Realme 10 Pro Coca-Cola Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:46:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఫిబ్రవరి 10 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G Coca-Cola Edition https://www.91mobiles.com/telugu/realme-10-pro-coca-cola-edition-india-launch-date/ Thu, 02 Feb 2023 15:33:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4766 Realme 10 Pro 5G Coca-Cola Edition లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ఖరారు చేసింది. ఫిబ్రవరి 10 న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కోకా కోలా ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. గతేడాది భారత్ లో లాంచైన Realme 10 Pro 5G ఫోన్ కోకా కోలా స్పెషల్ ఎడిషన్ గా మార్కెట్ లోకి వస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ లాంచ్ పోస్టర్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలుస్తోంది. అలాగే డెడికేటెడ్ […]

The post ఫిబ్రవరి 10 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G Coca-Cola Edition first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 10 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G Coca-Cola Edition
  • డిజైన్ విభాగంలో పలు మార్పులతో రానున్న రియల్మీ 10 ప్రో 5జీ స్పెషల్ ఎడిషన్
  • కోకా-కోలా తో జట్టుకట్టి స్పెషల్ వేరియంట్ ని తీసుకొస్తోన్న Realme సంస్థ

Realme 10 Pro 5G Coca-Cola Edition లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ఖరారు చేసింది. ఫిబ్రవరి 10 న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కోకా కోలా ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. గతేడాది భారత్ లో లాంచైన Realme 10 Pro 5G ఫోన్ కోకా కోలా స్పెషల్ ఎడిషన్ గా మార్కెట్ లోకి వస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ లాంచ్ పోస్టర్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలుస్తోంది. అలాగే డెడికేటెడ్ మైక్రోసైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన కీలక వివరాలు రివీల్ అయ్యాయి.

తమ నుంచి వస్తోన్న Realme 10 Pro 5G Coca-Cola లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు ఎగ్జైటింగ్ ప్రైజెస్ లభిస్తాయని రియల్మీ చెబుతోంది. ఫోన్ కొనుగోలుపై రియల్మీ, రూ.200 డిస్కౌంట్ కూపన్, 3 వాట్ బ్లూటూత్ స్పీకర్, ఒక ఎలక్ట్రానిక్ టూత్‌బ్రష్, వాచ్ 2, రియల్మీ కోకాకోలా ఫిగర్, ఇంకా ఒక డీలక్స్ బాక్స్ సెట్ అందిస్తోంది.

Realme Coca-Cola ఫోన్

ఫోన్ డిజైన్ చూడటానికి ఒరిజినల్ మోడల్ మాదిరే ఉంది. అయితే కొన్ని ఈస్తటిక్ అడిషన్స్ ని జతచేసి ఫోన్ కి సరికొత్త లుక్ తీసుకొచ్చారు. Realme 10 Pro 5G Coca-Cola Edition ఫోన్ డ్యూయల్-టోన్ డిజైన్ తో వచ్చింది. ఒక సగం బ్లాక్ కలర్, రియల్మీ లోగో, మరొక సగం రెడ్ కలర్ లో కోకా-కోలా బ్రాండింగ్ ఉన్నాయి. రెడ్ యాక్సెంట్ రింగ్స్ తో డ్యూయల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఫోన్ రౌండెడ్ ఎడ్జెస్ తో బాక్సీ డిజైన్ ని కలిగి ఉంది.

Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.76 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, డీసీ డిమ్మింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, పంచ్-హోల్ కటౌట్, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 108 ఎంపి శాంసంగ్ హెచ్ఎం6 ప్రైమరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, Geco Micro GC02M1 సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 10 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G Coca-Cola Edition first appeared on 91Mobiles Telugu.

]]>