Realme Narzo 60 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Mar 2024 10:15:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro https://www.91mobiles.com/telugu/realme-narzo-60-5g-narzo-60-pro-5g-launched-india-price-specs-availability/ Thu, 06 Jul 2023 09:39:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7094 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme Narzo 60 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme Narzo 60 మరియు Realme Narzo 60 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల లుక్స్ చూస్తుంటే అచ్చంగా Realme 10 Pro+ ని పోలి ఉన్నాయి. Realme Narzo 60 సిరీస్ 100ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, […]

The post 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme Narzo 60 సిరీస్
  • లైనప్ లో వచ్చిన రెండు ఫోన్లు – Narzo 60, Narzo 60 Pro
  • జులై 15 నుంచి అమెజాన్ ద్వారా మొదలుకానున్న సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme Narzo 60 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme Narzo 60 మరియు Realme Narzo 60 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల లుక్స్ చూస్తుంటే అచ్చంగా Realme 10 Pro+ ని పోలి ఉన్నాయి. Realme Narzo 60 సిరీస్ 100ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1టిబి వరకు మెమొరీ ఆప్షన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Realme Narzo 60 సిరీస్ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Realme Narzo 60 సిరీస్ ధర, సేల్ వివరాలు

Realme Narzo 60 సిరీస్ ప్రీ-బుకింగ్స్ నేడు మొదలవుతాయి. జులై 14 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా రియల్మీ సంస్థ ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు నెట్‌ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేసే ప్రీ-ఆర్డర్స్ పై రూ.1,500 డిస్కౌంట్ అందిస్తోంది. జులై 15 న అమెజాన్ ఇండియా, రియల్మీ వెబ్ సైట్ ద్వారా ఫస్ట్ సేల్ మొదలుకానుంది.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి + 128జిబి, 12జిబి + 256జిబి, 12జిబి + 1టిబి వేరియంట్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ ద్వారా 12జిబి డైనమిక్ ర్యామ్ కూడా లభిస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో 100ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme Narzo 60 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Realme Narzo 60 Pro 5G మార్స్ ఆరెంజ్, కాస్మిక్ నైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme Narzo 60 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 180 హెర్ట్జ్ గేమింగ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Realme Narzo 60 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 60 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme Narzo 60 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Realme Narzo 60 5G మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 100MP కెమెరా, 1TB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Realme Narzo 60, Narzo 60 Pro first appeared on 91Mobiles Telugu.

]]>