POCO X6 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jan 2024 14:03:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-x6-5g-x6-pro-5g-launched-india-know-the-price-specs/ Thu, 11 Jan 2024 14:03:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9689 Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా POCO X6 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO X6 మరియు POCO X6 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో POCO X6 సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. POCO X6 Pro వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా […]

The post POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన POCO X6 సిరీస్
  • 64ఎంపి ఓఐఎస్ లెన్స్ తో వచ్చిన డివైజెస్
  • POCO X6 ప్రారంభ ధర రూ.19,999

Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా POCO X6 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో POCO X6 మరియు POCO X6 Pro ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో POCO X6 సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. POCO X6 Pro వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ యొక్క ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X6 సిరీస్ ధర, లభ్యత

POCO X6 సిరీస్ పై ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా రూ.2,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ని పోకో సంస్థ ఆఫర్ చేస్తోంది. ఆఫర్స్ తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

  • POCO X6 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
  • POCO X6 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.
  • POCO X6 Pro 8జిబి + 256జిబి మోడల్ ధరను రూ.24,999 గా ఉంది.
  • POCO X6 Pro 12జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
  • POCO X6 డివైజ్ మిర్రర్ బ్లాక్ మరియు స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • POCO X6 Pro డివైజ్ రేసింగ్ గ్రే, స్పెక్ట్రే బ్లాక్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO X6 సిరీస్ ప్రీ-బుకింగ్ జనవరి 11 న రాత్రి 8 గంటల నుంచి మొదలవుతుంది.
  • జనవరి 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి POCO X6 సిరీస్ ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

POCO X6 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 5G లో 6.67-ఇంచ్ క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2712*1220 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వెట్ టచ్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: POCO X6 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
  • కెమెరా: POCO X6 5G లో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఆడియో: POCO X6 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో (వైర్డ్ అండ్ వైర్లెస్), 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • బ్యాటరీ: POCO X6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కలర్ ఆప్షన్స్: POCO X6 5G మిర్రర్ బ్లాక్, స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO X6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO X6 Pro 5G లో 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 12-బిట్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 68 బిలియన్ కలర్స్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 94% స్క్రీన్ టు బాడీ రేషియో, వెట్ టచ్ డిస్ప్లే, అడాప్టివ్ హెచ్డీఆర్, ప్రో హెచ్డీఆర్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ట్రూ కలర్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO X6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ615 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: POCO X6 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: POCO X6 Pro 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
  • కెమెరా: POCO X6 Pro 5G లో 64ఎంపి ఓఐఎస్, ఈఐఎస్ 1/2-ఇంచ్ మెయిన్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, డ్యూయల్-టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: POCO X6 Pro 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఆడియో: POCO X6 Pro 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో (వైర్డ్ అండ్ వైర్లెస్), 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: POCO X6 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 5000ఎంఎం స్క్వేర్ లిక్విడ్ కూల్ టెక్నాలజీ 2.0, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: POCO X6 Pro 5G డివైజ్ స్పెక్ట్రే బ్లాక్, రేసింగ్ గ్రే, పోకో యెల్లీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post POCO: భారత్‌లో లాంచైన POCO X6 5G, X6 Pro 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన POCO X6 Pro 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-x6-pro-5g-bis-certification-website/ Tue, 07 Nov 2023 10:32:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8734 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO X6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO X సిరీస్ Redmi Note 13 Pro కి రీబ్రాండ్ గా వస్తున్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ లో POCO X6 Pro 5G లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి POCO X6 […]

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన POCO X6 Pro 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO X6 Pro 5G
  • బీఐఎస్ పై కనిపించిన డివైజ్
  • డిసెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO X6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO X సిరీస్ Redmi Note 13 Pro కి రీబ్రాండ్ గా వస్తున్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ లో POCO X6 Pro 5G లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి POCO X6 Pro 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X6 Pro 5G బీఐఎస్ లిస్టింగ్

POCO X6 Pro 5G డివైజ్ యొక్క బీఐఎస్ లిస్టింగ్ ని The Tech Outlook గుర్తించింది. అయితే POCO X6 Pro 5G బీఐఎస్ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. కానీ, POCO X6 Pro 5G డివైజ్ లిస్టింగ్ పై 23122PCD1I అనే మోడల్ నంబర్ తో ఉంది. ఇకపోతే POCO X6 Pro 5G డివైజ్ ఇప్పటికే ఐఎంఈఐ డేటాబేస్ పై సేమ్ మోడల్ నంబర్ తో కనిపించింది. త్వరలోనే POCO X6 Pro 5G భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

POCO X6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO X6 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీఐ-పీ3 100 పర్సెంట్ వైడ్ కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO X6 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయని అంచనా.
  • మెమొరీ: POCO X6 Pro 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: POCO X6 Pro 5G లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పి3 ప్రైమరీ 7పి లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. POCO X6 Pro 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: POCO X6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: POCO X6 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.

రానున్న రోజుల్లో POCO X6 Pro 5G కి సంబంధించిన మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అలాగే భారత మార్కెట్ లాంచ్ పై కూడా ఏదైనా ప్రకటన వెలువడవచ్చు.

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన POCO X6 Pro 5G; త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>