Realme 13 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 14:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/#respond Mon, 16 Sep 2024 15:28:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13512 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme 13+ మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme 13+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ కోసం రియల్మీ 13+ మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టాం. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ మరియు ఆడియో లెవెల్స్ ను ఒకే విధంగా ఉంచాం. రెండు ఫోన్లు కూడా 100 శాతం చార్జింగ్ తో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ టెస్ట్ 10 గంటల 37 నిమిషాలు 9 గంటల 53 నిమిషాలు

 

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ ఫోన్ 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు 10 గంటల సమయం పట్టింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా దాదాపుగా 10 గంటల పాటు నడిచింది. రెండు ఫోన్లను పోల్చితే, రియల్మీ 13+ బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలిసింది.

విజేత: Realme 13+

యూట్యూబ్ వీడియో టెస్ట్

30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూసే టెస్ట్ కోసం, రెండు ఫోన్లలో ఒకే విధమైన బ్రైట్నెస్, ఆడియో లెవెల్స్, రెజుల్యూషన్ పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ (బ్యాటరీ ఖర్చు) 4 శాతం 4 శాతం

 

యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టెస్ట్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 4 శాతం బ్యాటరీని వినియోగించుకున్నాయి. అంటే 200ఎంఏహెచ్ పవర్ ను వాడుకున్నాయి.

విజేత: సమానం

గేమింగ్

గేమింగ్ టెస్ట్ కోసం రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ ను పెట్టడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
గేమింగ్ తర్వాత బ్యాటరీ డ్రాప్ 6.6 శాతం 8.6 శాతం

 

ఈ టెస్ట్ కోసం బీజీఎంఐ, రియల్ రేసింగ్ 3, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను రెండు ఫోన్లలో ఒక్కోదానిలో 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. ఆడటం అయ్యాక, రియల్మీ 13+ లో 6.6 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 8.6 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. గేమర్స్‌కి రియల్మీ 13+ బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది.

విజేత: Realme 13+

చార్జింగ్

రియల్మీ 13+ మరియు ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజెస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా వేర్వేరు చార్జింగ్ స్పీడ్‌కి సపోర్ట్ చేస్తాయి.

స్మార్ట్‌ఫోన్ రియల్మీ 13+ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
చార్జింగ్ టైమ్ (20%-100%) 31 నిమిషాలు 36 నిమిషాలు

 

రియల్మీ 13+ 80 వాట్ చార్జర్ తో వచ్చింది. ఇది ఫోన్‌ని 31 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ చార్జర్ తో వచ్చింది. 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Realme 13+

ఏది బెటర్?

మేం జరిపిన టెస్ట్ ప్రకారం, Realme 13+ స్మార్ట్‌ఫోన్, Motorola Edge 50 Fusion కంటే ముందుంది. అయితే, రోజువారీ వాడకంలో రెండు ఫోన్లు కూడా ఒకే రకంగా బ్యాటరీని ఖర్చు చేశాయి. అలాగే, చార్జింగ్ స్పీడ్స్ వేరైనప్పటికీ, పూర్తిగా చార్జ్ అయ్యేందుకు రెండు ఫోన్లు దాదాపుగా ఒకే సమయాన్ని తీసుకున్నాయి.

The post Realme 13+ vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-plus-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/feed/ 0