Realme 11 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 02 Aug 2023 14:04:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11-4g-globally-launched-price-specs-availability/ Wed, 02 Aug 2023 11:15:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=7431 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ వియత్నా మరియు తైవాన్ దేశాల్లో Realme 11 5G, Realme 11 4G ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో లాంచైన మోడల్ గ్లోబల్ గా లాంచైన Realme 11 5G వర్షన్ పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇకపోతే Realme 11 5G, Realme 11 4G డివైజెస్ రెండూ కూడా 108ఎంపి మెయిన్ కెమెరాతో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 11 5G
  • తైవాన్ లో లాంచ్ అయిన Realme 11 5G, Realme 11 4G
  • Realme 11 4G ప్రారంభ ధర VND 7,390,000 (సుమారు రూ.25,700)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ వియత్నా మరియు తైవాన్ దేశాల్లో Realme 11 5G, Realme 11 4G ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో లాంచైన మోడల్ గ్లోబల్ గా లాంచైన Realme 11 5G వర్షన్ పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇకపోతే Realme 11 5G, Realme 11 4G డివైజెస్ రెండూ కూడా 108ఎంపి మెయిన్ కెమెరాతో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 5G, Realme 11 4G ధరలు

Realme 11 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర తైవాన్ లో TWD 8,990 (సుమారు రూ.23,400) గా ఉంది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 3 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.

Realme 11 4G 8జిబి+128జిబి వేరియంట్ ధర వియత్నాంలో VND 7,390,000 (సుమారు రూ.25,700) గా ఉంది. ప్రైడ్ బ్లాక్, అరోరా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆగస్టు 11 నుంచి సేల్ కి వస్తుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 2400*1080 పిక్సెల్స్
  • చిప్సెట్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 11 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11 4G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 90.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 11 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 ఎమ్‌సీ2 ని వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme 11 4G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 11 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11 4G లో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>