OPPO A98 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Nov 2022 13:16:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో లాంచ్ కానున్న బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ ఫోన్ OPPO A1 Pro https://www.91mobiles.com/telugu/oppo-a1-pro-5g-to-launch-soon-design-leaked/ Thu, 10 Nov 2022 13:16:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=3375 హైలైట్స్ చవకైన 5జీ ఫోన్ ని తీసుకొచ్చే పనిలో ఉన్న OPPO త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న OPPO A1 Pro 5G స్మార్ట్ ఫోన్ OPPO A98 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న OPPO A1 Pro 5G OPPO సంస్థ తన ఏ-సిరీస్ ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగానే అడుగులు వేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ షేర్ చేసిన లీక్ ప్రకారం OPPO A1 Pro 5G త్వరలోనే […]

The post త్వరలో లాంచ్ కానున్న బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ ఫోన్ OPPO A1 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చవకైన 5జీ ఫోన్ ని తీసుకొచ్చే పనిలో ఉన్న OPPO
  • త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న OPPO A1 Pro 5G స్మార్ట్ ఫోన్
  • OPPO A98 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న OPPO A1 Pro 5G

OPPO సంస్థ తన ఏ-సిరీస్ ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగానే అడుగులు వేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ షేర్ చేసిన లీక్ ప్రకారం OPPO A1 Pro 5G త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అతడు ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ వివరాలను కూడా వెల్లడించాడు. రానున్న కొన్ని నెలల్లో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

త్వరలో లాంచ్ కానున్న OPPO A1 Pro 5G

OPPO A1 Pro 5G స్మార్ట్ ఫోన్, OPPO A98 కి రీబ్రాండ్ వర్షన్ అని ఇవాన్ బ్లాస్ చెబుతున్నాడు. OPPO A1 Pro 5G డివైజ్ PHQ110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. OPPO A98 కూడా ఇదే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇవాన్ షేర్ చేసిన ఫోటో లో OPPO A1 Pro 5G యొక్క బ్యాక్ ప్యానెల్ కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం వివరాలు, డిజైన్ సమాచారాన్ని ఇవాన్ వెల్లడించాడు.

OPPO A1 Pro 5G యొక్క కెమెరా యూనిట్ డిజైన్ గురించి తెలుసుకుందాం. పిల్ షేప్ ఉన్న కెమెరా మాడ్యూల్ లో రెండు సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్స్ లో కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. పైన సర్కిల్ లో ఒకే కెమెరా లెన్స్ ఉండగా, క్రింది సర్కిల్ లో రెండు కెమెరాలు, ఫ్లాష్ లైట్ ఉన్నాయి. కెమెరా యూనిట్ గ్లాసీ ప్యాటెర్న్ తో ఉంది. బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ లుక్ ని కలిగి ఉంది.

OPPO A1 Pro 5G స్పెసిఫికేషన్స్

OPPO A1 Pro 5G స్మార్ట్ ఫోన్ OPPO A98 కి రీబ్రాండెడ్ వర్షన్ అని అంటున్నారు. ఒప్పో ఏ98 కొన్ని రోజుల క్రితం TENA లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 ఆక్టాకోర్ చిప్సెట్ వాడారు. 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 128జిబి, 256జిబి, 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభ్యమవుతుంది.

OPPO A98 లో 108 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉండనుందని సమాచారం. ఇదే సెన్సర్ OPPO A1 Pro 5G లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. ఒప్పో ఏ98 162.3 మిల్లీ మీటర్ల పొడవు, 74.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.7 మిల్లీ మీటర్ల మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ ఫోన్ OPPO A1 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A98 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a98-specs-revealed-before-launch/ Mon, 31 Oct 2022 05:28:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=3135 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OPPO A98 స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO A98 స్పెసిఫికేషన్స్ కర్వ్డ్ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న OPPO A98 OPPO కంపెనీ త్వరలో ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది భారత్ మరియు చైనాల్లో ఏ-సిరీస్ లో ఒప్పో పలు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్ని లో-బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్ కి చెందినవే. అయితే త్వరలో […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A98 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A98 స్మార్ట్ ఫోన్
  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO A98 స్పెసిఫికేషన్స్
  • కర్వ్డ్ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న OPPO A98

OPPO కంపెనీ త్వరలో ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది భారత్ మరియు చైనాల్లో ఏ-సిరీస్ లో ఒప్పో పలు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లన్ని లో-బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్ కి చెందినవే. అయితే త్వరలో రాబోవు ఏ-సిరీస్ ఫోన్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ ఫోన్ అని సమాచారం. ప్రీమియమ్ హార్డ్‌వేర్ తో OPPO A98 ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. OPPO A98 యొక్క డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ని డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది. లీకైన వివరాలను బట్టి, OPPO A98 భారీ మెగా పిక్సెల్ కెమెరా, ఫాస్టెస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఫోన్ ని చైనాలో లాంచ్ చేశాక, మిగతా మార్కెట్స్ కి తీసుకురానున్నట్లు సమాచారం. ఓసారి OPPO A98 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO A98 స్పెసిఫికేషన్స్

OPPO A98 లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా స్పష్టమైంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సామాజిక మాధ్యమం అయిన వీబో ద్వారా OPPO A98 యొక్క స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను రివీల్ చేసింది. OPPO A98 స్మార్ట్ ఫోన్ 108 ఎంపి కెమెరా తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. అయితే ఇతర కెమెరా సెన్సర్స్ గురించి ఏమీ చెప్పలేదు.

OPPO A98 స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోంది. ఇదే కనుక నిజమైతే, ఒప్పో ఏ-సిరీస్ లో వస్తున్న మొదటి కర్వ్డ్ డిస్ప్లే గల ఫోన్ గా OPPO A98 నిలవనుంది. డిస్ప్లే సైజ్ వివరాలు తెలియలేదు. OPPO A98 ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని టిప్‌స్టర్ వెల్లడించింది. ఇంతవరకు ఒప్పో ఏ-సిరీస్ ఫోన్లలో 18 వాట్, 33 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని మనం చూశాం. కానీ, ఈసారి 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అంటే బిగ్ అప్‌గ్రేడ్ అని చెప్పాలి.

టిప్‌స్టర్ OPPO A98 కి సంబంధించిన ర్యామ్, స్టోరేజీ వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని మనం అంచనా వేయవచ్చు. అయితే 12జిబి/256జిబి వర్షన్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా, లాంచ్ తేదీ నాడే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు వేచి చూద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A98 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>