OPPO A3x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 08:09:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/ https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/#respond Tue, 06 Aug 2024 18:29:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12854 నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది […]

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో OPPO A3x అనే మరొక ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ కి ఒప్పో ఏ3ఎక్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, ఈ రెండు ఫోన్లను పోల్చి చూసి ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

Infinix Note 40X vs OPPO A3x: డిజైన్

Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది.

OPPO A3x డివైజ్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. బ్లాక్, వైట్ మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ డివైజ్ మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్ తో వచ్చింది. ఫ్రంట్ లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.

Infinix Note 40X vs OPPO A3x: డిస్ప్లే

Infinix Note 40X డివైజ్ లో OPPO A3x కంటే మెరుగైన మరియు భారీ డిస్ప్లే ఉంది. రెండు ఫోన్లు కూడా ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. అయితే, Infinix Note 40X లో ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ ఉండగా, OPPO A3x లో హెచ్డీ+ స్క్రీన్ ఉంది. నోట్ 40ఎక్స్ లో ఉన్న హయ్యర్ రెజుల్యూషన్, ఒప్పో ఏ3ఎక్స్ కంటే మెరుగైన, స్పష్టమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: పెర్ఫామెన్స్

రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. ఈ ప్రాసెసర్ పెర్ఫామెన్స్ పర్వాలేదనిపించేలా ఉంటుంది. కాబట్టి, రెండు ఫోన్ల యొక్క పనితీరు ఒకే విధంగా ఉంటుందని అంచనా వేయవచ్చు.

అయితే Infinix Note 40X 8జిబి మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు OPPO A3x 4జిబి ర్యామ్ ని మాత్రమే ఆఫర్ చేస్తుంది. సాధారణ వాడకానికి కూడా 4జిబి ర్యామ్ సరిపోదు. మల్టీ టాస్కింగ్ లేదా యాప్స్ నడుమ మారేందుకు, యాప్స్ లోడ్ అయ్యేందుకు ఈ ర్యామ్ పవర్ సరిపోదు.

ఇదిలా ఉంచితే, రెండు ఫోన్లో స్టోరేజీని పెంచుకునే వీలుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. OPPO A3x 128జిబి స్టోరేజీతో వచ్చింది.

Infinix Note 40X vs OPPO A3x: కెమెరాలు

Infinix Note 40X లో ఒప్పో ఏ3ఎక్స్ తో పోల్చితే ఉత్తమమైన కెమెరా సెటప్ ఉంది. ఒప్పో ఏ3ఎక్స్ లో 8ఎంపి రియర్ కెమెరాను అందించారు. మరోవైపు నోట్ 40ఎక్స్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

ముందువైపు, Infinix Note 40X లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OPPO A3x లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది. Infinix Note 40X లో ఏఐ కెమెరా, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Infinix Note 40X vs OPPO A3x: బ్యాటరీ, చార్జింగ్

బ్యాటరీ మరియు చార్జింగ్ విభాగంలో ఒప్పో ఏ3ఎక్స్ దే పైచేయి. ఈ ఫోన్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. అలాగే 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. మరోవైపు Infinix Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

రెండు ఫోన్ల మధ్య 100ఎంఏహెచ్ బ్యాటరీ పెద్ద తేడా కాదని చెప్పవచ్చు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ ఒప్పో ఏ3ఎక్స్ ను త్వరగా చార్జ్ చేయగలదు. నోట్ 40ఎక్స్ లో అందించిన 18 వాట్ ఫాస్ట్ చార్జర్ నెమ్మదిగా చార్జ్ చేస్తుంది.

Infinix Note 40X vs OPPO A3x: సాఫ్ట్‌వేర్

ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ మరియు ఒప్పో ఏ3ఎక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. ఒప్పో ఏ3ఎక్స్ కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఏది బెటర్?

ఓవరాల్‌గా, స్పెసిఫికేషన్స్ ప్రకారం చూస్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డీసెంట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. అలాగే రెండు ఫోన్లలో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. కాబట్టి, రెండింట్లో దేన్ని ఎంపిక చేసుకోవాలనేది యూజర్ వ్యక్తిగత నిర్ణయం.

మీకు గనుక, స్పష్టమైన డిస్ప్లే, ఎక్కువ ర్యామ్ కావాలంటే.. Infinix Note 40X ఎంచుకోండి. మీకు బ్యాటరీ లైఫ్ మరియు చార్జింగ్ స్పీడ్ ముఖ్యమైతే OPPO A3x ప్రయత్నించవచ్చు.

 

The post Infinix Note 40X vs OPPO A3x: రెండు ఫోన్లలో ఏది బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-note-40x-vs-oppo-a3x-which-is-better-option/feed/ 0
OPPO A3x 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-launched-india-dimensity-6300-chipset/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-launched-india-dimensity-6300-chipset/#respond Thu, 01 Aug 2024 14:37:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=12786 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A3x 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OPPO A3x 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి […]

The post OPPO A3x 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OPPO A3x 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర రూ.12,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A3x 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OPPO A3x 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO A3x 5G ధర, లభ్యత

OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

OPPO A3x 5G యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,499 గా పెట్టారు.

OPPO A3x 5G యొక్క 4జిబి ర్యామ్ +128జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.13,499 గా నిర్ణయించారు.

OPPO A3x 5G డివైజ్ స్టారీ పర్పుల్, స్పార్క్‌ల్ బ్లాక్ మరియు స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ ఫోన్‌ ఒప్పో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

OPPO A3x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1604*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 89.9% స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.

చిప్సెట్: OPPO A3x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3x 5G డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO A3x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO A3x 5G లో ఫింగర్ ప్రింట్ స్కానర్, MIL-STD 810 మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, ఐపీ54 ప్రొటెక్షన్ ఉన్నాయి.

బరువు: OPPO A3x 5G డివైజ్ 187 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO A3x 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-launched-india-dimensity-6300-chipset/feed/ 0
OPPO A3x 5G: చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-listed-on-china-telecom-website/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-listed-on-china-telecom-website/#respond Wed, 24 Jul 2024 14:44:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=12660 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO A3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. OPPO A3x 5G చైనా టెలీకామ్ లిస్టింగ్ OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ […]

The post OPPO A3x 5G: చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3x 5G లాంచ్
  • ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే
  • 32ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO A3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OPPO A3x 5G చైనా టెలీకామ్ లిస్టింగ్

OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ సైట్ పై PKD130 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో డివైజ్ పేరు OPPO A3x 5G అని ఉంది.

లిస్టింగ్ ప్రకారం, OPPO A3x 5G డివైజ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరాలు, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ కటౌట్ ఫ్రంట్ ప్యానెల్ పై కనిపిస్తుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది.

చైనాలో OPPO A3x 5G డివైజ్ స్టార్‌లైట్ వైట్, డార్క్ నైట్ పర్పుల్ మరియు క్లౌడ్ ఫెదర్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.

OPPO A3x 5G డివైజ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 165.79 మి.మీ పొడవు, 76.14 మి.మీ వెడల్పు, 7.68 మి.మీ మందం, 185.7 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A3x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 5G డివైజ్ 6.67-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుందని చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 32ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో/డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OPPO A3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఇతర ఫీచర్లు: OPPO A3x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, లైట్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, ఆల్టిట్యూడ్ సెన్సర్, డిస్టన్స్ సెన్సర్ మరియు డైరెక్షన్ సెన్సర్ ఉంటాయి.

The post OPPO A3x 5G: చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-5g-listed-on-china-telecom-website/feed/ 0