OPPO Reno 12F 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 18 Jul 2024 15:31:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO Reno 12F 4G: 32ఎంపి సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రెనో 12ఎఫ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-4g-globally-launched-32mp-selfie-camera/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-4g-globally-launched-32mp-selfie-camera/#respond Thu, 18 Jul 2024 15:31:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=12560 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్‌లో Reno 12 సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ గ్లోబల్ గా రెనో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 12F 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి […]

The post OPPO Reno 12F 4G: 32ఎంపి సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రెనో 12ఎఫ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా OPPO Reno 12F 4G లాంచ్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్‌లో Reno 12 సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ గ్లోబల్ గా రెనో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 12F 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12F 4G ధర

OPPO Reno 12F 4G స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ.18,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OPPO Reno 12F 4G డివైజ్ అంబర్ ఆరెంజ్, ఆలివ్ గ్రీన్ మరియు మ్యాట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 12F 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12F 4G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12F 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OPPO Reno 12F 4G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: OPPO Reno 12F 4G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO Reno 12F 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

కనెక్టివిటీ: OPPO Reno 12F 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12F 4G లో ఏఐ లింక్‌బూస్ట్, ఏఐ ఎరేజర్, ఏఐ స్టూడియో, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మేటింగ్ 2.0, ఐపీ64 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OPPO Reno 12F 4G: 32ఎంపి సెల్ఫీ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రెనో 12ఎఫ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-4g-globally-launched-32mp-selfie-camera/feed/ 0