Realme GT 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:47:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 https://www.91mobiles.com/telugu/realme-gt-3-launched-globally-price-specs-mwc-2023/ Tue, 28 Feb 2023 17:25:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5152 బార్సిలోనా లో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Realme GT 3 స్మార్ట్ ఫోన్ లాంచైంది. Realme GT 2 కి సక్సెసర్ గా Realme GT 3 మార్కెట్ లోకి వచ్చింది. జీటీ రేసింగ్ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, Realme GT 3 బ్యాక్ ప్యానెల్ పై రేసింగ్ స్ట్రైప్ తో వచ్చింది. రీసెంట్ గా లాంచైన GT Neo 5 మాదిరిగా ఈ హ్యాండ్సెట్ ట్రాన్స్‌పరెంట్ ఆర్జీబీ ప్యానెల్ తో వచ్చింది. పల్స్ […]

The post 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Realme GT 3 స్మార్ట్ ఫోన్
  • 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Realme GT 3
  • Pulse Interface అనే ఆర్జీబీ లైటింగ్ తో వచ్చిన Realme GT 3

బార్సిలోనా లో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Realme GT 3 స్మార్ట్ ఫోన్ లాంచైంది. Realme GT 2 కి సక్సెసర్ గా Realme GT 3 మార్కెట్ లోకి వచ్చింది. జీటీ రేసింగ్ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, Realme GT 3 బ్యాక్ ప్యానెల్ పై రేసింగ్ స్ట్రైప్ తో వచ్చింది. రీసెంట్ గా లాంచైన GT Neo 5 మాదిరిగా ఈ హ్యాండ్సెట్ ట్రాన్స్‌పరెంట్ ఆర్జీబీ ప్యానెల్ తో వచ్చింది. పల్స్ ఇంటర్ఫేస్ అని పిలవబడే ఆర్జీబీ సిస్టమ్ 25 రకాల కలర్స్, 5-స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ మరియు కస్టమ్ సెట్టింగ్స్ ని ఆఫర్ చేస్తుంది.

Realme GT 3 డివైజ్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Realme GT 3 ధర, సేల్ వివరాలు

Realme GT 3 ధర 649 డాలర్ల (సుమారు రూ.53,700) తో ప్రారంభమవుతుంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర. Realme GT 3 డివైజ్ పల్స్ వైట్, బూస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Realme GT 3 ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. Realme GT 3 డివైజ్ పల్స్ వైట్, బూస్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇతర వేరియంట్ల ధరలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లాట్ బెజెల్స్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ పై తయారైన చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు. ఈ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది.

Realme GT 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme GT 3 స్మార్ట్ ఫోన్ 163.85 మిల్లీ మీటర్ల పొడవు, 75.75 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Realme GT 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT 3 లో స్టెయిన్ లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ మ్యాక్స్ 2.0, పల్స్ ఇంటర్ఫేస్ డిజైన్, డెడికేటెడ్ డిస్ప్లే చిప్సెట్, టాక్టైల్ ఇంజిన్, జీటీ మోడ్ 4.0, ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ డిస్ప్లే, ఆర్జీబీ లైట్స్‌తో లాంచైన Realme GT 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? https://www.91mobiles.com/telugu/realme-gt-3-china-variant-to-launch-with-snapdragon-8-gen-3-processor/ Mon, 20 Feb 2023 12:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5006 ఫిబ్రవరి 28 న గ్లోబల్ గా Realme GT 3 లాంచ్ కానుందని రియల్మీ ప్రకటించింది. కొత్త Realme GT 3 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ Realme GT 3 ని GT Neo 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా తీసుకురానుందని అందరూ అంచనా వేస్తున్నారు. GT Neo 5G చైనాలో ఈ నెల ఆరంభంలో లాంచైంది. Realme GT 3 డివైజ్ చైనాలో ఈ ఏడాది […]

The post Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Realme GT 3 స్మార్ట్ ఫోన్
  • Realme GT 3 గ్లోబల్ వేరియంట్, Realme GT Neo 5 5G కి రీబ్యాడ్జ్ వర్షన్ అని సమాచారం
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్

ఫిబ్రవరి 28 న గ్లోబల్ గా Realme GT 3 లాంచ్ కానుందని రియల్మీ ప్రకటించింది. కొత్త Realme GT 3 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ Realme GT 3 ని GT Neo 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా తీసుకురానుందని అందరూ అంచనా వేస్తున్నారు. GT Neo 5G చైనాలో ఈ నెల ఆరంభంలో లాంచైంది.

Realme GT 3 డివైజ్ చైనాలో ఈ ఏడాది లాంచ్ కానుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ Xu Qi Chase స్పష్టం చేశారు. అయితే ఆయన లాంచ్ తేదీని లేదా నెలను వెల్లడించలేదు. సరే, ఓసారి Realme GT 3 యొక్క స్పెసిఫికేషన్స్, టైమ్ లైన్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

Realme GT 3 చైనా లాంచ్ టైమ్‌లైన్ (రూమర్డ్)

Realme GT 3 సిరీస్ చైనీస్ వేరియంట్ గ్లోబల్ వేరియంట్ తో పోల్చితే విభిన్నంగా ఉండనుంది. ఈ డివైజ్ ఫిబ్రవరి 28 న ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. Realme GT 3 గ్లోబల్ వేరియంట్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. GT Neo 5 5G చైనా వేరియంట్, Realme GT 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో కంపెనీ మరిన్ని వివరాలను ప్రకటించనుంది.

2023 చివరికల్లా Realme GT 3 డివైజ్ చైనాలో లాంచ్ కానుందని చేజ్ వెల్లడించారు. అయితే స్పెసిఫికేషన్స్ ని ఆయన వెల్లడించలేదు. అయితే, లాంచ్ టైమ్‌లైన్ ని బట్టి, చైనీస్ వర్షన్ Realme GT 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. 2023 అక్టోబర్ లో చైనాలో ఈ డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme GT 3 చైనీస్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్సెట్ తో కూడా రావొచ్చని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

Realme GT Neo 5 5G స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. 150 వాట్ వేరియంట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి 16 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? first appeared on 91Mobiles Telugu.

]]>