Realme GT 6 vs Moto Edge 50 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 02 Sep 2024 17:53:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/ https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/#respond Mon, 02 Sep 2024 17:32:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=13305 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme GT 6 మరియు Motorola Edge 50 Ultra ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు రియల్మీ జీటీ 6 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

రియల్మీ జీటీ 6 లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, రియల్మీ జీటీ 6 కంటే 1 గంటా 18 నిమిషాలు ఎక్కువ స్కోరు చేసింది. రెండు ఫోన్లు కూడా టెస్టింగ్ సమయంలో 50 శాతం వాల్యూమ్ లెవెల్, 80 శాతం బ్రైట్నెస్ సెట్టింగ్స్ కలిగి ఉన్నాయి.

రియల్మీ జీటీ 6 యొక్క పీసీమార్క్ స్కోర్ 14 గంటల 45 నిమిషాలుగా ఉంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క పీసీమార్క్ స్కోర్ 13 గంటల 27 నిమిషాలుగా ఉంది.

విజేత: Realme GT 6

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో భాగంగా, రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు ప్లే చేశాం. ఈ టెస్ట్ లో రియల్మీ జీటీ 6 డివైజ్ లో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లో 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ టెస్ట్ సమయంలో రెండు ఫోన్లలో బ్రైట్నెస్, వాల్యూమ్ 50 శాతంగా ఉన్నాయి.

విజేత: Realme GT 6

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ లో భాగంగా, రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ఆడాం. రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టడం జరిగింది. యావరేజీగా, ఈ టెస్ట్ తర్వాత రియల్మీ జీటీ 6 బ్యాటరీ 17 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క బ్యాటరీ 20 శాతం ఖర్చయ్యింది. పర్సంటేజీ ప్రకారం, రియల్మీ పెర్ఫామెన్స్ బాగుంది. కానీ, మోటోరోలా 900 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుకోగా, రియల్మీ 940 ఎంఏహెచ్ బ్యాటరీ వాడుకుంది.

విజేత: Motorola Edge 50 Ultra

చార్జింగ్ టెస్ట్

చార్జింగ్ టెస్టులో భాగంగా, మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాను 128 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు కేవలం 15 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, రియల్మీ జీటీ 6 ను 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేయగా పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 26 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Motorola Edge 50 Ultra

ఏది బెటర్?

బ్యాటరీ విషయంలో, రెండు ఫోన్లు కూడా సమఉజ్జీగా నిలిచినట్లు అర్థమవుతోంది. అయితే గేమింగ్ మరియు చార్జింగ్ స్పీడ్ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, రియల్మీ జీటీ 6 కంటే బాగా పెర్ఫామ్ చేసింది. మరోవైపు, రియల్మీ జీటీ 6 పీసీమార్క్ బెంచ్‌మార్కింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మంచి బ్యాటరీ పెర్ఫామెన్స్ అందించింది. మరోవైపు, పెద్ద బ్యాటరీ ఉండటం వల్లన కాస్త ఎక్కువ చార్జింగ్ టైమ్ పట్టింది. కాబట్టి ఇక్కడ ప్లస్ అనే చెప్పవచ్చు.

మీ బడ్జెట్‌ని బట్టి, రెండు ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. Realme GT 6 ధర రూ.42,999 గా ఉండగా, Motorola Edge 50 Ultra ధర రూ.59,999 గా ఉంది.

The post Realme GT 6 vs Motorola Edge 50 Ultra: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6-vs-motorola-edge-50-ultra-battery-comparison-which-gives-better-backup/feed/ 0