OPPO K11 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Jan 2024 13:10:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 చైనాలో లాంచైన OPPO K11 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-k11-5g-launched-china-price-specs-color-options/ Tue, 25 Jul 2023 08:40:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=7314 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO కే-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. OPPO K11 5G అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా లాంచ్ కానుంది. ఇక OPPO K11 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO […]

The post చైనాలో లాంచైన OPPO K11 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 782జి చిప్ తో వచ్చిన OPPO K11 5G
  • OPPO K11 5G ప్రారంభ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,000)
  • కలర్ ఆప్షన్స్: గ్లేసియర్ బ్లూ, మూన్ షాడో గ్రే

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO కే-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. OPPO K11 5G అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా లాంచ్ కానుంది. ఇక OPPO K11 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO K11 5G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K11 5G ధర

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,000). మరోవైపు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,000). అలాగే టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.28,000) గా ఉంది.

OPPO K11 5G కలర్ ఆప్షన్స్

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ గ్లేసియర్ బ్లూ, మూన్ షాడో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత మార్కెట్ లోకి వచ్చాక కలర్ వేరియంట్స్, ధర మారే అవకాశం ఉంది. అయితే భారత మార్కెట్ లో లాంచ్ ఎప్పుడో ఇంకా తెలియదు.

OPPO K11 5G డిజైన్

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ప్యానెల్ కలిగి ఉంది. పంచ్ హోల్ కటౌట్ డిజైన్ డిస్ప్లే పై చూడవచ్చు. స్క్రీన్ చుట్టూ సన్నని బెజెల్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ బ్యాక్ ని ఈ ఫోన్ లో గమనించవచ్చు. అలాగే బ్యాక్ ప్యానెల్ పై OPPO K11 బ్రాండింగ్ ఉంది.

OPPO K11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
  • డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
  • స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
  • కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో పాటు మరో రెండు సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO K11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post చైనాలో లాంచైన OPPO K11 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 25 న లాంచ్ కానున్న OPPO K11 5G https://www.91mobiles.com/telugu/oppo-k11-5g-specs-confirmed-before-launch/ Fri, 21 Jul 2023 11:21:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=7277 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో జులై 25 న OPPO K11 5G ఫోన్ ని లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. లాంచ్ కి ముందు కంపెనీ OPPO K11 5G స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO K11 5G డివైజ్ లో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 1.07 బిలియన్ కలర్ […]

The post జులై 25 న లాంచ్ కానున్న OPPO K11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచ్ అవుతోన్న OPPO K11 5G
  • లాంచ్ కి ముందు రివీలైన స్పెసిఫికేషన్స్
  • ఓఎల్ఈడీ ప్యానెల్ తో వస్తోన్న OPPO K11 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో జులై 25 న OPPO K11 5G ఫోన్ ని లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. లాంచ్ కి ముందు కంపెనీ OPPO K11 5G స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO K11 5G డివైజ్ లో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయి.

OPPO K11 5G లాంచ్ వివరాలు

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ చైనాలో జులై 25 న లాంచ్ అవుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా ఇండియన్ మొబైల్ యూజర్లు OPPO K11 5G లాంచ్ ని లైవ్ లో చూడవచ్చు.

OPPO K11 5G డిజైన్

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది. పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ని ఫోన్ లో అందించారు. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఒప్పో బ్రాండింగ్ తో పాటు, డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు.

OPPO K11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G లో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి ప్రాసెసర్ ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటుంది.
  • కెమెరా: OPPO K11 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా ఉంటుంది.

The post జులై 25 న లాంచ్ కానున్న OPPO K11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఖరారైన OPPO K11 5G లాంచ్ తేదీ; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/oppo-k11-5g-official-launch-date-price-key-details/ Tue, 18 Jul 2023 09:05:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7224 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO K11 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేసింది. OPPO K11 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా […]

The post ఖరారైన OPPO K11 5G లాంచ్ తేదీ; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్‌తో వస్తోన్న OPPO K11 5G
  • రెండు కలర్ ఆప్షన్స్ తో రానున్న OPPO K11 5G
  • OPPO K11 5G లో స్నాప్ డ్రాగన్ 782జి చిప్‌ ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO K11 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేసింది. OPPO K11 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంటుంది. అలాగే కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉండనుంది.

OPPO K11 5G చైనాలో రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లాంచ్ కి ముందు లీక్ అయ్యాయి. సరే, ఓసారి OPPO K11 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

OPPO K11 5G లాంచ్ వివరాలు

OPPO K11 5G ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్. ఈ డివైజ్ లో ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. OPPO K11 5G లో సోని ఐఎంఎక్స్890 కెమెరా సెన్సర్ ఉంటుందని ఒప్పో రివీల్ చేసింది. ఫ్లాగ్షిప్ డివైజెస్ లో కనిపించే 50ఎంపి ప్రైమరీ కెమెరాని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఇదే లెన్స్ ని OPPO 11, OPPO Nord 3, OPPO Find X6 Pro, OPPO Reno 10 Pro+ లలో కూడా వాడారు.

ఒప్పో కంపెనీ OPPO K11 5G డిజైన్ ని రివీల్ చేసింది. రియల్ ప్యానెల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ని కలిగి ఉంది. కెమెరా రింగ్స్ చుట్టూ గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. పవర్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.

రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus Nord CE 3 5G కి ట్వీక్డ్ వర్షన్ గా OPPO K11 5G చైనీస్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రెండు ఫోన్లలో ఉన్న ఒకే ఒక్క తేడా చార్జింగ్ స్పీడ్. OPPO K11 5G 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంటే, Nord CE 3 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ తో వచ్చింది.

OPPO K11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉంటాయి.
  • కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • ప్రాసెసర్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్,
  • స్టోరేజీ: OPPO K11 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి లేదా 512జిబి స్టోరేజీ ఉంటాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ టెక్నాలజీ ఈ ఫోన్ లో అందించనున్నారు.
  • ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్‌ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • ఇతర ఫీచర్లు: OPPO K11 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ స్పీకర్ సెటప్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉంటాయి. ఈ ఫోన్ 185 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO K11 5G ధర

OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ధరను ఒప్పో కంపెనీ ఖరారు చేసింది. OPPO K11 5G డివైజ్ చైనీస్ మార్కెట్ లో CNY 2,000 (సుమారు రూ.22,900) ఉంటుంది.

The post ఖరారైన OPPO K11 5G లాంచ్ తేదీ; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>