OPPO Reno8 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 25 Jul 2022 10:37:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం https://www.91mobiles.com/telugu/oppo-reno8-oppo-enco-x2-first-sale-in-india/ Mon, 25 Jul 2022 10:37:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=1203 హైలైట్స్: ఈమధ్యే ఒప్పో రెనో8 సిరీస్, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో నేటి నుంచి భారత్ లో మొదలు కానున్న ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ఫస్ట్ సేల్ ఈ డివైజెస్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో, రెనో8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ రెండు […]

The post నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈమధ్యే ఒప్పో రెనో8 సిరీస్, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసిన ఒప్పో
  • నేటి నుంచి భారత్ లో మొదలు కానున్న ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ఫస్ట్ సేల్
  • ఈ డివైజెస్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో, రెనో8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ తో పాటు, ఒప్పో ఎన్కో ఎక్స్2, ఒప్పో ప్యాడ్ ఎయిర్ లను భారత్ లో లాంచ్ చేసింది ఒప్పో. ఇక నేటి నుంచి స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 ల యొక్క అమ్మకాలు మొదలయ్యాయి.

ఒప్పో రెనో8 5జీ ఫోన్లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ లో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్, యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్, 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లున్నాయి.

OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ వివరాలు, లాంచ్ ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ ద్వారా ఒప్పో రెనో8 5జీ, ఒప్పో ఎన్కో ఎక్స్2 లను నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు. రెనో8 5జీ కొనాలనుకునే వారికి హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం (రూ.3000) వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 ట్రూలీ వైర్లెస్ స్టీరియో బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనాలనుకునే వారికి ఎంపిక చేయబడిన డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎన్కో ఎక్స్ 2 పై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు.

భారత్ లో OPPO Reno8 5G, OPPO Enco X2 ధర

ఇప్పుడు భారత్ లో ఈ డివైజెస్ ధర ఎంతో ఉందో చూద్దాం. ఒప్పో రెనో8 5జీ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ ధర రూ.10,999 గా ఉంది.

 

OPPO Reno8 5G స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో8 5జీ లో 6.4 అంగుళాల అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు రెనో8 5జీ లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఒప్పో రెనో8 5జీ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 32ఎంపి కెమెరాను అందించారు. ఇక ఒప్పో రెనో8 5జీ షిమ్మర్ బ్యాక్, షిమ్మర్ గోల్డ్ అనే రెండు రంగుల్లో లభ్యం కానుంది.

 

OPPO Enco X2 స్పెసిఫికేషన్స్

ఇక ఒప్పో ఎన్కో ఎక్స్2 విషయానికి వస్తే, ఇందులో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్, 6ఎంఎం ప్లేనర్ డయాఫ్రమ్ డ్రైవర్ ఉన్నాయి. టీడబ్ల్యూఎస్ లో డ్యూయల్ మైక్రోఫోన్స్, యాక్టివ్ నాయిస్ కాన్సెలేషన్, కాల్ నాయిస్ రిడక్షన్ కోసం ట్రిపుల్ మైక్రోఫోన్ సెటప్, డ్యూయల్ కనెక్షన్ ఫీచర్ (దీని ద్వారా రెండు డివైజెస్ మధ్య కనెక్టివిటీని తేలిగ్గా స్విచ్ అవ్వవచ్చు)

ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, ఒప్పో ఎన్కో ఎక్స్2 టీడబ్ల్యూఎస్ లో ఉన్న 566ఎంఏహెచ్ బ్యాటరీ (కేస్), 40 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇయర్ బడ్స్ ఒక్కో దాంట్లో 57ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఇవి సింగిల్ ఛార్జ్ తో 9.5 గంటల వరకు పని చేస్తాయి.ఈ ఇయర్ బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు క్యూఐ వైర్లెస్ సపోర్ట్ తో వస్తున్నాయి.

The post నేటి నుంచి OPPO Reno8 5G, OPPO Enco X2 సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>