OPPO A60 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 Apr 2024 18:53:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A60: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన ఒప్పో ఏ60 https://www.91mobiles.com/telugu/oppo-a60-listed-on-google-play-console/ Wed, 17 Apr 2024 18:28:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=11154 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A60 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. OPPO A60 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ గూగుల్ ప్లే కన్సోల్ పై OPPO A60 స్మార్ట్‌ఫోన్ […]

The post OPPO A60: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన ఒప్పో ఏ60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A60 లాంచ్
  • మోడల్ నంబర్ OP5AE7L1
  • స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A60 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO A60 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

గూగుల్ ప్లే కన్సోల్ పై OPPO A60 స్మార్ట్‌ఫోన్ OP5AE7L1 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఒప్పో ఏ60 ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

లిస్టింగ్ ప్రకారం, OPPO A60 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ తో వస్తోందని అర్థమవుతోంది. అంటే చిప్సెట్ ని బట్టి, ఒప్పో ఏ60 4జీ ఫోన్ అని తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

OPPO A60 స్మార్ట్‌ఫోన్ లో అడ్రెనో 610 జీపీయూని గ్రాఫిక్స్ కోసం వాడినట్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

OPPO A60 స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ కటౌట్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 320డీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తోంది.

OPPO A60 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OPPO A60 4జీ ఫోన్ లాంచ్ వివరాలను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. డివైజ్ కి సంబంధించిన మరిన్ని లీక్స్, సర్టిఫికేషన్ వివరాలు కూడా రివీల్ కాలేదు. మే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

OPPO A60 ధర (అంచనా)

OPPO A60 డివైజ్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపిస్తోన్న స్పెసిఫికేషన్స్ ని బట్టి ఈ విషయం అర్థమవుతోంది. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.15,000 వద్ద ఉంటుందని అంచనా. బేస్ వేరియంట్ ధర రూ.12,999 గా ఉండవచ్చు. 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.14,999 గా ఉండే అవకాశం ఉంది.

The post OPPO A60: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన ఒప్పో ఏ60 first appeared on 91Mobiles Telugu.

]]>