Realme P1 Speed 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 15 Oct 2024 14:35:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/#respond Tue, 15 Oct 2024 14:35:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=14052 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ […]

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Realme P1 Speed 5G విడుదల
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme P1 Speed 5G ధర మరియు లభ్యత

  • Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 20వ తేదీ నుంచి రియల్మీ పీ2 స్పీడ్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme P1 Speed 5G డిజైన్

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ చూసేందుకు గత మోడల్ పీ1 మరియు పీ1 ప్రో మాదిరే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ కార్నర్స్ ఉన్నాయి. ముందువైపు, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ బ్రష్డ్ బ్లూ మరియు టెక్షర్డ్ టైటానియమ్ కలర్స్ లో లభిస్తుంది.

Realme P1 Speed 5G డివైజ్ 161.7 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

Realme P1 Speed 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Speed 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ఈస్పోర్ట్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ లోకల్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో, 16.7 మిలియన్ కలర్స్, రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Speed 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 7,50,000+ గా నమోదైనట్లు కంపెనీ చెబుతోంది.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme P1 Speed 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Speed 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme P1 Speed 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Realme P1 Speed 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Speed 5G లో ఐపీ65 ప్రొటెక్షన్ ఉంది. దీని వల్లన నీరు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో జీటీ మోడ్ ఉంది.

The post Realme P1 Speed 5G: 12GB ర్యామ్, ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-launched-12gb-ram-oled-display/feed/ 0
Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/#respond Wed, 09 Oct 2024 08:02:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=14027 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి […]

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P1 Speed 5G విడుదల
  • అక్టోబర్ 15న భారత్ లో లాంచ్
  • మీడియాటెక్ చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme P1 Speed 5G లాంచ్ తేదీ

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 15వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా సేల్‌కి వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన చిప్సెట్.

త్వరలో రాబోవు ఈ ఫోన్ అంటుటు పై 7,50,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసినట్లు రియల్మీ చెబుతోంది. ఈ చిప్సెట్ లో నాలుగు కార్టెక్స్ ఏ78 కోర్స్, నాలుగు కార్టెక్స్ ఏ55 కోర్స్ మరియు మాలి జీ615 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.

తమ ఫోన్ గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ ఇలా దేన్నైనా ఈజీగా హ్యాండిల్ చేయగలదని రియల్మీ అంటోంది.

ఇక, రియల్మీ షేర్ చేసిన టీజర్ లో కెమెరా మాడ్యూల్ హైలైట్ చేయబడింది. రియల్మీ పీ1 5జీ మాదిరిగానే బ్యాక్ ప్యానెల్ పై నీలం రంగులో టెక్షర్డ్ డిజైన్ ఉంది.

కెమెరా మాడ్యూల్ లో రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఇంకా ఈ ఫోన్‌లో అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

త్వరలో Realme P1 Speed 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Realme P1 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని అందించారు.

ఓఎస్: Realme P1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 4 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme P1 5G డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, మినీ క్యాప్సూల్ 2.0, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/feed/ 0