OPPO Reno 8T 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 08:45:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-reno-8t-4g-launched-vietnam-price-specs/ Thu, 02 Feb 2023 13:59:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4762 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలోనే భారత్ లో OPPO Reno 8T 5G ని లాంచ్ చేయబోతోంది. భారత్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 3 న లాంచ్ అవుతోంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO Reno 8T 4G, Reno 8T 5G ఫోన్లను గ్లోబల్ మార్కెట్స్ లో ఒప్పో లాంచ్ చేసింది. ప్రస్తుతం OPPO Reno 8T 5G వియత్నాం మార్కెట్ లో లాంచైంది. దీనికి 4జీ వర్షన్ […]

The post గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాం లో లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వచ్చిన OPPO Reno 8T 5G
  • అమోలెడ్ డిస్ప్లే తో వచ్చిన OPPO Reno 8T 4G, Reno 8T 5G స్మార్ట్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలోనే భారత్ లో OPPO Reno 8T 5G ని లాంచ్ చేయబోతోంది. భారత్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 3 న లాంచ్ అవుతోంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO Reno 8T 4G, Reno 8T 5G ఫోన్లను గ్లోబల్ మార్కెట్స్ లో ఒప్పో లాంచ్ చేసింది. ప్రస్తుతం OPPO Reno 8T 5G వియత్నాం మార్కెట్ లో లాంచైంది. దీనికి 4జీ వర్షన్ కూడా ఉంది. అయితే 4జీ వర్షన్ భారత్ కి వస్తుందో లేదోనన్న విషయాన్ని ఒప్పో ఇంకా ఖరారు చేయలేదు.

OPPO Reno 8T 5G కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు OPPO Reno 8T 4G కూడా అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 8T సిరీస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO Reno 8T 4G, Reno 8T 5G ధరలు

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ వీఎన్‌డీ 9.9 మిలియన్ (సుమారు రూ.35,300) ధరతో వియత్నాం మార్కెట్ లో లాంచైంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. స్టార్‌లైట్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Reno 8T 4G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర వీఎన్‌డీ 8.49 మిలియన్ (సుమారు రూ.29,900) గా ఉంది. ఈ ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఆరెంజ్ కలర్ వేరియంట్ ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది.

OPPO Reno 8T 4G స్పెసిఫికేషన్స్

Reno 8T 4G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్, 90 హెర్ట్జ్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ జీ99 ప్రాసెసర్ ఉంటుంది. 5జీ కనెక్టివిటీ లేదు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

OPPO Reno 8T 4G లో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. OPPO Reno 8T 4G లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆర్బిట్ లైట్ తో వస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ గా లాంచైన OPPO Reno 8T 4G, Reno 8T 5G first appeared on 91Mobiles Telugu.

]]>