OPPO F21 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Oct 2022 14:33:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/oppo-f21-pro-a55-a77-price-cut-discount/ Mon, 17 Oct 2022 14:33:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2929 హైలైట్స్ OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999 OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు […]

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO
  • భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999
  • OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు తగ్గించిన ధరతో అమ్ముడవుతున్నాయి. ఒప్పో అధికార వెబ్ సైట్ కూడా సవరించిన ధరలను చూపిస్తున్నాయి. ఓసారి తగ్గిన ధరల వివరాలను చూద్దాం.

అలాగే, OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. OPPO A77 ధర తగ్గింపు తర్వాత రూ.15,999 కి సేల్ అవుతోంది.

OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్

OPPO F21 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇదివరకు రూ.22,999 ధరతో అమ్ముడైంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.1,000 డిస్కౌంట్ తర్వాత రూ.21,999 గా ఉంది. మరోవైపు OPPO A55 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ రూ.14,499 వద్ద అమ్ముడవుతోంది. ఇక 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. OPPO A77 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.15,999 గా ఉంది.

OPPO F21 Pro స్పెసిఫికేషన్స్

OPPO F21 Pro లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. అలాగే ఇందులో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ షూటర్, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. 4500ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO A55 స్పెసిఫికేషన్స్

OPPO A55 స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. OPPO A55 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ షూటర్ ఉన్నాయి. OPPO A55 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

OPPO A77 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. OPPO A77 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. OPPO A77 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>