Realme P2 Pro vs Motorola Edge 50 Fusion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Sep 2024 12:58:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/#respond Wed, 25 Sep 2024 12:56:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13743 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Realme […]

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Realme P2 Pro మరియు Motorola Edge 50 Fusion ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Realme P2 Pro లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Motorola Edge 50 Fusion లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

రియల్మీ పీ2 ప్రో 10 గంటల 25 నిమిషాల పాటు నడిచింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 9 గంటల 53 నిమిషాలు నడిచింది. ఈ టెస్టులో రియల్మీ పీ2 ప్రో పైచేయి సాధించింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ తో పోల్చితే, రియల్మీ పీ2 ప్రో బెటర్ బ్యాటరీ మేనేజ్మెంట్ కలిగి ఉంది.

విజేత: Realme P2 Pro

వీడియో స్ట్రీమింగ్

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
30-నిమిషాలు యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ 4 శాతం (280ఎంఏహెచ్) 4 శాతం (200 ఎంఏహెచ్)

 

రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ టెస్టు కోసం రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ పెట్టాం. వీడియో రెజుల్యూషన్‌ను 1080పి గా సెట్ చేశాం. ఈ టెస్టులో రెండు స్మార్ట్‌ఫోన్లలో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. అయితే, కచ్చితమైన ఫలితాలను పరిశీలిస్తే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 200 ఎంఏహెచ్ బ్యాటరీ, రియల్మీ పీ2 ప్రో 280 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్‌ను వాడుకున్నాయి.

విజేత: Motorola Edge 50 Fusion

గేమింగ్

ఈ టెస్టు కోసం, మేం రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది. గేమింగ్ కి ముందు రెండు ఫోన్లు కూడా 30 డిగ్రీల టెంపరేచర్ కలిగి ఉన్నాయి. గేమింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
బీజీఎంఐ 8 శాతం (416 ఎంఏహెచ్) 9 శాతం (450 ఎంఏహెచ్)
కాల్ ఆఫ్ డ్యూటీ 8 శాతం (312 ఎంఏహెచ్) 9 శాతం (450 ఎంఏహెచ్)
రియల్ రేసింగ్ 6 శాతం (312 ఎంఏహెచ్) 8 శాతం (400 ఎంఏహెచ్)

 

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బ్యాటరీ 26 శాతం ఖర్చయ్యింది. అంటే దీన్ని 1,300 ఎంఏహెచ్ గా చెప్పవచ్చు. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో బ్యాటరీ 20 శాతం ఖర్చయ్యింది. అంటే 1040 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ వాడుకుంది.

విజేత: Realme P2 Pro

చార్జింగ్ టెస్ట్

రియల్మీ పీ2 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు రెండు కూడా కంపాటిబుల్ చార్జర్ తో వస్తున్నాయి. రియల్మీ పీ2 ప్రో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

టెస్ట్ రియల్మీ పీ2 ప్రో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
చార్జింట్ టైమ్ (20-100 శాతం) 36 నిమిషాలు 36 నిమిషాలు

 

20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు రియల్మీ పీ2 ప్రో 36 నిమిషాల సమయం తీసుకుంది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ను ఆన్ చేసినప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి 36 నిమిషాల సమయం పట్టింది. అంటే రియల్మీ ఫోన్ మాదిరే ఇది కూడా ఉంది.

విజేత: సమానం

ఏది బెటర్?

రెండు ఫోన్ల మధ్య బ్యాటరీ పెర్ఫామెన్స్ విషయంలో తేడా స్వల్పమే. వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ బాగా పెర్ఫామ్ చేసింది. బూస్ట్ మోడ్ లో చార్జింగ్ స్పీడ్ కూడా రియల్మీ పీ2 ప్రో తో సమానంగా ఉంది. మరోవైపు, రియల్మీ పీ2 ప్రో గేమింగ్ సమయంలో బ్యాటరీ మేనేజ్మెంట్ మరియు పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో బాగా పెర్ఫామ్ చేసింది.

భారత్ లో Realme P2 Pro ప్రారంభ ధర రూ.21,999 గా ఉంది. మరోవైపు, Motorola Edge 50 Fusion బేస్ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. రెండు ఫోన్లు కూడా బ్యాటరీ బ్యాకప్ విషయంలో బాగానే ఉన్నాయి. కాబట్టి, మీరు ఏది ఎంచుకున్నా మంచి ఆప్షనే అవుతుంది.

The post Realme P2 Pro vs Motorola Edge 50 Fusion: ఏ ఫోన్ బ్యాటరీ బెటర్ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-vs-motorola-edge-50-fusion-battery-comparison-which-is-better/feed/ 0