OPPO Reno 9A - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Jun 2023 17:07:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.4-ఇంచ్ AMOLED డిస్ప్లే, Snapdragon 695 చిప్‌తో లాంచైన OPPO Reno 9A https://www.91mobiles.com/telugu/oppo-reno-9a-5g-launched-japan-price-specs-availability/ Tue, 13 Jun 2023 17:07:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6759 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO తన రెనో 9 సిరీస్ లో OPPO Reno 9A అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ జపాన్ లో లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OPPO Reno 9A లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 409 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి OPPO Reno […]

The post 6.4-ఇంచ్ AMOLED డిస్ప్లే, Snapdragon 695 చిప్‌తో లాంచైన OPPO Reno 9A first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జపాన్ లో లాంచైన OPPO Reno 9A
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన డివైజ్
  • OPPO Reno 9A ధర 40,656 యెన్‌లు (సుమారు రూ.24,000)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO తన రెనో 9 సిరీస్ లో OPPO Reno 9A అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ జపాన్ లో లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OPPO Reno 9A లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 409 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి OPPO Reno 9A ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ఇది కూడా చదవండి: లీకైన OnePlus Nord 3 రెండర్స్; రివీలైన పూర్తి డిజైన్!

OPPO Reno 9A ధర

OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ నైట్ బ్లాక్ మరియు మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ జపాన్ లో జూన్ 22 నుంచి సేల్ కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. OPPO Reno 9A ధర 40,656 యెన్‌లు (సుమారు రూ.24,000) గా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని ఒప్పో ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2)

OPPO Reno 9A స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 9A లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 409 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 89.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.
  • చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వాడారు. 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా విభాగం: OPPO Reno 9A డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 9A స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Reno 9A లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఐపీఎక్స్8 రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: OPPO Reno 9A లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, 3.5మి.మీ ఆడియో జాక్, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 6.4-ఇంచ్ AMOLED డిస్ప్లే, Snapdragon 695 చిప్‌తో లాంచైన OPPO Reno 9A first appeared on 91Mobiles Telugu.

]]>