POCO M5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 05 Sep 2022 13:22:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన POCO M5 https://www.91mobiles.com/telugu/poco-m5-launched-india-price-specs-availability/ Mon, 05 Sep 2022 13:22:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=2105 హైలైట్స్: POCO M5 ఒక 4జీ స్మార్ట్ ఫోన్, దీని ప్రారంభ ధర రూ.12,499 6.58 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సెప్టెంబర్ 13 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న POCO M5 సోమవారం నాడు భారత్ లో POCO M5 యొక్క ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ హ్యాండ్సెట్ పోకో ఎమ్4 కి సక్సెసర్ గా […]

The post మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • POCO M5 ఒక 4జీ స్మార్ట్ ఫోన్, దీని ప్రారంభ ధర రూ.12,499
  • 6.58 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • సెప్టెంబర్ 13 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న POCO M5

సోమవారం నాడు భారత్ లో POCO M5 యొక్క ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ హ్యాండ్సెట్ పోకో ఎమ్4 కి సక్సెసర్ గా వచ్చింది. POCO M5 లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఈ హ్యాండ్సెట్ లో వాటర్ డ్రాప్ నాచ్, ట్రిపుల్ రియర్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్, పాలికార్బొనేట్ బాడీ ఈ ఫోన్లో ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ పాలికార్బొనెట్ మెటీరియల్ తో తయారైంది.

POCO M5 లో 6.58 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బాక్స్ లో 22.5 వాట్ ఫాస్ట్ చార్జర్ ని కంపెనీ అందిస్తోంది.

భారత్ లో POCO M5 ధర, లభ్యత

POCO M5 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.12,499. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.14,499. ఈ ఫోన్ యెల్లో, ఐసీ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కాగా, సెప్టెంబర్ 13 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా, యూజర్లు ఫోన్ పై ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల వరకు ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను పోకో అందిస్తోంది.

POCO M5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

పోకో ఎమ్5 స్మార్ట్ ఫోన్లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, హై-రెజుల్యూషన్ ఆడియో, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్, లెదర్ ఫినిష్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. POCO M5 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్-రియర్ కెమెరా ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఐసోసెల్ జెఎన్1 సెన్సర్ (ఎఫ్/1.8 అపర్చర్) ఉంది. అలాగే 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి సెల్పీ కెమెరాను అమర్చారు. ఇకపోతే ఈ ఫోన్ 201 గ్రాములు బరువు ఉంటుంది. ఈ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్ ఫాస్ట్ చార్జర్ ని కంపెనీ ఫోన్ ద్వారా అందిస్తోంది.

The post మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచ్ అయిన POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>
రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ https://www.91mobiles.com/telugu/poco-m5-poco-m5s-global-launch-price-specs/ Thu, 01 Sep 2022 08:35:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2032 హైలైట్స్: సెప్టెంబర్ 5 న లాంచ్ కానున్న POCO M5, POCO M5s బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5, బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5s POCO M5 ధర EUR 189 (దాదాపు రూ.15,000), POCO M5s ధర EUR 229 (దాదాపు రూ.18,200) ఉండే అవకాశం పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ సెప్టెంబర్ 5 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ […]

The post రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 5 న లాంచ్ కానున్న POCO M5, POCO M5s
  • బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5, బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5s
  • POCO M5 ధర EUR 189 (దాదాపు రూ.15,000), POCO M5s ధర EUR 229 (దాదాపు రూ.18,200) ఉండే అవకాశం

పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ సెప్టెంబర్ 5 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవ్వబోతున్నాయి. ఫోన్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కంపెనీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. పోకో ఎమ్5 మాత్రమే భారత్ లో లాంచ్ కానుంది. అయితే పోకో ఎమ్5ఎస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వట్లేదు. లాంచ్ కి కొన్ని రోజుల ముందు 91మొబైల్స్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ యొక్క ధరలు, వేరియంట్స్, కలర్స్, ఇమేజెస్ మీ ముందుకు తీసుకు వచ్చింది.

పోకో ఎమ్5 బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లభించనుండగా, పోకో ఎమ్5ఎస్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ రెండు ఫోన్స్ బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి వస్తున్నాయి. పోకో ఎమ్5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

POCO M5, POCO M5s డిజైన్

POCO M5: పోకో ఎమ్5 లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇందులో సెల్ఫీ షూటర్ ఉంటుంది. అలాగే స్క్రీన్ క్రింద భాగాన గుర్తించదగిన చిన్ ఉంది. ఫోన్ కి కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. వెనకాల లెదర్ ఫినిష్ తో ఫోన్ సూపర్ గా కనిపిస్తోంది. ట్రిపుల్ కెమెరా కోసం బ్యాక్ ప్యానెల్ పై భారీ సెటప్ ఉంది. ఇందులో కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. గ్రీన్, యెల్లో, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

POCO M5s: పోకో ఎమ్5ఎస్ విభిన్నమైన డిజైన్ లాంగ్వేజీని కలిగి ఉంది. సెల్ఫీ కొరకు సెంటర్-పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. అన్ని కార్నర్స్ లో స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ కుడివైపున ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్ లో ఉన్నట్లు ఉంది. ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ స్క్వేర్ మాడ్యూల్ లో ఉన్నాయి. పోకో బ్రాండింగ్ ని బ్యాక్ ప్యానెల్ పై మనం గమనించవ్చు. పోకో ఎమ్5ఎస్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M5, POCO M5s ధర, వేరియంట్స్

పోకో ఎమ్5 స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి మోడల్స్ లో లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా EUR 189 (దాదాపు రూ.15,000), EUR 209 (రూ.16,600).

ఇక పోకో ఎమ్5ఎస్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి వేరియంట్ ధరలు వరుసగా EUR 229 (రూ.18,200), EUR 249 (దాదాపు రూ.19,800).

The post రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న POCO M5 4G https://www.91mobiles.com/telugu/poco-m5-launch-september-india-specs-price/ Tue, 23 Aug 2022 06:21:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=1830 హైలైట్స్: సెప్టెంబర్ మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానున్న పోకో ఎమ్5 4జీ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో రానున్న పోకో ఎమ్5 4జీ భారత్ లో పోకో ఎమ్5 4జీ ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం రీసెంట్ గా పోకో కంపెనీ భారత్ లో పోకో ఎఫ్4 పేరుతో ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో పోకో ఎమ్5 4జీ అనే ఫోన్ ని లాంచ్ […]

The post వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న POCO M5 4G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానున్న పోకో ఎమ్5 4జీ
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో రానున్న పోకో ఎమ్5 4జీ
  • భారత్ లో పోకో ఎమ్5 4జీ ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం

రీసెంట్ గా పోకో కంపెనీ భారత్ లో పోకో ఎఫ్4 పేరుతో ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో పోకో ఎమ్5 4జీ అనే ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని, ఇండస్ట్రీ వర్గాల ద్వారా 91మొబైల్స్ కి సమాచారం అందింది. ఎమ్-సిరీస్ లో రానున్న ఈ ఫోన్ పోకో ఎమ్4 కి సక్సెసర్ కానుంది. లాంచ్ టైమ్ లైన్ తో పాటు, కీలక స్పెసిఫికేషన్స్, భారత్ లో ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను మేం తెలుసుకోగలిగాం.

పోకో ఎమ్5 ఒక 4జీ ఎల్టీఈ ఫోన్. అయితే దీని తర్వాత 5జీ వర్షన్ కూడా లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని కలిగి ఉండనుందని సమాచారం. ఈ ప్రాసెసర్ బడ్జెట్ గేమింగ్-సెంట్రిక్ చిప్సెట్ గా చెప్పబడుతోంది.

భారత్ లో POCO M5 4G లాంచ్ టైమ్ లైన్

సెప్టెంబర్ మొదటి వారంలో పోకో ఎమ్5 4జీ భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే అవకాశముంది.

భారత్ లో POCO M5 4G ధర

భారత్ లో పోకో ఎమ్5 4జీ ధర రూ.15,000 లోపు ఉండే అవకాశముంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టి ఈ విషయాలు తెలిశాయి. అయితే ఇది బేస్ మోడల్ ధర అని భావించాలి. ఇతర ఆప్షన్స్ కి ధర కాస్త ఎక్కువగా ఉండనుంది.

POCO M5 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే పోకో ఎమ్5 4జి లో ఉండనుంది. ఇది ఎల్సీడీ ప్యానెల్ అయ్యే అవకాశముంది. ఇక మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్లో ఉండనున్నాయి. ఈ ఫోన్ చిక్-లెదర్-లైక్ బ్యాక్ డిజైన్ తో రానుందని సమాచారం. ఈ లుక్ ఎంతో బాగుండనుంది.

పోకో ఎమ్5 4జీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది. డ్యూయల్ బ్యాండ్ వై-ఫై కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, 6జిబి ర్యామ్ ఈ ఫోన్లో ఉంటాయని అంచనా. కెమెరా విభాగానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియదు. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఇందులో ఉండే అవకాశముంది. దాంతో పాటు మరో రెండు సెన్సర్లు ఉండవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, 13 లేదా 8 మెగా పిక్సెల్ కెమెరా ఉండే అవకాశముంది. వచ్చే నెలలో ఫోన్ లాంచ్ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

The post వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న POCO M5 4G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న POCO M5 https://www.91mobiles.com/telugu/poco-m5-to-launch-in-india-spotted-on-bis-website/ Fri, 22 Jul 2022 06:47:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=1161 హైలైట్స్: పోకో ఎమ్5 సిరీస్ పై కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించిన పోకో ఎమ్5, త్వరలోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో, పోకో ఎమ్5 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. పోకో ఎమ్5 సిరీస్ లో పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ ఉంటాయి. ఈ మధ్య […]

The post త్వరలో లాంచ్ కానున్న POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • పోకో ఎమ్5 సిరీస్ పై కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం
  • ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్
  • బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించిన పోకో ఎమ్5, త్వరలోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో, పోకో ఎమ్5 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. పోకో ఎమ్5 సిరీస్ లో పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పోకో ఎమ్5 పోన్ పలు సర్టిఫికేషన్ అథారిటీ వెబ్ సైట్స్ పై కనిపిస్తోంది.ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5 ఇండియన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై దర్శనమిచ్చింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది.

బీఐఎస్ లో లిస్ట్ అయిన POCO M5

ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశాడు. పోకో ఎమ్5 (మోడల్ నంబర్ 22071219సీఐ) బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిందని అతడు చెప్పాడు. అయితే బీఐఎస్ లిస్టింగ్ తో ఫోన్ కచ్చితంగా లాంచ్ అవుతుందని చెప్పలేం. అయితే, భారత్ లో సదరు డివైజ్ లాంచ్ అయ్యేందుకు కొంతవరకు మార్గం సుగమమైందని దీనర్థం. అంటే త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందన్న మాట.

POCO M5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

గత నివేదికల ఆధారంగా పోకో ఎమ్5 4జీ డివైజ్ అని తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ ఎన్ఎఫ్సీ కి సంపోర్ట్ చేస్తుందని సమాచారం. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, పోకో ఎమ్5 ఆండ్రాయిడ్ 12 ఆధారిత, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇక పోకో ఎమ్5, మీడియాటెక్ 4జీ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు చూద్దాం. ఈ ఫోన్లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. పోకో ఎమ్5 లో 50ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి సెల్ఫీ షూటర్ ఉండనున్నాయి. పోకో ఎమ్5 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ఉండనుంది. ఫీచర్లకు సంబంధించిన ఇతర వివరాలు, లాంచ్ తేదీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తుంది. అయితే ఇది నివేదికల ఆధారంగా తెలుస్తున్న విషయం మాత్రమే. లాంచ్ అనంతరం, ఏయే ఫీచర్లు ఉంటాయో పూర్తి వివరాలు తెలుస్తాయి.

కాగా, ఇటీవలె పోకో కంపెనీ నుంచి పోకో ఎఫ్4 5జీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ భారత మార్కెట్ లో బాగా అమ్ముడైంది. దీంతో మాంచి జోష్ లో ఉన్న పోకో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పోకో ఎమ్5 సిరీస్ ను లాంచ్ చేయాలని సదరు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇక పోకో ఎమ్5ఎస్ ఫోన్, రెడ్ మీ నోట్ 10ఎస్ కి రీబ్రాండెడ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోకో ఎమ్5ఎస్ లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కొరకు 91మొబైల్స్ తెలుగు ని ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>