POCO F5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Oct 2022 05:20:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తో వస్తున్న POCO F5 https://www.91mobiles.com/telugu/poco-f5-spotted-on-imei-website-key-specs-revealed/ Tue, 11 Oct 2022 05:20:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=2844 హైలైట్స్ IMEI డేటాబేస్ పై కనిపించిన POCO F5, రివీల్ అయిన ప్రధాన స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తున్న POCO F5 స్మార్ట్ ఫోన్ 23013RK75G, 23013PC75I అనే మోడల్ నంబర్లతో ఐఎంఈఐ డేటాబేస్ లో ఉన్న POCO F5 ఈ ఏడాది ప్రథమార్థంలో పోకో కంపెనీ నుంచి POCO F4 5G స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు […]

The post Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తో వస్తున్న POCO F5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • IMEI డేటాబేస్ పై కనిపించిన POCO F5, రివీల్ అయిన ప్రధాన స్పెసిఫికేషన్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తున్న POCO F5 స్మార్ట్ ఫోన్
  • 23013RK75G, 23013PC75I అనే మోడల్ నంబర్లతో ఐఎంఈఐ డేటాబేస్ లో ఉన్న POCO F5

ఈ ఏడాది ప్రథమార్థంలో పోకో కంపెనీ నుంచి POCO F4 5G స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు పోకో సంస్థ POCO F5 ఫోన్ పై పని చేస్తున్నట్లు Xiaomiui ఓ కథనాన్ని ప్రచురించింది. 23013RK75G, 23013PC75I అనే మోడల్ నంబర్లతో ఐఎంఈఐ డేటాబేస్ పై POCO స్మార్ట్ ఫోన్ కనిపించింది. ఇది POCO F5 అని Xiaomiui అభిప్రాయపడింది.

మాండ్రియన్ అనే కోడ్ నేమ్ ని కలిగిన POCO F5 చైనాలో Redmi K60 సిరీస్ గా లాంచ్ అవుతుందని మరో విషయాన్ని ఈ రిపోర్ట్ తెలిపింది. 2కే రెజుల్యూషన్ డిస్ప్లే ని కల్గిన మొదటి పోకో ఫోన్ POCO F5 అని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి POCO F5 యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

POCO F5 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

POCO F5 2కే రెజుల్యూషన్ గల అమోలెడ్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, POCO F5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడినట్లు సమాచారం. మొత్తానికి ఈ ఫోన్ గ్రేట్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్ తో వస్తుండటం పోకో ఫ్యాన్స్ కి శుభవార్తేనని చెప్పాలి.

ఇక రెడ్మీ కే-సిరీస్ యొక్క రీబ్రాండ్ వర్షన్స్ POCO F2 Pro, POCO F4, POCO F5 అనే పేర్లతో మన ముందుకు వచ్చాయి. Redmi K40S కి రీబ్రాండ్ వర్షన్ గా POCO F4 వచ్చింది. ఇక POCO F3, Redmi K40 కి రీబ్రాండ్ వర్షన్.

2023 మొదటి త్రైమాసికంలో POCO F5 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ డివైజ్ తొలుత Redmi K60 సిరీస్ పేరుతో చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత POCO F5 రూపంలో భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది.

ఇప్పటి వరకు POCO F5 గురించి ఎక్కువ వివరాలు ఏమీ తెలియలేదు. ఏదేమైనా, రానున్న వారాల్లో లేదా నెలల్లో POCO F5 స్మార్ట్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపిస్తుందని అంచనా వేయవచ్చు. 2023 మొదటి మూడు నెలల్లో లాంచ్ అయితే గనుక కచ్చితంగా POCO F5 ఆయా సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించడం ఖాయం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తో వస్తున్న POCO F5 first appeared on 91Mobiles Telugu.

]]>