Realme V30T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:14:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme V30, V30T ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్; అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపించిన డివైజెస్ https://www.91mobiles.com/telugu/realme-v30-v30t-spotted-on-realme-official-website-price-specs-revealed/ Tue, 07 Feb 2023 08:55:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4815 Realme V30, V30T స్మార్ట్ ఫోన్స్ రియల్మీ అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ కాబడినవి. దీంతో పలు వివరాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 9 న ఈ డివైజెస్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. Realme V30, V30T ఫోన్ల ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ బట్టి ఇవి మిడ్ రేంజ్ ఆఫరింగ్స్ అని అర్థమవుతోంది. యాక్సిడెంటల్ గా రియల్మీ వెబ్ సైట్ లో ఈ డివైజెస్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన వివరాలైతే మనకు తెలిసిపోయాయి. […]

The post Realme V30, V30T ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్; అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపించిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 9 న లాంచ్ కానున్న Realme V30, V30T స్మార్ట్ ఫోన్స్
  • దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్న Realme V30, V30T
  • రియల్మీ అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోన్న Realme V30, V30T ఫోన్ల వివరాలు

Realme V30, V30T స్మార్ట్ ఫోన్స్ రియల్మీ అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ కాబడినవి. దీంతో పలు వివరాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 9 న ఈ డివైజెస్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. Realme V30, V30T ఫోన్ల ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ బట్టి ఇవి మిడ్ రేంజ్ ఆఫరింగ్స్ అని అర్థమవుతోంది. యాక్సిడెంటల్ గా రియల్మీ వెబ్ సైట్ లో ఈ డివైజెస్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన వివరాలైతే మనకు తెలిసిపోయాయి. సరే, అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme V30, V30T ధర, కలర్ ఆప్షన్స్

Realme V30, V30T డివైజెస్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తాయి. Realme V30 ధర CNY 1,099 (సుమారు రూ.13,400) గా ఉంది. మరోవైపు Realme V30T ధర CNY 1299 (సుమారు రూ.15,800) గా ఉంది. రెండు ఫోన్లు కూడా డార్క్ నైట్ మరియు డాన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

Realme V30, V30T స్పెసిఫికేషన్స్

Realme V30, V30T డివైజెస్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, ఫ్లాట్ ప్యానెల్, డ్యూడ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. డిస్ప్లే ప్యానెల్ 600 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజెస్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ స్టాండర్డ్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Realme V30, V30T డివైజెస్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme V30, V30T స్మార్ట్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉంటాయి. రెండు డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్లు లభిస్తాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లు 8.1 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటాయి. రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ 3.0 కస్టమ్ స్కిన పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Realme V30, V30T ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్; అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపించిన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>