OPPO Watch SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 21 Oct 2022 10:30:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 10 డేస్ బ్యాటరీ లైఫ్, 100 ఫిట్నెస్ మోడ్స్ తో లాంచ్ అయిన OPPO Watch SE: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-watch-se-launched-china-price-specs/ Fri, 21 Oct 2022 10:30:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3017 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన OPPO Watch SE ఈ-సిమ్ సపోర్ట్, స్పోర్ట్స్ మోడ్స్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ తో లాంచ్ అయిన OPPO Watch SE ఇంక్ గ్రే, మిస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO Watch SE స్మార్ట్ వాచ్ OPPO కంపెనీ తాజాగా ఓ కొత్త స్మార్ట్ వాచ్ OPPO Watch SE ని చైనాలో లాంచ్ చేసింది. పేరు వినడానికి ఆపిల్ వాచ్ ఎస్ఈ లాగా […]

The post 10 డేస్ బ్యాటరీ లైఫ్, 100 ఫిట్నెస్ మోడ్స్ తో లాంచ్ అయిన OPPO Watch SE: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన OPPO Watch SE
  • ఈ-సిమ్ సపోర్ట్, స్పోర్ట్స్ మోడ్స్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ తో లాంచ్ అయిన OPPO Watch SE
  • ఇంక్ గ్రే, మిస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO Watch SE స్మార్ట్ వాచ్

OPPO కంపెనీ తాజాగా ఓ కొత్త స్మార్ట్ వాచ్ OPPO Watch SE ని చైనాలో లాంచ్ చేసింది. పేరు వినడానికి ఆపిల్ వాచ్ ఎస్ఈ లాగా కనిపిస్తోంది. OPPO Watch SE బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇకపోతే రీసెంట్ గా ఒప్పో కంపెనీ నుంచి Watch 3, Watch 3 Pro స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా రెక్టాంగ్యులర్ డయల్ తో OPPO Watch SE లాంచ్ అయ్యింది. OPPO Watch SE ఈ-సిమ్ సపోర్ట్, స్పోర్ట్స్ మోడ్స్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ తదితర మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. మరి OPPO Watch SE యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Watch SE ధర, లభ్యత

OPPO Watch SE ప్రస్తుతం చైనా మార్కెట్ లో అందుబాటులో ఉంది. అక్కడ దీని ధర 999 యువాన్లు (సుమారు రూ.11,427) గా ఉంది. అక్టోబర్ 20 నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఇంక్ గ్రే, మిస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ వాచ్ లభించనుంది. భారత్ లో లాంచ్ అయ్యాక ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది. ఇంకా భారత లాంచ్ తేదీకి సంబంధించిన వివరాలు తెలియలేదు. త్వరలోనే ఒప్పో నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

OPPO Watch SE ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

OPPO Watch SE లో 1.75-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 372*430 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్ డిస్ప్లే ఫీచర్ ఇందులో ఉంది.

OPPO Watch SE లో స్నాప్ డ్రాగన్ 4100+ చిప్సెట్ ని అమర్చారు. అలాగే ఇందులో అపోలో 4ఎస్ అనే కస్టమ్ కో-ప్రాసెసర్ కూడా ఉంది. ఇకపోతే ఈ వేరబుల్ 1జిబి ర్యామ్, 8జిబి స్టోరేజీని కలిగి ఉంది.

OPPO Watch SE స్మార్ట్ వాచ్ 24-గంటల హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కలర్ఓఎస్ పై ఈ వాచ్ పని చేస్తుంది. ఇందులో 100 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

OPPO Watch SE స్మార్ట్ వాచ్ 400ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై లైట్ స్మార్ట్ మోడ్ లో 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫుల్ స్మార్ట్ మోడ్ లో 3 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ వాచ్ వూక్2.0 ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 10 నిమిషాల చార్జ్ పై ఒక రోజంతా వాచ్ పని చేస్తుంది.

OPPO Watch SE లో ఈసిమ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్నాయి. కాల్స్ చేయడం, అలీపే, వీచాట్ ద్వారా పేమెంట్ చేయడం వంటి పనులు ఈ వాచ్ తో చేయవచ్చు. అలాగే బైడూ మ్యాప్ నేవిగేషన్ ఇందులో ఉంది. OPPO Watch SE లో బ్లూటూత్, వైఫై సౌకర్యాలు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 10 డేస్ బ్యాటరీ లైఫ్, 100 ఫిట్నెస్ మోడ్స్ తో లాంచ్ అయిన OPPO Watch SE: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>