Realme C61 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Jun 2024 14:49:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme C61: భారత్‌లో లాంచైన రియల్మీ సీ61, జూన్ 28 నుంచి సేల్ https://www.91mobiles.com/telugu/realme-c61-launched-india-sale-june-28/ https://www.91mobiles.com/telugu/realme-c61-launched-india-sale-june-28/#respond Wed, 26 Jun 2024 14:49:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=12235 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Realme C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్ జూన్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 చిప్, 8జిబి డైనమిక్ ర్యామ్, 6జిబి ఫిజికల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ61 యొక్క ధర, లభ్యత […]

The post Realme C61: భారత్‌లో లాంచైన రియల్మీ సీ61, జూన్ 28 నుంచి సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme C61 లాంచ్
  • ఈ ఫోన్ ధర రూ.7,699
  • యూనిఎస్ఓసీ టీ612 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Realme C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్ జూన్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లో యూనిఎస్ఓసీ టీ612 చిప్, 8జిబి డైనమిక్ ర్యామ్, 6జిబి ఫిజికల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ61 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme C61 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Realme C61 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,699 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ వేరియంట్ పై కంపెనీ రూ.900 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ వేరియంట్ రూ.8,099 కే లభించనుంది.

Realme C61 స్మార్ట్‌ఫోన్ జూన్ 28 నుంచి కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. రియల్మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైట్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనవచ్చు. 6జిబి వేరియంట్ కేవలం ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సఫారి గ్రీన్ మరియు మార్బుల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C61 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C61 లో హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C61 లో యూనిఎస్ఓసీ స్ప్రెడ్‌ట్రమ్ టీ612 ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Realme C61 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్‌కి 14జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C61 లో 32ఎంపి సూపర్ క్లియర్ కెమెరా ఉంది. ఇది 4-ఇన్-1 పిక్సెల్ బైనింగ్ టెక్నాలజీపై పని చేస్తుంది.

బ్యాటరీ: Realme C61 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 1000 చార్జింగ్ సైకిల్ కెపాసిటీని ఈ బ్యాటరీ ఆఫర్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C61 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme C61 లో ఐపీ54 రేటింగ్, మెటల్ ఫ్రేమ్, టఫ్ గ్లాస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

బరువు, మందం: Realme C61 డివైజ్ 7.84 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.

The post Realme C61: భారత్‌లో లాంచైన రియల్మీ సీ61, జూన్ 28 నుంచి సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-c61-launched-india-sale-june-28/feed/ 0
Realme C61 4G: జూన్ 28వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్న రియల్మీ సీ61 https://www.91mobiles.com/telugu/realme-c61-4g-india-launch-date-june-28/ https://www.91mobiles.com/telugu/realme-c61-4g-india-launch-date-june-28/#respond Tue, 25 Jun 2024 16:45:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=12219 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme C61 4G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 28వ తేదీన ఇండియాలో రియల్మీ సీ61 4జీ లాంచ్ అవుతోంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కోసం చూసేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. తాజాగా ఈ ఫోన్ వివరాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ […]

The post Realme C61 4G: జూన్ 28వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్న రియల్మీ సీ61 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme C61 4G లాంచ్ తేదీ ఖరారు
  • డివైజ్ ధర రూ.8,000 లోపే
  • 32ఎంపి సూపర్ క్లియర్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme C61 4G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 28వ తేదీన ఇండియాలో రియల్మీ సీ61 4జీ లాంచ్ అవుతోంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కోసం చూసేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. తాజాగా ఈ ఫోన్ వివరాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme C61 4G ఇండియా లాంచ్ వివరాలు

Realme C61 4G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జూన్ 28వ తేదీన లాంచ్ అవుతోంది. రియల్మీ సంస్థ తన అధికార వెబ్‌సైట్ లో ప్రొడక్ట్ పేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా డివైజ్ యొక్క ఇమేజెస్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలిసాయి.

Realme C61 4G ధర (లీక్)

Realme C61 4G స్మార్ట్‌ఫోన్ వివరాలను టిప్‌స్టర్ PassionateGeeks షేర్ చేశారు. ఈ ఫోన్ రూ.7,699 ధరతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు. ఇది 4జిబి ర్యామ్ మోడల్ ధర. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ డివైజ్ 64జిబి స్టోరేజీతో లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Realme C61 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Realme C61 4G లో హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme C61 4G డివైజ్ లో యూనిఎస్ఓసీ స్ప్రెడ్‌ట్రమ్ టీ612 చిప్సెట్ ఉంటుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Realme C61 4G డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్‌ని కలిగి ఉంటుంది. యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C61 4G స్మార్ట్‌ఫోన్ లో 32ఎంపి సూపర్ క్లియర్ రియర్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ: Realme C61 4G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Realme C61 4G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్, టఫ్ గ్లాస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

The post Realme C61 4G: జూన్ 28వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్న రియల్మీ సీ61 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-c61-4g-india-launch-date-june-28/feed/ 0