Realme GT Neo 4 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 09 Nov 2022 05:22:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 144Hz డిస్ప్లేతో వస్తోన్న Realme GT Neo 4 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-4-specs-tipped-before-launch/ Wed, 09 Nov 2022 05:22:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3322 హైలైట్స్ Redmi K60 కి పోటీగా రానున్న Realme GT Neo 4 ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా లీకైన Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తోన్న Realme GT Neo 4 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్మీ త్వరలోనే Realme GT Neo 4 ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ని Redmi K60 కి పోటీగా బరిలోకి దింపనున్నట్లు సమాచారం. తాజాగా […]

The post 144Hz డిస్ప్లేతో వస్తోన్న Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Redmi K60 కి పోటీగా రానున్న Realme GT Neo 4
  • ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా లీకైన Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్ తో వస్తోన్న Realme GT Neo 4

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్మీ త్వరలోనే Realme GT Neo 4 ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ని Redmi K60 కి పోటీగా బరిలోకి దింపనున్నట్లు సమాచారం. తాజాగా Realme GT Neo 4 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ హ్యాండ్సెట్ 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సామాజిక మాధ్యమం అయిన వీబో లో Realme GT Neo 4 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. దీని ప్రకారం, Realme GT Neo 4 స్మార్ట్ ఫోన్ 1.5 కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ప్లే తో వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్ లో 2,160 హెర్ట్జ్ పల్స్-విడ్త్ మాడ్యులేషన్ (PWM) డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. ఇంకా ఈ హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుందని తెలుస్తోంది. అలాగే Realme GT Neo 4 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనుందట.

అయితే ఇప్పటి వరకు Realme నుంచి Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో రియల్మీ ఇండియా మరియు చైనా వెబ్‌సైట్స్ లో Realme GT Neo 4 దర్శనమిచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. తాజాగా స్పెసిఫికేషన్స్ బయటకు రావడంతో త్వరలోనే Realme GT Neo 4 లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది.

Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన సమాచారాన్ని బట్టి, Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2,772*1,440), 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడే అవకాశం ఉంది. Realme GT Neo 4 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు Realme GT Neo 4 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme GT Neo 4 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 144Hz డిస్ప్లేతో వస్తోన్న Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Realme GT Neo 4 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-4-specs-leaked-before-launch/ Thu, 22 Sep 2022 10:38:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2504 హైలైట్స్: లీకైన Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Realme GT Neo 4 Realme GT Neo 3 కి అప్‌గ్రేడ్ గా వస్తున్న Realme GT Neo 4 స్మార్ట్ ఫోన్ Realme త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ Realme GT Neo 4 ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ […]

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Realme GT Neo 4
  • Realme GT Neo 3 కి అప్‌గ్రేడ్ గా వస్తున్న Realme GT Neo 4 స్మార్ట్ ఫోన్

Realme త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ Realme GT Neo 4 ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme GT Neo 4 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme GT Neo 3 ఫోన్ కి సక్సెసర్ గా Realme GT Neo 4 వస్తోంది. స్పెసిఫికేషన్స్ ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.

లీకైన Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్

వచ్చే నెలలో Realme GT Neo 4 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈలోపు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తున్నట్లు సమాచారం. Realme GT Neo 3 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి, ఈ మిడ్-రేంజ్ చిప్సెట్ కి రియల్మీ గుడ్ బై చెప్పినట్లు అర్థమవుతోంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్ని బట్టి, Realme GT Neo 4 1.5కే డిస్ప్లే ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లో 1220పీ రెజుల్యూషన్ కలిగిన ప్యానెల్ ఉండనుందట. అంటే Realme GT Neo 4 యొక్క ప్యానెల్ 1080పి ప్యానెల్ కంటే మరింత మెరుగ్గా ఉండనుంది. ఈ ఫోన్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండనుంది. ఇంకా 2160-స్టెప్ పీడబ్ల్యూఎం ని ఈ డిస్ప్లే కలిగి ఉంది. పీడబ్ల్యూఎం రేటింగ్ అనేది ఆటో-బ్రైట్నెస్ లెవెల్ ని సూచిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై Realme GT Neo 4 పని చేయనుంది.

Realme GT Neo 4 లో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ స్పెసిఫికేషన్స్ తో వస్తున్న Realme GT Neo 4, రెడ్మీ నుంచి రానున్న Redmi K60 స్మార్ట్ ఫోన్ తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. Realme GT Neo 4 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అంచనా ధర, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే చైనాలో అక్టోబర్ లో లాంచ్ కానున్న Realme GT Neo 4, కొన్ని వారాల తర్వాత భారత మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నందున ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ స్టార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>
రియల్ మీ ఇండియా వెబ్ సైట్ లో కనిపించిన Realme GT Neo 4 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-4-spotted-realme-official-website-china-india/ Wed, 24 Aug 2022 14:47:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=1885 హైలైట్స్: రియల్ మీ ఇండియా, చైనా వెబ్ సైట్స్ లో కనిపించిన రియల్ మీ జీటీ నియో 4 రియల్ మీ జీటీ నియో 3 కి సక్సెసర్ గా వస్తున్న రియల్ మీ జీటీ నియో 4 ఇంకా రివీల్ కాని రియల్ మీ జీటీ నియో 4 లాంచ్ డేట్ మార్చి లో చైనాలో రియల్ మీ జీటీ నియో 3 లాంచ్ అయ్యింది. జీటీ నియో 2 కి సక్సెసర్ గా ఈ […]

The post రియల్ మీ ఇండియా వెబ్ సైట్ లో కనిపించిన Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రియల్ మీ ఇండియా, చైనా వెబ్ సైట్స్ లో కనిపించిన రియల్ మీ జీటీ నియో 4
  • రియల్ మీ జీటీ నియో 3 కి సక్సెసర్ గా వస్తున్న రియల్ మీ జీటీ నియో 4
  • ఇంకా రివీల్ కాని రియల్ మీ జీటీ నియో 4 లాంచ్ డేట్

మార్చి లో చైనాలో రియల్ మీ జీటీ నియో 3 లాంచ్ అయ్యింది. జీటీ నియో 2 కి సక్సెసర్ గా ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రియల్ మీ జీటీ నియో 3 కి సక్సెసర్ ని లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, కంపెనీ యొక్క చైనా, ఇండియా వెబ్ సైట్స్ లో రియల్ మీ జీటీ నియో 4 ఫోన్ కనిపిస్తోందని తెలుస్తోంది.

అయితే, నియో 4 యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. రియల్ మీ జీటీ నియో 3 కి పలు మార్పులు చేర్పులు చేసిన నియో 4 ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే నియో 3 కంటే నియో 4 లో స్పెసిఫికేషన్స్ పరంగా, డిజైన్ పరంగా చాలా మార్పులను మనం గమనించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలను మనం తెలుసుకునే అవకాశముంది.

 

Realme GT Neo 3 స్పెసిఫికేషన్స్

రియల్ మీ జీటీ నియో 3 లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10 బిట్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్ మీ జీటీ నియో 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్ మీ జీటీ నియో 3 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో కూడిన మరొక వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, జీటీ మోడ్ 3.0, 39606 ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్ మీ జీటీ నియో 4 కి సంబంధించిన లాంచ్ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. రియల్ మీ కంపెనీ, రానున్న రోజుల్లో నియో 4 యొక్క టీజర్ ఇమేజెస్ షేర్ చేసే అవకాశముంది. అప్పుడు ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు ఏమైనా తెలిసే అవకాశముంది.

The post రియల్ మీ ఇండియా వెబ్ సైట్ లో కనిపించిన Realme GT Neo 4 first appeared on 91Mobiles Telugu.

]]>