Realme GT Neo 5 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:47:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? https://www.91mobiles.com/telugu/realme-gt-3-china-variant-to-launch-with-snapdragon-8-gen-3-processor/ Mon, 20 Feb 2023 12:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5006 ఫిబ్రవరి 28 న గ్లోబల్ గా Realme GT 3 లాంచ్ కానుందని రియల్మీ ప్రకటించింది. కొత్త Realme GT 3 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ Realme GT 3 ని GT Neo 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా తీసుకురానుందని అందరూ అంచనా వేస్తున్నారు. GT Neo 5G చైనాలో ఈ నెల ఆరంభంలో లాంచైంది. Realme GT 3 డివైజ్ చైనాలో ఈ ఏడాది […]

The post Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Realme GT 3 స్మార్ట్ ఫోన్
  • Realme GT 3 గ్లోబల్ వేరియంట్, Realme GT Neo 5 5G కి రీబ్యాడ్జ్ వర్షన్ అని సమాచారం
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్

ఫిబ్రవరి 28 న గ్లోబల్ గా Realme GT 3 లాంచ్ కానుందని రియల్మీ ప్రకటించింది. కొత్త Realme GT 3 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ Realme GT 3 ని GT Neo 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా తీసుకురానుందని అందరూ అంచనా వేస్తున్నారు. GT Neo 5G చైనాలో ఈ నెల ఆరంభంలో లాంచైంది.

Realme GT 3 డివైజ్ చైనాలో ఈ ఏడాది లాంచ్ కానుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ Xu Qi Chase స్పష్టం చేశారు. అయితే ఆయన లాంచ్ తేదీని లేదా నెలను వెల్లడించలేదు. సరే, ఓసారి Realme GT 3 యొక్క స్పెసిఫికేషన్స్, టైమ్ లైన్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

Realme GT 3 చైనా లాంచ్ టైమ్‌లైన్ (రూమర్డ్)

Realme GT 3 సిరీస్ చైనీస్ వేరియంట్ గ్లోబల్ వేరియంట్ తో పోల్చితే విభిన్నంగా ఉండనుంది. ఈ డివైజ్ ఫిబ్రవరి 28 న ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. Realme GT 3 గ్లోబల్ వేరియంట్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. GT Neo 5 5G చైనా వేరియంట్, Realme GT 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో కంపెనీ మరిన్ని వివరాలను ప్రకటించనుంది.

2023 చివరికల్లా Realme GT 3 డివైజ్ చైనాలో లాంచ్ కానుందని చేజ్ వెల్లడించారు. అయితే స్పెసిఫికేషన్స్ ని ఆయన వెల్లడించలేదు. అయితే, లాంచ్ టైమ్‌లైన్ ని బట్టి, చైనీస్ వర్షన్ Realme GT 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. 2023 అక్టోబర్ లో చైనాలో ఈ డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme GT 3 చైనీస్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్సెట్ తో కూడా రావొచ్చని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

Realme GT Neo 5 5G స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. 150 వాట్ వేరియంట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి 16 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్? first appeared on 91Mobiles Telugu.

]]>