OPPO A55 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Oct 2022 14:33:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/oppo-f21-pro-a55-a77-price-cut-discount/ Mon, 17 Oct 2022 14:33:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2929 హైలైట్స్ OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999 OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు […]

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO
  • భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999
  • OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు తగ్గించిన ధరతో అమ్ముడవుతున్నాయి. ఒప్పో అధికార వెబ్ సైట్ కూడా సవరించిన ధరలను చూపిస్తున్నాయి. ఓసారి తగ్గిన ధరల వివరాలను చూద్దాం.

అలాగే, OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. OPPO A77 ధర తగ్గింపు తర్వాత రూ.15,999 కి సేల్ అవుతోంది.

OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్

OPPO F21 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇదివరకు రూ.22,999 ధరతో అమ్ముడైంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.1,000 డిస్కౌంట్ తర్వాత రూ.21,999 గా ఉంది. మరోవైపు OPPO A55 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ రూ.14,499 వద్ద అమ్ముడవుతోంది. ఇక 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. OPPO A77 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.15,999 గా ఉంది.

OPPO F21 Pro స్పెసిఫికేషన్స్

OPPO F21 Pro లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. అలాగే ఇందులో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ షూటర్, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. 4500ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO A55 స్పెసిఫికేషన్స్

OPPO A55 స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. OPPO A55 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ షూటర్ ఉన్నాయి. OPPO A55 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

OPPO A77 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. OPPO A77 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. OPPO A77 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ OPPO ఫోన్ పై రూ.2,500 తగ్గింపు, వివరాలివిగో..!! https://www.91mobiles.com/telugu/oppo-a55-price-cut-rs-2500-details/ Fri, 26 Aug 2022 15:19:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=1952 హైలైట్స్: 2021 దీపావళి సందర్భంగా లాంచ్ అయిన ఒప్పో ఏ55 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 6జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఒప్పో ఏ55 పై రూ.2500 తగ్గింపును ప్రకటించిన కంపెనీ గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ఒప్పో నుంచి ఒప్పో ఏ55 ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ ని ఈ ఫోన్ […]

The post ఈ OPPO ఫోన్ పై రూ.2,500 తగ్గింపు, వివరాలివిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2021 దీపావళి సందర్భంగా లాంచ్ అయిన ఒప్పో ఏ55 స్మార్ట్ ఫోన్
  • 6.5 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 6జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ఒప్పో ఏ55 పై రూ.2500 తగ్గింపును ప్రకటించిన కంపెనీ

గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ఒప్పో నుంచి ఒప్పో ఏ55 ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఒప్పో ఏ55 రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.17,499. 6జిబి ర్యామ్ వేరియంట్ పై కంపెనీ రూ.2500 తగ్గించింది. అంటే ఇప్పుడు ఒప్పో ఏ55 ధర కేవలం రూ.14,999 మాత్రమే.

OPPO A55 ధర

రూ.15,490 ధరతో ఒప్పో ఏ55 4జిబి వేరియంట్ లాంచ్ అయ్యింది. ఇక 6జిబి ర్యామ్ వేరియంట్ రూ.17,490 ధరతో లాంచ్ అయ్యింది. కానీ, ఇప్పుడు కంపెనీ రూ.2500 మేర ధరను తగ్గించింది. దీంతో ఒప్పో ఏ55 6జిబి వేరియంట్ ని కేవలం రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. 4జిబి వేరియంట్ ధర కంపెనీ వెబ్ సైట్ లో ఇంకా రూ.14,990 గా చూపిస్తోంది. అయితే మారిన ధరను కంపెనీ అప్డేట్ చేస్తుందని గమనించండి. ప్రైస్ అప్డేట్ అయ్యాక ఫోన్ ని కొనుగోలు చేస్తే మంచిది.

OPPO A55 స్పెసిఫికేషన్స్

ఒప్పో ఏ55 స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్, ఎన్ఈజీ టీ2ఎక్స్-1 షీల్డ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ 89.2 స్క్రీన్ టు బాడీ రేషియోని కలిగి ఉంది.

ఒప్పో ఏ55 స్మార్ట్ ఫోన్ లో సెల్పీలు, వీడియో కాల్స్ కొరకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి మోనో కెమెరా లెన్స్ ఉన్నాయి. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్లో నైట్ ప్లస్, పోట్రెయిట్ మోడ్, స్క్రీన్ ఫ్లాష్ ఫర్ సెల్ఫీ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ఏ55 లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ని అమర్చారు. ఈ ఫోన్ 6జిబి/4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఒప్పో ఏ55 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 11.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ విభాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కొరకు ఈ ఫోన్లో ఏఐ ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లను అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తలకై 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post ఈ OPPO ఫోన్ పై రూ.2,500 తగ్గింపు, వివరాలివిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>