POCO M5s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Sep 2022 08:35:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ https://www.91mobiles.com/telugu/poco-m5-poco-m5s-global-launch-price-specs/ Thu, 01 Sep 2022 08:35:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2032 హైలైట్స్: సెప్టెంబర్ 5 న లాంచ్ కానున్న POCO M5, POCO M5s బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5, బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5s POCO M5 ధర EUR 189 (దాదాపు రూ.15,000), POCO M5s ధర EUR 229 (దాదాపు రూ.18,200) ఉండే అవకాశం పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ సెప్టెంబర్ 5 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ […]

The post రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 5 న లాంచ్ కానున్న POCO M5, POCO M5s
  • బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5, బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO M5s
  • POCO M5 ధర EUR 189 (దాదాపు రూ.15,000), POCO M5s ధర EUR 229 (దాదాపు రూ.18,200) ఉండే అవకాశం

పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ సెప్టెంబర్ 5 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవ్వబోతున్నాయి. ఫోన్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కంపెనీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. పోకో ఎమ్5 మాత్రమే భారత్ లో లాంచ్ కానుంది. అయితే పోకో ఎమ్5ఎస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వట్లేదు. లాంచ్ కి కొన్ని రోజుల ముందు 91మొబైల్స్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ యొక్క ధరలు, వేరియంట్స్, కలర్స్, ఇమేజెస్ మీ ముందుకు తీసుకు వచ్చింది.

పోకో ఎమ్5 బ్లాక్, యెల్లో, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లభించనుండగా, పోకో ఎమ్5ఎస్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ రెండు ఫోన్స్ బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి వస్తున్నాయి. పోకో ఎమ్5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

POCO M5, POCO M5s డిజైన్

POCO M5: పోకో ఎమ్5 లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇందులో సెల్ఫీ షూటర్ ఉంటుంది. అలాగే స్క్రీన్ క్రింద భాగాన గుర్తించదగిన చిన్ ఉంది. ఫోన్ కి కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. వెనకాల లెదర్ ఫినిష్ తో ఫోన్ సూపర్ గా కనిపిస్తోంది. ట్రిపుల్ కెమెరా కోసం బ్యాక్ ప్యానెల్ పై భారీ సెటప్ ఉంది. ఇందులో కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. గ్రీన్, యెల్లో, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

POCO M5s: పోకో ఎమ్5ఎస్ విభిన్నమైన డిజైన్ లాంగ్వేజీని కలిగి ఉంది. సెల్ఫీ కొరకు సెంటర్-పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. అన్ని కార్నర్స్ లో స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ కుడివైపున ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్ లో ఉన్నట్లు ఉంది. ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ స్క్వేర్ మాడ్యూల్ లో ఉన్నాయి. పోకో బ్రాండింగ్ ని బ్యాక్ ప్యానెల్ పై మనం గమనించవ్చు. పోకో ఎమ్5ఎస్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M5, POCO M5s ధర, వేరియంట్స్

పోకో ఎమ్5 స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి మోడల్స్ లో లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా EUR 189 (దాదాపు రూ.15,000), EUR 209 (రూ.16,600).

ఇక పోకో ఎమ్5ఎస్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి వేరియంట్ ధరలు వరుసగా EUR 229 (రూ.18,200), EUR 249 (దాదాపు రూ.19,800).

The post రివీల్ అయిన POCO M5, POCO M5s కలర్స్, వేరియంట్స్, ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>