Ori Devuda - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 16 Nov 2022 14:43:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda https://www.91mobiles.com/telugu/ori-devuda-getting-tremendous-response-on-ott/ Wed, 16 Nov 2022 14:43:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=3487 హైలైట్స్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోన్న ఓరి దేవుడా చిత్రానికి అద్భుతమైన స్పందన 40 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఓరి దేవుడా చిత్రం ఆహాలో ప్రసారమవుతోన్న ఓరి దేవుడా చిత్రం, ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఓరి దేవుడా చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ కి వినోదాన్ని […]

The post OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోన్న ఓరి దేవుడా చిత్రానికి అద్భుతమైన స్పందన
  • 40 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఓరి దేవుడా చిత్రం
  • ఆహాలో ప్రసారమవుతోన్న ఓరి దేవుడా చిత్రం, ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఓరి దేవుడా చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ కి వినోదాన్ని పంచిన ఈ చిత్రం వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. తమిళంలో ఘన విజయం సాధించిన ఓ మై కడవులే చిత్రానికి ఓరి దేవుడా తెలుగు రీమేక్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఓరి దేవుడా సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. కాగా, స్ట్రీమ్ మొదలైన 40 గంటల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఆమేరకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా అధికార ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆహా ఓటీటీ మాంచి జోష్ మీద ఉంది. జనాలు మెచ్చే సినిమాలను ఏరికోరి తీసుకొచ్చే ఆహా చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఇతర భాషల్లో విజయం సాధించిన, కంటెంట్ బాగున్న చిత్రాలను కూడా తెలుగులోకి అనువదించి మన ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా.

ఓరి దేవుడా చిత్రం 40 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించడం చెప్పుకోదగిన విషయం. ఇది ప్రేక్షకులు సినిమా పట్ల చూపిస్తోన్న ఆదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ల నటన, వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించడం వంటి వాటితో సినిమాకు క్రేజ్ ఏర్పడింది. అన్నింటికంటే ముఖ్యంగా కథ ఈ చిత్రానికి ప్రధాన బలం.

ఓరి దేవుడా చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఇతడే ఒరిజినల్ తమిళ వర్షన్ ని తెరకెక్కించాడు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది.

చిత్ర కథ

‘ఓరి దేవుడా’ చిత్ర కథ ఇద్దరు కపుల్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ పాత్రలో విశ్వక్ కనిపిస్తాడు. అర్జున్ తన చిన్ననాటి స్నేహితురాలుని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్ళి తర్వాత జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అతడికి ఆ అమ్మాయి పట్ల లవ్ ఫీలింగ్స్ కలగడపోవడమే అందుకు కారణం. దీంతో ఇద్దరు డివోర్స్ కి సిద్ధమవుతారు. మరి వారి నిర్ణయం సరైనదేనా? వారి వివాహ బంధానికి ఏమైందనేది మిగతా కథ.

సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓరి దేవుడా వినోదాన్ని పంచడం ఖాయం. మిథిలా పాల్కర్, ఆశా భట్ లతో కలిసి విశ్వక్ చేసిన సందడిని చూసి ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>
ఇవాళ రాత్రి 12 గంటల నుంచి OTT లో స్ట్రీమ్ కానున్న Ori Devuda https://www.91mobiles.com/telugu/ori-devuda-movie-ott-streaming-from-today/ Thu, 10 Nov 2022 12:21:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=3370 హైలైట్స్ ఓరి దేవుడా చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ప్రసారం కానున్న ఓరి దేవుడా సినిమా ఓరి దేవుడా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఇటీవలె ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చిత్రబృందం సినిమా […]

The post ఇవాళ రాత్రి 12 గంటల నుంచి OTT లో స్ట్రీమ్ కానున్న Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఓరి దేవుడా చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా
  • ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ప్రసారం కానున్న ఓరి దేవుడా సినిమా
  • ఓరి దేవుడా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్

యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఇటీవలె ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చిత్రబృందం సినిమా విజయం పై ధీమాగా కనిపించింది. మరీ ముఖ్యంగా విశ్వక్ సేన్ హిట్టు పక్కా అనుకున్నాడు. కానీ, ఆశించిన రేంజ్ లో ఫలితం రాలేదు.

సినిమా బాగున్నప్పటికీ ఇతర సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉండటం వల్లన ఓరి దేవుడా కి జనాల తాకిడి లేకుండా పోయింది. విశ్వక్ సేన్ నటన జనాలకు బాగా నచ్చింది. స్టోరీలైన్ కూడా పర్వాలేదనిపించింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపించలేకపోయింది.

పీవీపీ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ చిత్రం తమిళ హిట్ మూవీ ‘ఓ మై కడవులె’ చిత్రానికి రీమేక్. స్టోరీలైన్ కి మంచి మార్కులు పడ్డాయి. అక్కడక్కడా కామెడీ పేలింది. ఇక ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ కనిపించి సందడి చేశారు. అయినప్పటికీ సినిమా మాత్రం అనుకున్న విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

‘ఓరి దేవుడా’ సినిమా నేటి రాత్రి నుంచి ఓటీటీ లో ప్రసారమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో విజయం సాధించేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రానికి మెండుగా ఉన్నాయి. సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓరి దేవుడా వినోదాన్ని పంచడం ఖాయం. మిథిలా పాల్కర్, ఆశా భట్ లతో కలిసి విశ్వక్ చేసిన సందడిని చూసి ఎంజాయ్ చేయండి.

చిత్ర కథ

‘ఓరి దేవుడా’ చిత్ర కథ ఇద్దరు కపుల్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ పాత్రలో విశ్వక్ కనిపిస్తాడు. అర్జున్ తన చిన్ననాటి స్నేహితురాలుని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్ళి తర్వాత జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అతడికి ఆ అమ్మాయి పట్ల లవ్ ఫీలింగ్స్ కలగడపోవడమే అందుకు కారణం. దీంతో ఇద్దరు డివోర్స్ కి సిద్ధమవుతారు. మరి వారి నిర్ణయం సరైనదేనా? వారి వివాహ బంధానికి ఏమైందనేది మిగతా కథ.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎలన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశాడు.

తమిళంలో ఓ మై కడవులె చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించారు. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ రాత్రి 12 గంటల నుంచి OTT లో స్ట్రీమ్ కానున్న Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>