OPPO Find X6 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 16 Mar 2023 13:34:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6 సిరీస్; ప్రోమో పోస్టర్ ద్వారా రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/oppo-find-x-series-launching-march-21-promo-poster-video-leaked/ Thu, 16 Mar 2023 13:34:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=5542 OPPO Find X6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన రూమర్లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒప్పో సంస్థ ఈ ప్లాగ్షిప్ సిరీస్ ఫోన్ల లాంచ్ ని ఖరారు చేసింది. 2023 మార్చి 21 న OPPO Find X6 సిరీస్ లాంచ్ కానుందని చైనా సోషల్ మీడియా హ్యాండిల్ పై ఒప్పో ప్రకటించింది. అయితే, గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. చైనాతో […]

The post మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6 సిరీస్; ప్రోమో పోస్టర్ ద్వారా రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO Find X6 లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించిన కంపెనీ
  • లైనప్ లో భాగంగా రానున్న OPPO Find X6, OPPO Find X6 Pro
  • మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6, OPPO Find X6 Pro

OPPO Find X6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన రూమర్లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒప్పో సంస్థ ఈ ప్లాగ్షిప్ సిరీస్ ఫోన్ల లాంచ్ ని ఖరారు చేసింది. 2023 మార్చి 21 న OPPO Find X6 సిరీస్ లాంచ్ కానుందని చైనా సోషల్ మీడియా హ్యాండిల్ పై ఒప్పో ప్రకటించింది. అయితే, గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. చైనాతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.

OPPO Find X6 లైనప్ లో రానున్న ఫోన్లు ఇవే

OPPO Find X6 సిరీస్ త్వరలోనే లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Find X6, OPPO Find X6 Pro డివైజెస్ లాంచ్ కానున్నట్లు ప్రోమో పోస్టర్ మరియు వీడియో ద్వారా తెలిసింది. అలాగే OPPO Find X6 యొక్క డిజైన్ లాంగ్వేజ్ కూడా ప్రోమో పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, OPPO Find X6 సిరీస్ చైనాలో మార్చి 21 న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానుంది. భారత కాలమాన ప్రకారం, ఉదయం 11.30 గంటలకు ఈ లాంచ్ ఉంటుంది. అయితే ఇది అధికారికంగా ఖరారు కాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే OPPO Find X6 సిరీస్ తో పాటు OPPO Pad 2 కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.

OPPO Find X6 Pro విషయానికి వస్తే, 100ఎక్స్ జూమ్ కలిగిన పెరిస్కోప్ కెమెరా పోస్టర్ లో కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ పై పెద్ద రింగ్ కనిపిస్తోంది. లెదర్ వంటి మెటీరియల్ ని బ్యాక్ ప్యానెల్ కోసం వాడినట్లు అర్థమవుతోంది. అలాగే కెమెరా మాడ్యూల్ కి మధ్యలో హాజెల్‌బ్లడ్ బ్రాండింగ్ కనిపిస్తోంది.

OPPO Find X6 Pro యొక్క కెమెరా సామర్థ్యాలను కూడా ప్రోమో వీడియోలో ఒప్పో టీజ్ చేసింది. OPPO Find X6 Pro డివైజ్ అద్భుతమైన మూన్ షాట్స్ తీయగలదు. ఇంకా షాట్స్ లో ఇతర ఆబ్జెక్ట్స్ కి మరియు హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కి సమానమైన అటెన్షన్ ని ఇస్తుంది.

OPPO Find X6 Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OPPO Find X6 Pro స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ 2కే 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్ క్వాల్కమ్ టాప్ ఎండ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే, OPPO Find X6 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుందని అంచనా వేస్తున్నారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6 సిరీస్; ప్రోమో పోస్టర్ ద్వారా రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP Sony IMX989 1-inch సెన్సర్ తో రానున్న OPPO Find X6 Pro https://www.91mobiles.com/telugu/oppo-find-x6-pro-design-specs-leaked-before-launch/ Mon, 02 Jan 2023 08:44:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=4281 హైలైట్స్ 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానున్న OPPO Find X6 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OPPO Find X6 Pro OPPO Find X6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుందని అంచనా Find X6 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ఒప్పో సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X6, […]

The post 50MP Sony IMX989 1-inch సెన్సర్ తో రానున్న OPPO Find X6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానున్న OPPO Find X6 Pro
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OPPO Find X6 Pro
  • OPPO Find X6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుందని అంచనా

Find X6 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ఒప్పో సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Find X6, OPPO Find X6 Pro. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. 2023 మొదటి త్రైమాసికంలో OPPO Find X6 సిరీస్ లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం.

ఇదిలా ఉండగా, OPPO Find X6 Pro యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కెమెరా స్పెసిఫికేషన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. లీకైన వివరాలను బట్టి, OPPO Find X6 Pro డివైజ్ కొత్త కెమెరా సిస్టమ్ తో రానున్నట్లు స్పష్టమైంది. ఓసారి OPPO Find X6 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూడండి.

OPPO Find X6 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

OPPO Find X6 Pro స్మార్ట్ ఫోన్ OPPO Find X5 Pro కి సక్సెసర్ గా వస్తోంది. అయితే ఈ ఫ్లాగ్షిప్స్ భారత్ లో లాంచ్ అవుతాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదు. డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసిన సమాచారాన్ని బట్టి, OPPO Find X6 Pro 50ఎంపి సోని ఐఎంఎక్స్989 కెమెరా సెన్సర్ తో వస్తోంది. షావోమి 13 ప్రో, వివో ఎక్స్90 ప్రో, షావోమి 12ఎస్ అల్ట్రా ఫోన్లలో ఇదే సెన్సర్ వాడారు. ఈ 1-ఇంచ్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది.

50ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉండనుంది. దీని కోసం ఒప్పో Sony IMX890 సెన్సర్ వాడనున్నట్లు సమాచారం. ఈ సెన్సర్ 1/1.56-ఇంచ్ సెన్సర్, f/2.2 అపర్చర్, 14ఎంఎం ఫోకల్ లెంగ్త్ కల్గి ఉంటుంది.

ఇకపోతే 50ఎంపి టెలీఫోటో లెన్స్ కూడా ఉంటుంది. ఇందుకోసం ఒప్పో Sony IMX890 లేదా Sony IMX766 సెన్సర్ వాడే అవకాశం ఉంది. ఈ టెలీఫోటో సెన్సర్ f/2.6 అపర్చర్ మరియు ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 సెన్సర్ ఉంటుంది.

OPPO Find X6 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. ఇక స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Find X6 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానుంది. ఈ రెండు ఫోన్లు కూడా మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ తో వస్తున్నాయి.

OPPO Find X6 Pro డిజైన్ విషయానికి వస్తే ఇందులో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు సర్క్యులర్ కటౌట్స్, ఒక స్క్వేర్ షేప్డ్ కటౌట్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP Sony IMX989 1-inch సెన్సర్ తో రానున్న OPPO Find X6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>