డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

ఇతర ఫీచర్లు: OPPO A3, OPPO A3x డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ మరియు వాటర్ రెసిస్టన్స్ ఫీచర్స్ ఉన్నాయి.

OPPO A3, OPPO A3x ధరలు

ఒప్పో మలేషియా వెబ్‌సైట్ లో OPPO A3x 4జిబి ర్యామ్ + 64జిబి బేస్ వేరియంట్ ధర RM399 (సుమారు రూ.7,500) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను RM499 (సుమారు రూ.9,500) గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RM599 (సుమారు రూ.11,200) గా ఉంది.

OPPO A3, OPPO A3x స్మార్ట్‌ఫోన్లు స్పార్క్‌ల్ బ్లాక్, స్టారీ పర్పుల్, స్టార్‌లైట్ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

OPPO A3 డివైజ్ గ్లోబల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కానీ, ధర మరియు లభ్యత వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

The post OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/feed/ 0