POCO F5 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 May 2023 13:23:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO F5 5G https://www.91mobiles.com/telugu/poco-f5-5g-launched-india-price-specs-availability/ Tue, 09 May 2023 13:23:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=6234 భారత్ లో నేడు POCO F5 5G డివైజ్ లాంచ్ అయ్యింది. అయితే గ్లోబల్ గా POCO F5 Pro డివైజ్ కూడా లాంచ్ అయ్యింది. కానీ, భారత మార్కెట్ లోకి ప్రో వేరియంట్ రాలేదు. రెడ్మీ నోట్ 12 టర్బో ఫోన్ కి రీబ్రాండ్ వర్షన్ గా POCO F5 మార్కెట్ లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, […]

The post స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO F5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అఫీషియల్ గా లాంచైన POCO F5 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • భారత్ లో POCO F5 ధర రూ.29,999 నుంచి ప్రారంభం

భారత్ లో నేడు POCO F5 5G డివైజ్ లాంచ్ అయ్యింది. అయితే గ్లోబల్ గా POCO F5 Pro డివైజ్ కూడా లాంచ్ అయ్యింది. కానీ, భారత మార్కెట్ లోకి ప్రో వేరియంట్ రాలేదు. రెడ్మీ నోట్ 12 టర్బో ఫోన్ కి రీబ్రాండ్ వర్షన్ గా POCO F5 మార్కెట్ లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది.

భారత్ లో POCO F5 5G ధర, కలర్ ఆప్షన్స్

  • 8జిబి/256జిబి: రూ.29,999
  • 12జిబి/256జిబి: రూ.33,999

POCO F5 స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది. ఇక 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

POCO F5 స్మార్ట్ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ, స్నోస్టార్మ్ వైట్, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఐసీఐసీఐ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా రూ.3,000 ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ పొందవచ్చు.

ప్రస్తుతం పోకో ఫోన్ వాడుతోన్న యూజర్లు, రూ.1000 ఎక్స్‌చేంజ్ బోనస్ పొందుతారు. ఫోన్ పై కంపెనీ 2 సంవత్సరాల వ్యారంటీ ఇస్తోంది.

POCO F5 స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మే 16 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ కి వస్తోంది.

POCO F5 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 12-బిట్ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

POCO F5 స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 12-బిట్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బి విజన్, ఐ-ప్రొటెక్షన్ మోడ్, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్/స్టోరేజీ

  • 12జిబి ర్యామ్
  • స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్

POCO F5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి. 12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 7జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

POCO F5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా

  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా

POCO F5 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్, ఈఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ

  • 5జీ, 4జీ ఎల్టీఈ
  • యూఎస్బీ టైప్-సీ

POCO F5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

సౌండ్

  • డాల్బి అట్మాస్
  • హై-రెస్ ఆడియో

POCO F5 స్మార్ట్ ఫోన్ లో హై-రెజ్ ఆడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.

The post స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO F5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? https://www.91mobiles.com/telugu/poco-f5-5g-india-expected-launch-date-april-6-could-be-rebrand-of-redmi-note-12-turbo/ Sat, 18 Mar 2023 15:47:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=5566 పోకో సంస్థ నుంచి త్వరలో రాబోవు POCO F5 5G మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది. 91మొబైల్స్ కి POCO F5 5G లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. POCO F5 5G ఇండియన్ వేరియంట్ 23013PC75I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ స్నాప్ […]

The post ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ఏప్రిల్ 6 న భారత్ లో లాంచ్ కానున్న POCO F5 5G స్మార్ట్ ఫోన్
  • గతేడాది లాంచైన POCO F4 5G కి సక్సెసర్ గా వస్తోన్న POCO F5 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 12జిబి ర్యామ్ తో వస్తోన్న POCO F5 5G

పోకో సంస్థ నుంచి త్వరలో రాబోవు POCO F5 5G మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది. 91మొబైల్స్ కి POCO F5 5G లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారం తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. POCO F5 5G ఇండియన్ వేరియంట్ 23013PC75I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7XX సిరీస్ ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు అంచనా.

భారత్ లో POCO F5 5G ఎప్పుడు లాంచ్ కానుంది?

ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం, POCO F5 5G ఏప్రిల్ 6 న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా లాంచ్ తేదీని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. పోకో సంస్థ POCO F5 5G డివైజ్ ని ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు POCO F5 5G మిడ్ రేంజ్ ఫోన్ యొక్క ధరకు సంబంధించిన సమాచారం ఏమీ తెలియలేదు. అయితే, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం, పోకో సంస్థ ఫోన్ ధరను కాంపెటీటివ్ గానే పెట్టే అవకాశం ఉంది. POCO F4 5G డివైజ్ భారత్ లో రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది.

POCO F5 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

POCO F5 5G స్మార్ట్ ఫోన్ త్వరలో చైనాలో లాంచ్ కాబోయే Redmi Note 12 Turbo కి రీబ్రాండెడ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. POCO F5 5G డివైజ్ 6.67-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Redmi Note 12 Turbo డివైజ్ సరికొత్త స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు ఇటీవలె ఖరారైంది. అంటే, POCO F5 5G కూడా ఇదే చిప్సెట్ తో వచ్చే చాన్స్ ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని POCO F5 5G లో అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేయనుందని అంచనా.

POCO F5 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి సెకండరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం POCO F5 5G లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న POCO F5 5G? first appeared on 91Mobiles Telugu.

]]>