Realme 10 Pro 5G Coca Cola Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 10 Feb 2023 13:11:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Realme 10 Pro 5G Coca-Cola Edition https://www.91mobiles.com/telugu/realme-10-pro-5g-coca-cola-edition-launched-india-price-specs-availability/ Fri, 10 Feb 2023 13:11:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4873 Realme 10 Pro 5G Coca-Cola Edition భారత్ లో లాంచైంది. ఇది స్పెషల్ ఎడిషన్ ఫోన్. ఇప్పటికే ఉన్న Realme 10 Pro 5G ఫోన్ ని కోకాకోలా బ్రాండింగ్ తో స్పెషల్ గా రియల్మీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. ఒకవైపు రియల్మీ లోగో, మరొకవైపు కోకాకోలా బ్రాండింగ్ కనిపిస్తున్నాయి. పంచ్ హోల్ కటౌట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. […]

The post భారత్‌లో లాంచైన Realme 10 Pro 5G Coca-Cola Edition first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన రియల్మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఫోన్
  • డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చిన Realme 10 Pro 5G Coca-Cola Edition
  • భారత్ లో Realme 10 Pro 5G Coca-Cola Edition ధర రూ.20,999

Realme 10 Pro 5G Coca-Cola Edition భారత్ లో లాంచైంది. ఇది స్పెషల్ ఎడిషన్ ఫోన్. ఇప్పటికే ఉన్న Realme 10 Pro 5G ఫోన్ ని కోకాకోలా బ్రాండింగ్ తో స్పెషల్ గా రియల్మీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. ఒకవైపు రియల్మీ లోగో, మరొకవైపు కోకాకోలా బ్రాండింగ్ కనిపిస్తున్నాయి. పంచ్ హోల్ కటౌట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme 10 Pro 5G Coca-Cola Edition లో ఒరిజినల్ మోడల్ మాదిరే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 108ఎంపి శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

భారత్ లో Realme 10 Pro 5G Coca-Cola Edition ధర, లభ్యత

Realme 10 Pro 5G Coca-Cola Edition 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ ని ఫ్లిప్ కార్ట్ మరియు రియల్మీ.కామ్, ఇంకా ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా ఫిబ్రవరి 14 నుంచి కొనుగోలు చేయవచ్చు. భారత్ లో కేవలం 1000 యూనిట్స్ మాత్రమే సేల్ కి అందుబాటులో ఉన్నాయి.

Realme 10 Pro 5G స్టాండర్డ్ మోడల్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉండగా, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది.

Realme 10 Pro 5G Coca-Cola Edition స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G Coca-Cola Edition లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ని వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.76 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, డీసీ డిమ్మింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, పంచ్-హోల్ కటౌట్, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 108 ఎంపి శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, Geco Micro GC02M1 సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో లాంచైన Realme 10 Pro 5G Coca-Cola Edition first appeared on 91Mobiles Telugu.

]]>