Ravi Teja - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:34:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! https://www.91mobiles.com/telugu/mass-maharaja-raviteja-dhamaka-trending-number-2-netflix-ott/ Mon, 30 Jan 2023 12:12:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4689 రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ధమాకా థియేటర్లలో బంపర్ హిట్ అయ్యింది. వినోదంతో పాటు, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక రవితేజ సినిమాలంటే యాక్షన్ కామెడీ చిత్రాలే గుర్తుకువస్తాయి. ఆ జోనర్ మాస్ మహారాజాకి బాగా కలిసొచ్చిన జోనర్. మాస్ మహారాజా చిత్రాలంటే ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో సినిమా బాగుంటే కాసుల వర్షం కురవడం ఖాయమే. ఎన్నో రోజులుగా సరైన […]

The post Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న లేటెస్ట్ సినిమా ధమాకా
  • ప్రస్తుతం టాప్-10 మూవీస్ లో ట్రెండ్ అవుతోన్న ధమాకా చిత్రం
  • ధమాకా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రవితేజ, శ్రీలీల.. దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కిన

రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ధమాకా థియేటర్లలో బంపర్ హిట్ అయ్యింది. వినోదంతో పాటు, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక రవితేజ సినిమాలంటే యాక్షన్ కామెడీ చిత్రాలే గుర్తుకువస్తాయి. ఆ జోనర్ మాస్ మహారాజాకి బాగా కలిసొచ్చిన జోనర్. మాస్ మహారాజా చిత్రాలంటే ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో సినిమా బాగుంటే కాసుల వర్షం కురవడం ఖాయమే.

ఎన్నో రోజులుగా సరైన హిట్ లేని రవితేజకి దర్శకుడు త్రినాథ రావు నక్కిన అద్భుతమైన విజయాన్ని అందించారు. ధమాకా దనాదన్ హిట్టు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రవితేజ మాస్ జాతర కొనసాగింది. ఇక థియెట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్ గా ముగుంచికుని ఓటీటీలోకి వచ్చిన ధమాకా చిత్రం అక్కడ కూడా వంద మార్కులు సంపాదించింది.

ధమాకా చిత్రం కోసం ఎదురు చూసిన ఓటీటీ ఆడియన్స్ కోసం వారం క్రితం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి వచ్చిన సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం టాప్-2 లో ట్రెండ్ అవుతోందని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో మాస్ మహారాజా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అర్థమవుతోంది.

మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం, రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, భీమ్స్ సంగీతం, దర్శకుడి ప్రతిభ వెరసి ధమాకా చిత్రం ఓటీటీలో తన విజయపరంపరను కొనసాగిస్తోంది.

ధమాకా చిత్ర కథ

ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కథ విషయానికి వస్తే, కథానాయకుడి తండ్రి నుంచి కంపెనీని లాగేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించే విలన్ ని హీరో ఎలా నిలువరించాడన్నదే కథ. కథానాయికగా శ్రీలీల నటించింది. విలన్ పాత్రలో జయరామ్ నటించారు. రావు రమేశ్, పవిత్ర లోకేశ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, తులసి, అలీ, హైపర్ ఆది చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

ధమాకా చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. భీమ్స్ సెసిరొలియో సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం నిర్మితమైంది.

ధమాకా బాక్సాఫీస్

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా చిత్రం 2022 డిసెంబర్ 23 న థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వెంటనే పుంజుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్లను కలెక్ట్ చేసి మాస్ మహారాజా కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! first appeared on 91Mobiles Telugu.

]]>
రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ https://www.91mobiles.com/telugu/raviteja-sreeleela-dhamaka-movie-ott-update-netflix/ Wed, 28 Dec 2022 14:42:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=4223 హైలైట్స్ ఇటీవలె థియేటర్లలో విడుదలైన రవితేజ నటించిన ధమాకా సినిమా థియేటర్లలో దూసుకెళ్తోన్న ధమాకా చిత్రం, కథానాయికగా చేసిన శ్రీలీల ధమాకా చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కినా మాస్ మహారాజా రవితేజ చిత్రమంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మాంచి బజ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా రవితేజ సినిమాలు ఉంటాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టెయినర్లకు కేరాఫ్ అడ్రస్ మాస్ రాజా రవితేజ. అయితే ఇటీవలి కాలంలో సరైన హిట్టు […]

The post రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె థియేటర్లలో విడుదలైన రవితేజ నటించిన ధమాకా సినిమా
  • థియేటర్లలో దూసుకెళ్తోన్న ధమాకా చిత్రం, కథానాయికగా చేసిన శ్రీలీల
  • ధమాకా చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కినా

మాస్ మహారాజా రవితేజ చిత్రమంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మాంచి బజ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా రవితేజ సినిమాలు ఉంటాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టెయినర్లకు కేరాఫ్ అడ్రస్ మాస్ రాజా రవితేజ. అయితే ఇటీవలి కాలంలో సరైన హిట్టు లేక రవితేజ ఢీలా పడిపోయారు.

కానీ, తాజాగా వచ్చిన ధమాకా చిత్రంతో త్రినాథ రావు నక్కిన, మాస్ మహారాజా రవితేజకి బంపర్ హిట్ ఇచ్చారు. తొలుత ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆడియన్స్ మౌత్ టాక్ వల్లన తర్వాత మెల్లగా పుంజుకుంది. ఇక రవితేజ చిత్రం థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం, రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, భీమ్స్ సంగీతం, దర్శకుడి ప్రతిభ వెరసి ధమాకా పేరుకి తగినట్లుగానే అందరికీ ధమాకా హిట్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.

ధమాకా మూవీ ఓటీటీ పార్ట్నర్

ఒక చిత్రం థియేటర్లలో సక్సెస్ అయ్యిందంటే ఆ చిత్రానికి ఓటీటీ సైట్స్ నుంచి భారీ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ధమాకా చిత్రం యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ధమాకా తన థియెట్రికల్ రన్ ముగించాక నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో చిత్రాన్ని చూడలేని వారికి, మరోసారి ఫ్యామిలీతో కలిసి చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ధమాకా ఓటీటీ మాధ్యమం లోకి వచ్చేస్తోంది. ధమాకా రాకతో ఇక ఓటీటీ ఆడియన్స్ కి పండగేనని చెప్పాలి.

రవితేజ, శ్రీలీల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ధమాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. తనికెళ్ళ భరణి, తులసి, సచిన్ ఖేడేకర్, పవిత్ర లోకేశ్, అలీ, రావు రమేశ్, హైపర్ ఆది తదితరలు కీలక పాత్రలు పోషించారు.

విదేశాల్లో ధనాధన్ ‘ధమాకా’

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా తన సత్తా చూపెడుతోంది. నిజానికి, మాస్ మసాలా చిత్రాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు. కానీ మాస్ మహారాజా చిత్రానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

రవితేజ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ధమాకా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మాస్ మహారాజా తన ఖాతాలో చాలా కాలం తర్వాత హిట్ వేసుకోవడమే గాక, జనాలను కూడా విపరీతంగా అలరిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు https://www.91mobiles.com/telugu/mass-maharaja-raviteja-films-on-amazon-prime-video/ Tue, 29 Nov 2022 11:01:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3731 మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా రవితేజకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ కామెడీ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ తన స్టార్డమ్ ని అలాగే నిలబెట్టకుంటున్నారు. ప్రేక్షకుల్లో కూడా రవితేజ కొత్త సినిమా ఎప్పుడస్తుందా అనే ఉత్సుకత ఉంటుంది. ఆమధ్య కరోనా తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో […]

The post Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Mass Maharaja Ravi Teja

మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా రవితేజకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ కామెడీ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ తన స్టార్డమ్ ని అలాగే నిలబెట్టకుంటున్నారు. ప్రేక్షకుల్లో కూడా రవితేజ కొత్త సినిమా ఎప్పుడస్తుందా అనే ఉత్సుకత ఉంటుంది.

ఆమధ్య కరోనా తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో సినీ పరిశ్రమ దారుణంగా కుదేలైన సంగతి తెలిసిందే. అప్పుడొచ్చింది రవితేజ నటించిన క్రాక్ సినిమా. మళ్ళీ థియేటర్లకు జనాలను రాబట్టడమే కాదు, బ్లాక్‌బస్టర్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 50 శాతం ఆక్యుపెన్సీ రేషియోతోనే క్రాక్ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి రవితేజ్ స్టామినా ఏంటో నిరూపించింది.

త్వరలో రవితేజ, చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అలాగే రవితేజ ప్రధాన పాత్రలో ధమాకా అనే సినిమా కూడా త్వరలో రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న రవితేజ సినిమాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Amazon Prime Video లో రవితేజ సినిమాలు

 

1. విక్రమార్కుడు

మాస్ మహారాజా రవితేజ, అనుష్క శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. రవితేజ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, దొంగగా డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.

2. భద్ర

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా వచ్చిన భద్ర చిత్రంలో రవితేజ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

3. కృష్ణ

వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. చక్రి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రవితేజ, త్రిష జంటగా నటించారు.

4. సింధూరం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రవితేజ తన నటనతో నవ్వులు పూయించారు. సంఘవి కథానాయికగా చేసింది.

5. టచ్ చేసి చూడు

ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెడ్డీ దారువాలా, మురళీశర్మ, సుహాసిని మణిరత్నం ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యారు.

6. అమర్ అక్బర్ ఆంటోని

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదు. ఈ చిత్రంలో రవితేజ, ఇలియాన జంటగా నటించారు. సునీల్, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, ఆదిత్య ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>