Realme Narzo 60x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 30 Aug 2023 05:54:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ https://www.91mobiles.com/telugu/realme-narzo-60x-teaser-amazon-india/ Wed, 30 Aug 2023 05:50:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=7791 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ పై తాజాగా ఒక మైక్రోసైట్ ద్వారా రియల్మీ తన కొత్త ఫోన్ టీజర్ ని వదిలింది. అయితే టీజర్ లో కనిపించిన ఫోన్ యొక్క పేరు ఇంకా తెలియదు. కానీ, Realme Narzo 60x అయి ఉంటుందని కంపెనీ X (గతంలో ట్విట్టర్) పై చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. Realme […]

The post అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11x 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న Narzo 60x?
  • టీజర్ లో సర్క్యులర్ సెటప్ తో కనిపించిన డివైజ్
  • త్వరలోనే Realme Narzo 60x లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ పై తాజాగా ఒక మైక్రోసైట్ ద్వారా రియల్మీ తన కొత్త ఫోన్ టీజర్ ని వదిలింది. అయితే టీజర్ లో కనిపించిన ఫోన్ యొక్క పేరు ఇంకా తెలియదు. కానీ, Realme Narzo 60x అయి ఉంటుందని కంపెనీ X (గతంలో ట్విట్టర్) పై చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది.

Realme Narzo 60x టీజర్ వివరాలు

  • Realme Narzo 60x టీజర్ వీడియో X హ్యాండిల్ పై పోస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది.
  • అమెజాన్ మైక్రోసైట్ లో ఈ అప్‌కమింగ్ ఫోన్ డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది.
  • Realme Narzo 60x అని భావిస్తోన్న స్మార్ట్ ఫోన్ లో సర్క్యులర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోందని టీజర్ లో మెన్షన్ చేసి ఉంది.
  • ఇంకా డివైజ్ యొక్క కచ్చితమైన పేరు బయటకు రాలేదు. కానీ, ప్రస్తుతం ఈ ఫోన్ ని “Mission X” అని పిలుస్తున్నారు.
  • ఊహాగానాల ప్రకారం, రియల్మీ నుంచి రాబోవు ఈ కొత్త ఫోన్ Realme Narzo 60x కావచ్చని తెలుస్తోంది.
  • Realme Narzo 60x కి సంబంధించిన మరే ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు.

Realme Narzo 60x డివైజ్ 11x 5G కి రీబ్రాండ్ వర్షనా?

  • ఇప్పటికైతే, దీన్ని కన్ఫర్మ్ చేయలేం. కానీ, Narzo 60 5G డివైజ్ Realme 11 5G కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వచ్చింది. అలాగే Narzo 60 Pro 5G కూడా Realme 11 Pro 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వచ్చింది.
  • దీంతో Realme Narzo 60x కూడా Realme 11x 5G కి రీబ్రాండ్ వర్షన్ అని భావిస్తున్నారు. అయితే, ఇంకా Realme Narzo 60x కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Realme Narzo 60x స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Narzo 60x లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
  • చిప్సెట్: Realme Narzo 60x లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
  • కెమెరా: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఒక సెకండరీ లెన్స్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
  • స్టోరేజీ, ర్యామ్: Realme Narzo 60x లో 128జిబి స్టోరేజీని అందించే అవకాశం ఉంది. ర్యామ్ విషయానికి వస్తే, 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
  • ఓఎస్: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>