Realme P1 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Aug 2024 19:01:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/#respond Wed, 21 Aug 2024 18:27:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13104 రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. […]

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

రూ.20,000 లోపు ఫోన్ల మార్కెట్ లో పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో OnePlus Nord CE4 Lite, Realme P1 స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏ ఫోన్ ఫాస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందనే విషయం తెలుసుకునేందుకు పెర్ఫామెన్స్ కంపేరిజన్ ను నిర్వహించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

డివైజెస్ యొక్క ప్రస్తుత ధరలు

OnePlus Nord CE4 Lite: 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
8జిబి+256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Realme P1: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499 గా ఉంది.

గీక్‌బెంచ్

బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 914 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2056 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, రియల్మీ పీ1, సింగిల్-కోర్ టెస్ట్ లో 959 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2390 పాయింట్లు స్కోర్ చేసింది.

బెంచ్‌మార్క్ స్కోర్స్ ప్రకారం, సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టాస్కుల్లో రియల్మీ పీ1 పనితనం బాగుంటుందని తెలుస్తోంది. వెబ్‌ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ అనే విషయాలు సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి. ఇక, ఫోటో, వీడియో ఎడిటింగ్ మరియు 3డీ గేమింగ్ అనేవి మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటాయి.

విజేత: Realme P1

అంటుటు

గీక్‌బెంచ్ టెస్ట్ తో పోల్చితే అంటుటు టెస్ట్ అనేది మరింత లోతైనది. ఈ టెస్టు, ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క ఓవరాల్ పెర్ఫామెన్స్‌ను అంచనా వేస్తుంది. సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విభాగాలు ఈ టెస్టులో కవర్ అవుతాయి. OnePlus Nord CE4 Lite 4,75,981 పాయింట్లు నమోదు చేసింది. Realme P1 డివైజ్ 6,02,920 స్కోరు నమోదు చేసింది.

ఈ టెస్టులో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ కంటే రియల్మీ పీ1 మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

సీఈ4 లైట్ సీపీయూ స్కోర్ 154830 గా ఉంది. రియల్మీ పీ1 సీపీయూ స్కోర్ 181016 గా ఉంది.

సీఈ4 లైట్ జీపీయూ స్కోర్ 85405 గా ఉంది. రియల్మీ పీ1 జీపీయూ స్కోర్ 112468 గా ఉంది.

సీఈ4 లైట్ మెమొరీ స్కోర్ 115196 గా ఉంది. రియల్మీ పీ1 మెమొరీ స్కోర్ 149719 గా ఉంది.

సీఈ4 లైట్ యొక్క యూజర్ ఎక్స్‌పీరియన్స్ స్కోర్ 112590 గా ఉంది. రియల్మీ పీ1 స్కోర్ 159699 గా ఉంది.

ఈ స్కోర్లను గమనిస్తే, Realme P1 స్పష్టమైన ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.

విజేత: Realme P1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క స్టెబిలిటీని అంచనా వేసేదే ఈ సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం Burnout బెంచ్‌మార్క్ యాప్ వినియోగించాం. ఇది స్మార్ట్‌ఫోన్‌ని థర్మల్ థ్రాట్లింగ్ కి గురిచేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ రాబడుతుంది. OnePlus Nord CE4 Lite 55.4 శాతం ఔట్‌పుట్‌తో స్టేబుల్‌గా లేదని తెలిసింది. మరోవైపు, Realme P1 76.7 శాతం ఔట్‌పుట్‌తో స్టెబిలిటీ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ కంటే మెరుగ్గా ఉంది.

మీరు గనుక రెగ్యులర్ గా ఇంటెన్సివ్ టాస్కులను చేసే వారైతే, మీకు రెండు ఫోన్లలో Realme P1 బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

విజేత: Realme P1

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ లో భాగంగా రెండు ఫోన్లలో, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ మరియు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్‌ని ఆడటం జరిగింది. మీడియమ్ సెట్టింగ్స్ తో రెండు ఫోన్లు కూడా గేమ్స్‌ను బాగానే రన్ చేస్తున్నాయి. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీలో 50ఎఫ్‌పీఎస్ వద్ద, బీజీఎంఐ లో 30ఎఫ్‌పీఎస్ వద్ద ఫ్రేమ్ రేట్స్ స్టడీగా ఉన్నాయి.

రియల్మీ పీ1 లో శక్తివంతమైన చిప్సెట్ ఉండటం వల్లన, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ తో పోల్చితే, బీజీఎంఐని హయ్యర్ రెజుల్యూషన్ పై రన్ చేయగలదు. అలాగే కాస్త బెటర్ ఫ్రేమ్ రేట్స్ ను కూడా అందించగలదు.

గేమింగ్ పెర్ఫామెన్స్ తో పాటు, ఈ ఫోన్లు గేమ్ ఆడేటప్పుడు, హీట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా మేం టెస్ట్ చేశాం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ యొక్క టెంపరేచర్ 6.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మరోవైపు రియల్మీ పీ1 యొక్క టెంపరేచర్ 5.2 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. రియల్మీ పీ1 హీట్‌ని బాగా మేనేజ్ చేసింది. దీని ద్వారా ఫోన్ యొక్క జీవితకాలం పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

విజేత: Realme P1

ఏది బెటర్?

పెర్ఫామెన్స్ కంపారిజన్ లో Realme P1 స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 Lite కంటే బాగా పెర్ఫామ్ చేసింది. మేం జరిపిన ప్రతీ టెస్టులో రియల్మీ పీ1, తన ప్రత్యర్థి అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ పై పైచేయి సాధించింది. రూ.20,000 లోపు మీకు బెటర్‌గా పెర్ఫామ్ చేసే ఫోన్ కావాలంటే, రెండింట్లో Realme P1 మీకు సరైన ఆప్షన్ గా నిలుస్తుంది.

స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ

The post OnePlus Nord CE4 Lite vs Realme P1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-lite-vs-realme-p1-performance-comparison-which-is-better/feed/ 0
Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/#respond Fri, 26 Jul 2024 18:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12715 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.20,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 24 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే, కేవలం 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఇక ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి/256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme P1

Realme P1 స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 20 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

ఇప్పుడు టెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూస్తే, 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి.

Realme P1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.

OnePlus Nord CE 4 Lite

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ డివైజ్ 11 గంల 30 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

ఇప్పుడు టెస్ట్ వివరాలు చూద్దాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

OnePlus Nord CE 4 Lite యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Tecno POVA 6 Pro

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 15 గంటల 56 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme Narzo 70

Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్‌ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. బ్యాటరీ 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 14 గంటల 49 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. Realme Narzo 70 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 70 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/feed/ 0
Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/realme-6th-anniversary-sale-discounts-on-realme-12x-5g-realme-p1-series-and-other-products/ Fri, 03 May 2024 11:17:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11339 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ […]

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రియల్మీ యానివర్శరీ సేల్‌లో డిస్కౌంట్స్
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రియల్మీ స్టోర్‌లో ఆఫర్లు
  • డిస్కౌంట్‌పై లభిస్తోన్న Realme 12x 5G, P1 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 6వ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను భారత్‌లో ప్రకటించింది. సేల్ సందర్భంగా, కంపెనీ పలు స్మార్ట్‌ఫోన్లు మరియు ఇయర్‌బడ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. Realme 12x 5G, P1 5G, P1 Pro 5G, Narzo 70 Pro 5G ఫోన్లతో పాటు, Realme Buds Air 5 Pro పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు కంపెనీ యొక్క ఆన్‌స్టోర్స్ పై వర్తిస్తాయి. ఓసారి ఆ డిస్కౌంట్ వివరాలను తెలుసుకుందాం.

Realme 6th యానివర్శరీ సేల్ ఆఫర్లు

Realme 12x 5G

రియల్మీ ఆరవ వార్షికోత్సవ సేల్ లో భాగంగా, Realme 12x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్ రూ.10,999 కే లభించనుంది. మరోవైపు, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మోడల్‌ని రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్ ని రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు.

Realme P1 5G

Realme P1 5G డివైజ్ 6జిబి+128జిబి, 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ రూ.14,999 కి, మిడ్ వేరియంట్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ + రూ.500 అడిషనల్ డిస్కౌంట్ కలుపుకుని రూ.15,999 కి, టాప్ స్టోరేజీ వేరియంట్ రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ కలుపుకుని రూ.16,999 కి లభిస్తుంది.

Realme P1 Pro 5G

Realme P1 Pro 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి మోడల్స్ ధరలు రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత వరుసగా రూ.19,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 Pro 5G

Realme Narzo 70 Pro 5G 8జిబి+128జిబి మోడల్ పై రూ.2,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,000 కూపన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ల తర్వాత వీటి ధరలు వరుసగా రూ.17,999 మరియు రూ.18,999 గా ఉన్నాయి.

Realme Narzo 70 5G

Realme Narzo 70 5G డివైజ్ యొక్క 6జిబి+128జిబి మరియు 8జిబి+128జిబి మోడల్స్ పై రూ.1000 కూపన్ డిస్కౌంట్ తర్వాత రూ.14,999 మరియు రూ.15,999 కి లభించనున్నాయి.

Realme Narzo 70x 5G

Realme Narzo 70x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి వేరియంట్ పై రూ.1,500 డిస్కౌంట్ మరియు 6జిబి వేరియంట్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.10,999 మరియు రూ.11,999 కి చేరుతాయి.

Realme Buds Air 5, Realme Buds Air 5 Pro

Realme Buds Air 5 పై రూ.700 డిస్కౌంట్ లభిస్తోంది. మరోవైపు, Realme Buds Air 5 Pro పై రూ.500 డిస్కౌంట్ మరియు రూ.300 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది.

అంతేకాదు, రియల్మీ ఇతర ఉత్పత్తులైన, Realme 12 Pro 5G, Realme 12 Pro+ 5G, Narzo 60x 5G మరియు Realme Buds T100 డివైజెస్ పై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Realme 6వ యానివర్శరీ సేల్‌లో Realme 12X 5G, Realme P1 సిరీస్‌లతో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/realme-p1-5g-vs-moto-g64-5g-which-is-best/ Tue, 16 Apr 2024 18:29:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11130 Moto G64 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నిన్నే Realme P1 5G కూడా లాంచ్ అయ్యింది. మోటో జీ64 5జీ రూ.14,999 ప్రారంభ ధరతో లాంచైంది. రియల్మీ పీ1 5జీ రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తుంది. మోటో జీ64 మరియు రియల్మీ పీ1 ఫోన్లు ఒకే ధర శ్రేణిలో వచ్చాయి కాబట్టి, రెండింట్లో ఏది ఉత్తమమో, ఎందులో ఎక్కువ […]

The post Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నిన్నే Realme P1 5G కూడా లాంచ్ అయ్యింది. మోటో జీ64 5జీ రూ.14,999 ప్రారంభ ధరతో లాంచైంది. రియల్మీ పీ1 5జీ రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తుంది. మోటో జీ64 మరియు రియల్మీ పీ1 ఫోన్లు ఒకే ధర శ్రేణిలో వచ్చాయి కాబట్టి, రెండింట్లో ఏది ఉత్తమమో, ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

మోటో జీ64 5జీ vs రియల్మీ పీ1 5జీ

డిస్ప్లే

Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

మోటో జీ64 5జీ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

రియల్మీ పీ1 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

మోటో జీ64 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

ఓఎస్

రియల్మీ పీ1 5జీ మరియు మోటో జీ64 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి.

కెమెరా

Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Moto G64 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి డెప్త్ మరియు మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

Moto G64 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto G64 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

ధర

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

రియల్మీ పీ1 5జీ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 మరియు 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ ని రియల్మీ అందిస్తోంది.

డిస్కౌంట్ తర్వాత Realme P1 5G డివైజ్ ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి.

Moto G64 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.

Moto G64 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

The post Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Realme P1 5G: 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 5జీ https://www.91mobiles.com/telugu/realme-p1-5g-launched-in-india-with-120hz-amoled-display/ Mon, 15 Apr 2024 09:33:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11093 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో కొత్తగా పీ-సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 5G స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ54 రేటింగ్ తో లాంచ్ అయ్యింది. […]

The post Realme P1 5G: 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో రియల్మీ పీ1 సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన పీ1, పీ1 ప్రో డివైజెస్
  • 45W ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన పీ1 5జీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో కొత్తగా పీ-సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme P1 5G మరియు Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme P1 5G స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం. రియల్మీ పీ1 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ54 రేటింగ్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme P1 5G ధర, సేల్ వివరాలు

Realme P1 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

రియల్మీ పీ1 5జీ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 మరియు 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ ని రియల్మీ అందిస్తోంది.

డిస్కౌంట్ తర్వాత Realme P1 5G డివైజ్ ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme P1 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని అందించారు.

ఓఎస్: Realme P1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 4 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme P1 5G డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, మినీ క్యూప్సూల్ 2.0, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme P1 5G: 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ పీ1 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>