Realme 9 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 Aug 2022 14:20:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సూపర్ డీల్: ఈ Realme 5G ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి https://www.91mobiles.com/telugu/realme-fan-festival-2022-discount-price-realme-9-pro-5g/ Thu, 25 Aug 2022 14:20:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=1920 హైలైట్స్: రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 సేల్ తో వచ్చిన రియల్ మీ కంపెనీ సేల్ సందర్భంగా రియల్ మీ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్ ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగనున్న రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ తన అభిమానుల కొరకు ప్రముఖ కంపెనీ రియల్ మీ, రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ సందర్భంగా రియల్ మీ స్మార్ట్ […]

The post సూపర్ డీల్: ఈ Realme 5G ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 సేల్ తో వచ్చిన రియల్ మీ కంపెనీ
  • సేల్ సందర్భంగా రియల్ మీ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్
  • ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగనున్న రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్

తన అభిమానుల కొరకు ప్రముఖ కంపెనీ రియల్ మీ, రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ సందర్భంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఈ ఫెస్టివల్ బెనిఫిట్స్ ని రియల్ మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా మరియు అమెజాన్ ఇండియా షాపింగ్ ప్లాట్ఫామ్ పై పొందవచ్చు. ఇక ఈ సేల్ సందర్భంగా రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మాంచి డీల్స్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ని ఎంతో తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది. ఇక్కడ మీకోసం రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్ కి సంబంధించిన డీల్స్, డిస్కౌంట్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అందిస్తున్నాం. చూసేయండి.

Realme 9 Pro 5G ఆఫర్స్

రియల్ మీ 9 ప్రో 5జీ రూ.18,999 ధరతో ప్రారంభమవుతోంది. పూర్తి నగదుని చెల్లించి కొనేవారికి రియల్ మీ 9 ప్రో 5జీ పై రూ.2000 డిస్కౌంట్ లభించనుంది. ఈ ఆఫర్ తో రియల్ మీ 9 ప్రో 5జీ ని మీరు రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జిబి వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభ్యమవుతుంది.

Realme 9 Pro 5G స్పెసిఫికేషన్స్

రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉన్నాయి. ఇప్పుడు కెమెరా విభాగంపై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్లో ముందు వైపున 16 ఎంపి కెమెరాను అమర్చారు. రియల్ మీ 9 ప్రో 5జీ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఈ ఫోన్లో ఉంది. రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 9 pro 5G Specs

  • 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 400 పీపీఐ, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 6జిబి/8జిబి ర్యామ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

The post సూపర్ డీల్: ఈ Realme 5G ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>