OPPO Enco Air3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:16:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన OPPO Enco Air 3 TWS ఇయర్ బడ్స్ https://www.91mobiles.com/telugu/oppo-enco-air-3-launched-india-price-specs-availability/ Fri, 03 Feb 2023 14:26:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=4780 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో Reno 8T 5G ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వచ్చిన ఈ ఫోన్ రూ.30,000 లోపు ధరతో వచ్చింది. సరే ఇప్పుడు మనం OPPO Enco Air 3 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం. నేడు ఈ ఇయర్ బడ్స్ ని ఒప్పో భారత్ లో […]

The post భారత్‌లో లాంచైన OPPO Enco Air 3 TWS ఇయర్ బడ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో OPPO Enco Air 3 ఇయర్ బడ్స్ ని లాంచ్ చేసిన OPPO
  • OPPO Enco Air 3 తో పాటు లాంచైన OPPO Reno 8T 5G, OPPO Keyboard
  • ఆడియోఫైల్ గ్రేడ్ ప్రాసెసింగ్ కోసం Hi-Fi5 DSP తో వచ్చిన OPPO Enco Air 3

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో Reno 8T 5G ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వచ్చిన ఈ ఫోన్ రూ.30,000 లోపు ధరతో వచ్చింది. సరే ఇప్పుడు మనం OPPO Enco Air 3 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం. నేడు ఈ ఇయర్ బడ్స్ ని ఒప్పో భారత్ లో లాంచ్ చేసింది.

OPPO Enco Air 3 TWS ట్రాన్స్‌పరెంట్ లిడ్, హాఫ్ ఇన్-ఇయర్ డిజైన్ తో వచ్చింది. ఆడియో ఫైల్-గ్రేడ్ ఆడియో ప్రాసెసింగ్ కోసం ఈ బడ్స్ లో హై-ఫై డీఎస్పీ ఫీచర్ ఉంది. సరే, ఓసారి OPPO Enco Air 3 TWS స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO Enco Air 3 TWS ధర, సేల్ తేదీ

OPPO Enco Air 3 TWS ధరను భారత్ లో రూ.2,999 గా నిర్ణయించారు. ఈ బడ్స్ ని ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఒప్పో వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 10 నుంచి సేల్ మొదలవుతుంది. గేజ్ వైట్ కలర్ ఆప్షన్ లో ఈ బడ్స్ లభిస్తాయి.

OPPO Enco Air 3 TWS స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OPPO Enco Air 3 TWS ఇయర్ బడ్స్ 13.4 డైనమిక్ యూనిట్ డ్రైవర్స్ తో వచ్చాయి. ఈ ఇయర్ బడ్స్ హాఫ్ ఇన్-ఇయర్ స్టైల్ డిజైన్ తో వచ్చాయి. బాటమ్ లో డ్యూ డ్రాప్ డిజైన్ తో కూడిన స్టెమ్ తో ఈ బడ్స్ వచ్చాయి. ఒక్కొక్క ఇయర్ బరువు 3.75 గ్రాములు ఉంటుంది. కేస్, ఇయర్ బడ్స్ కలిపి 37.4 గ్రాముల బరువు ఉంటాయి. ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ బడ్స్ వచ్చాయి. ఏఏసీ, ఎస్బీసీ కొడెక్స్ సపోర్ట్, బ్లూటూత్ 5.3 ఈ బడ్స్ లో ఉన్నాయి. రెండు డివైజెస్ కి ఒకేసారి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ యూజర్ కి ఉంటుంది. అలాగే గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కూడా ఉంటుంది.

OPPO Enco Air 3 TWS బడ్స్.. ఒక్కొక్కటి 27ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. కేస్ లో 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై బడ్స్ 6 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్ తో 25 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేస్, ఇయర్ బడ్స్ కలిపి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 2 గంటల సమయం పడుతుంది. చార్జింగ్ టైప్-సీ కేబుల్ ద్వారా చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో లాంచైన OPPO Enco Air 3 TWS ఇయర్ బడ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-enco-air-3-buds-launched-price-specs-availability/ Fri, 03 Feb 2023 09:18:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=4775 నేడు భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ 40ఎక్స్ మైక్రోలెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరా, పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, […]

The post 40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • Qualcomm Snapdragon 695 చిప్సెట్, 108MP మెయిన్ కెమెరా, 40x మైక్రోలెన్స్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్

నేడు భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. రెనో-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఈ హ్యాండ్సెట్ 40ఎక్స్ మైక్రోలెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరా, పంచ్-హోల్ కటౌట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై ఒప్పో గ్లో డిజైన్ ఉండటం వల్లన ఫోన్ కి మరింత ఆకర్షణ వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, కర్వ్డ్ ఎడ్జెస్ ని ఫోన్ కలిగి ఉంది.

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ తో పాటు ఒప్పో సంస్థ Enco Air3 TWS ఇయర్ బడ్స్ ని కూడా లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ 13.4ఎంఎం డ్రైవర్స్, ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, 25 గంటల బ్యాటరీ లైఫ్ తో వచ్చాయి.

భారత్ లో OPPO Reno 8T 5G, OPPO Enco Air 3 బడ్స్ ధర, లభ్యత

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ఇంకా ఒప్పో స్టోర్ ద్వారా ఫిబ్రవరి 10 వ తారీఖు నుంచి కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహింద్రా, యస్, ఐడీఎప్‌సీ ఫస్ట్, వన్ కార్డ్, ఏయూ స్మాట్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై 10 శాతం క్యాష్ బ్యాక్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ లభిస్తాయి.

కస్టమర్లు రూ.2,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ మరియు క్యాషిఫై ద్వారా ఒప్పో ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయితే రూ.1000 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది.

ఆన్‌లైన్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. కొటక్, హెచ్డీఎఫ్‌సీ, యస్, ఎస్బీఐ బ్యాంక్స్ నుంచి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఆఫ్‌లైన్ లో ఎన్కో ఎయిర్ 3 బడ్స్ కొనేవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది.

OPPO Enco Air3 ధర రూ.2,999 గా ఉంది. ఫిబ్రవరి 10 నుంచి ఒప్పో వెబ్‌సైట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40ఎక్స్ మైక్రో-లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 40ఎక్స్ మైక్రో-లెన్స్, 108ఎంపి మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>