Realme 13 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Aug 2024 05:53:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 4G: OLED డిస్ప్లేతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ 13 4జీ https://www.91mobiles.com/telugu/realme-13-4g-launched-indonesia-oled-display/ https://www.91mobiles.com/telugu/realme-13-4g-launched-indonesia-oled-display/#respond Thu, 08 Aug 2024 05:53:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=12889 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Realme 13 4G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో విడుదలైంది. రియల్మీ 13 4జీ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్, 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 13 4G ధర Realme 13 4G డివైజ్ ఇండోనేషియాలో […]

The post Realme 13 4G: OLED డిస్ప్లేతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ 13 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌ మార్కెట్‌లో Realme 13 4G విడుదల
  • త్వరలో భారత్ లో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్, ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Realme 13 4G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో విడుదలైంది. రియల్మీ 13 4జీ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్, 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 4G ధర

Realme 13 4G డివైజ్ ఇండోనేషియాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.

Realme 13 4G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 29,99,000 (సుమారు రూ.15,600) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 31,99,000 (సుమారు రూ.16,700) గా ఉంది.

Realme 13 4G స్మార్ట్‌ఫోన్ స్కైలైన్ బ్లూ మరియు పయనీర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13 4G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme 13 4G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 13 4G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

మెమొరీ: Realme 13 4G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వంటి ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Realme 13 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 19 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది. 47 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 4G లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 4G లో స్టీరియో స్పీకర్స్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Realme 13 4G: OLED డిస్ప్లేతో ఇండోనేషియాలో లాంచైన రియల్మీ 13 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-4g-launched-indonesia-oled-display/feed/ 0