POCO M6 Pro 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jan 2024 16:56:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: MediaTek Helio G99 Ultra చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO M6 Pro 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-m6-pro-4g-globally-launched-with-mediatek-helio-g99-ultra/ Thu, 11 Jan 2024 16:56:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9692 Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు గ్లోబల్ మార్కెట్స్ లో POCO M6 Pro 4G డివైజ్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ కూడా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. ఇక POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, అమోలెడ్ ప్యానెల్ […]

The post POCO: MediaTek Helio G99 Ultra చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO M6 Pro 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన POCO M6 Pro 4G
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్
  • POCO M6 Pro 4G ధర 179 డాలర్లు

Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు గ్లోబల్ మార్కెట్స్ లో POCO M6 Pro 4G డివైజ్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ కూడా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. ఇక POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, అమోలెడ్ ప్యానెల్ వంటి ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి POCO M6 Pro 4G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G ధర, కలర్ ఆప్షన్స్

  • POCO M6 Pro 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 179 డాలర్లు (సుమారు రూ.14,900) గా ఉంది.
  • POCO M6 Pro 4G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 229 డాలర్లు (సుమారు రూ.19,000) గా ఉంది.
  • POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ ఏయే మార్కెట్స్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ వెల్లడించాల్సి ఉంది.
  • POCO M6 Pro 4G డివైజ్ బ్లూ, బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M6 Pro 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO M6 Pro 4G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో, వెట్ టచ్ డిస్ప్లే, 10-బిట్ ప్యానెల్, డీసీఐ పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO M6 Pro 4G లో మీడియాటెక్ హీలియో జీ99 అల్ట్రా చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఇచ్చారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 Pro 4G లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: POCO M6 Pro 4G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: POCO M6 Pro 4G లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి మ్యాక్రో కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO M6 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: POCO M6 Pro 4G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఇచ్చారు.
  • ఆడియో: POCO M6 Pro 4G లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: POCO M6 Pro 4G లో ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: POCO M6 Pro 4G డివైజ్ 161.1 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది.
  • కలర్ ఆప్షన్స్: POCO M6 Pro 4G డివైజ్ బ్లాక్, పర్పుల్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post POCO: MediaTek Helio G99 Ultra చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO M6 Pro 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-m6-pro-4g-global-launch-date-officially-confirmed/ Thu, 04 Jan 2024 04:29:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9551 Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో M6 సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Pro 4G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జనవరి 11వ తేదీన POCO M6 Pro 4G గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే POCO M6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కాస్త చవకైన 4జీ వర్షన్ ని తీసుకొస్తున్నారు. […]

The post POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 11వ తేదీన లాంచ్ కానున్న డివైజ్
  • 12జిబి+512జిబి స్టోరేజీతో వస్తోన్న M6 Pro 4G

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో M6 సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Pro 4G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జనవరి 11వ తేదీన POCO M6 Pro 4G గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే POCO M6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కాస్త చవకైన 4జీ వర్షన్ ని తీసుకొస్తున్నారు. సరే, ఓసారి POCO M6 Pro 4G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ

  • POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీని పోకో సంస్థ తన X ఖాతా మరియు అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ చేసింది.
  • POCO M6 Pro 4G డివైజ్ జనవరి 11 వ తేదీన రాత్రి 8 గంటలకు గ్లోబల్ గా లాంచ్ అవుతోంది.
  • POCO M6 Pro 4G డివైజ్ ఇప్పటికే యూఏఈ అమెజాన్ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో ధర మరియు స్టోరేజీ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి.
  • POCO M6 Pro 4G యూఏఈ అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఫోన్ ధర సుమారు రూ.20,000 ఉంటుందని తెలుస్తోంది. లాంచ్ సమయంలో దీని కంటే ఇంకా తక్కువ ధరే ఉండనుందని భావిస్తున్నారు.
  • POCO M6 Pro 4G కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. పర్పుల్, బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. త్వరలోనే ఇండియా లాంచ్ వివరాలను కూడా వెలువడే అవకాశం ఉంది.

POCO M6 Pro 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO M6 Pro 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 Pro 4G లో మీడియాటెక్ మీలియో జీ99 చిప్సెట్ వాడనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 Pro 4G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అలాగే వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.
  • కెమెరా: POCO M6 Pro 4G లో 64ఎంపి ఏఐ/ఓఐఎస్ మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: POCO M6 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: POCO M6 Pro 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post POCO M6 Pro 4G గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G https://www.91mobiles.com/telugu/poco-m6-pro-4g-redmi-note-13-pro-4g-spotted-fcc-certification-key-details/ Wed, 08 Nov 2023 06:06:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8755 Xiaomi సబ్-బ్రాండ్స్ Poco మరియు Redmi త్వరలో రెండు చౌక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఫోన్లు POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G పేర్లతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ద్వారా డివైజెస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. POCO M6 Pro […]

The post FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G
  • తాజాగా ఎఫ్‌సీసీ సైట్ పై లిస్టైన డివైజెస్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోన్న ఫోన్లు

Xiaomi సబ్-బ్రాండ్స్ Poco మరియు Redmi త్వరలో రెండు చౌక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఫోన్లు POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G పేర్లతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ద్వారా డివైజెస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G FCC లిస్టింగ్

  • POCO M6 Pro 4G డివైజ్ 2312FPCA6G అనే మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తోన్న POCO M6 Pro 4G
  • Redmi Note 13 Pro 4G (23117RA68G) కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 4G వస్తున్నట్లు సమాచారం.
  • ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • Redmi Note 13 Pro 4G విషయానికి వస్తే, 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వస్తోంది.
  • Redmi Note 13 Pro 4G డివైజ్ ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

Redmi Note 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>