Redmi 11 Prime 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 26 Dec 2022 10:51:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/redmi-11-prime-5g-discount-sale-amazon/ Mon, 26 Dec 2022 10:51:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=4173 హైలైట్స్ Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ రూ.13,999 ధరతో సెప్టెంబర్ లో లాంచైన Redmi 11 Prime 5G తగ్గింపు ధరతో ప్రస్తుతం రూ.12,999 కే లభించనున్న Redmi 11 Prime 5G భారత్ లో Redmi 11 Prime 5G ధరను సదరు కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. 2022 సెప్టెంబర్ లో Redmi 11 Prime 5G భారత్ లో లాంచైంది. […]

The post Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్
  • రూ.13,999 ధరతో సెప్టెంబర్ లో లాంచైన Redmi 11 Prime 5G
  • తగ్గింపు ధరతో ప్రస్తుతం రూ.12,999 కే లభించనున్న Redmi 11 Prime 5G

భారత్ లో Redmi 11 Prime 5G ధరను సదరు కంపెనీ తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. 2022 సెప్టెంబర్ లో Redmi 11 Prime 5G భారత్ లో లాంచైంది. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.13,999 గా ఉంది. అయితే తాజాగా ధర తగ్గింపుతో Redmi 11 Prime 5G ఫోన్ రూ.12,999 కే లభించనుంది.

భారత్ లో Redmi 11 Prime 5G రెండు వేరియంట్స్ లో లాంచైంది. అవి: 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ. క్రోమ్ సిల్వర్, మీడో గ్రీన్, థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్ లో ఫర్వాలేదనిపించే ఫీచర్లు ఉన్నాయి.

Redmi 11 Prime 5G కొత్త ధర, లభ్యత

Redmi 11 Prime 5G 4జిబి ర్యామ్, 64జిబి వేరియంట్ రూ.12,999 కే లభిస్తుంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 కి లభిస్తుంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్ సైట్ లో కొత్త ధరలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi 11 Prime 5G స్పెసిఫికేషన్స్

Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచైంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్ లో ఫోన్ లభించనుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.

Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, హై-రెస్ ఆడియో తో వచ్చింది. వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi 11 Prime 5G లో యాక్సలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఎలక్ట్రానిక్ కంపాస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 తో లాంచైన ఈ ఫోన్ త్వరలోనే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 https://www.91mobiles.com/telugu/redmi-11-prime-5g-redmi-11-prime-redmi-a1-launched-price-specs-availability/ Tue, 06 Sep 2022 11:39:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=2132 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్ స్పెషల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా వస్తోన్న రెడ్మీ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్ సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా డివైజెస్ ని కొనుగోలు చేసే అవకాశం రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్లను నేడు షావోమీ […]

The post భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్
  • స్పెషల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా వస్తోన్న రెడ్మీ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్
  • సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా డివైజెస్ ని కొనుగోలు చేసే అవకాశం

రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్లను నేడు షావోమీ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. స్పెషిల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా ఈ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్ భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ రెడ్మీ ఫోన్ల వరుసలో రెడ్మీ ఏ1 డివైజ్ అత్యంత చౌకైనది. ఏ1 ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇక రెడ్మీ 11 ప్రైమ్, పోకో ఎమ్ 5 కి రీబ్రాండెడ్ వర్షన్. ఎమ్5 ఫోన్ నిన్నే భారత్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 22.5 వాట్ చార్జర్ తో వస్తోంది. అయితే ఇది కేవలం 18 వాట్ చార్జింగ్ స్పీడ్ ని మాత్రమే కలిగి ఉంది. మరి ఈ రెడ్మీ ఫోన్ల యొక్క ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 ఫోన్ల ధరలు, లభ్యత

రెడ్మీ 11 ప్రైమ్ 4జిబి + 64జిబి వర్షన్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి + 128జిబి వర్షన్ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. అవి: ఫ్లాషీ బ్లాక్, ప్లేఫుల్ గ్రీన్, పెప్పీ పర్పుల్. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 4జిబి + 64జిబి మోడల్ ధర రూ.13,999 గా ఉంది. ఇక 6జిబి + 128జిబి ధర రూ.15,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: మీడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్. రెడ్మీ ఏ1 రూ.6,499 ధరతో ఓ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆసక్తిగల వారు అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ 11 ప్రైమ్, 11 ప్రైమ్ 5జీ ఫోన్ల సేల్ సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. రెడ్మీ ఏ1 సేల్ సెప్టెంబర్ 9 సాయంత్రం 4 నుంచి మొదలవుతుంది.

Redmi 11 Prime 5G స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఫోన్ 22.5 వాట్ చార్జర్ తో వస్తోంది.

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి డెప్త్ సెన్సర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి కెమెరా అందించారు. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Redmi 11 Prime స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్మీ ఫోన్ బాక్స్ లో 22.5 చార్జర్ తో వస్తోంది. 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 1టీబీ వరకు ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ సౌకర్యం కూడా ఇందులో ఉంది.

Redmi A1 స్పెసిఫికేషన్స్

రెడ్మీ ఏ1 లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ22 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో ఫోన్ లభించనుంది. ఇందులో 1టీబీ వరకు ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశముంది.

రెడ్మీ ఏ1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఫోన్ ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

The post భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G https://www.91mobiles.com/telugu/redmi-11-prime-5g-launch-timeline/ Tue, 30 Aug 2022 05:35:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=1993 హైలైట్స్: రెండు వారాల్లోగా లాంచ్ కానున్న Redmi 11 Prime 5G ఫెస్టివ్ సేల్ సమయంలో భారత్ లోకి అడుగు పెట్టనున్న Redmi 11 Prime 5G Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం రానున్న వారాల్లో రెడ్మీ కంపెనీ భారత్ లో ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమేరకు 91మొబైల్స్ కి సమాచారం లభించింది. ప్రముఖ టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ మాతో ఈ […]

The post సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రెండు వారాల్లోగా లాంచ్ కానున్న Redmi 11 Prime 5G
  • ఫెస్టివ్ సేల్ సమయంలో భారత్ లోకి అడుగు పెట్టనున్న Redmi 11 Prime 5G
  • Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం

రానున్న వారాల్లో రెడ్మీ కంపెనీ భారత్ లో ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమేరకు 91మొబైల్స్ కి సమాచారం లభించింది. ప్రముఖ టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ మాతో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. యోగేశ్ చెప్పిన దాన్ని బట్టి త్వరలో రెడ్మీ నుంచి రెడ్మీ 11 ప్రైమ్ ఫోన్ భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెడ్మీ 11 సిరీస్ లో కొత్త మెంబర్ చేరబోతున్నట్లు స్పష్టమవుతోంది. చూస్తుంటే ఈ డివైజ్ రెడ్మీ నోట్ 11ఈ 5జీ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తోంది. 11ఈ 5జీ మార్చిలో చైనాలో లాంచ్ అయ్యింది.

Redmi 11 Prime 5G విశేషాలు

బ్రార్ చెబుతున్న దాన్ని బట్టి, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్, రెడ్మీ నోట్ 11ఈ 5జీ మాదిరి ఉండనుంది. దీంతో Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 11ఈ లో కూడా ఇదే చిప్సెట్ అందించారు.

ఇతర ముఖ్య ఫీచర్లను చూస్తే, చైనా వర్షన్ లో 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ 90 హెర్ట్జ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ రెజుల్యూషన్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఓవరాల్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ బడ్జెట్ సెగ్మెంట్ కు సరిపోయేలా ఉంటాయి. అలాగే ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఈ ఫోన్లో యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

షావోమీ రీసెంట్ గా 7 మిలియన్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ని భారత్ లో డెలివరీ చేసినట్లు షావోమీ తెలిపింది. మింట్ కథనం ప్రకారం, షావోమీ తన సబ్-బ్రాండ్స్ అయిన రెడ్మీ, పోకో లతో కలిసి భారత్ లో 5జీ షిప్మెంట్స్ చేరవేత లో 3 వ ర్యాంక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాప్-2 లో వరుసగా శాంసంగ్, వివో కంపెనీలు ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యధిక హ్యాండ్సెట్స్ అమ్మి అగ్ర స్థానంలో ఉన్న షావోమీ గత కొన్ని రోజులుగా మార్కెట్ లో పోటీ ఎక్కువ అవుతుండటంతో క్రమంగా వెనుకబడి పోతోంది. అయితే ఇప్పటికి కూడా షావోమీకి మంచి ఆదరణే ఉంది. 5జీ షిప్మెంట్స్ విషయంలో మరిన్ని జనాకర్షక ఫోన్లను తీసుకొస్తే, షావోమీ ఈ సెగ్మెంట్ లో కూాడా టాప్ ప్లేస్ కి వెళ్ళే అవకాశముంది.

Redmi 11 Prime 5G Specs

  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 5ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12, ఎంఐయూఐ 13 స్కిన్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G https://www.91mobiles.com/telugu/xiaomi-to-launch-redmi-11-prime-5g-india-specs-price/ Thu, 11 Aug 2022 08:26:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=1636 హైలైట్స్: లైట్ అనే కోడ్ నేమ్, 22041219l అనే కోడ్ నంబర్ ని కలిగిన రెడ్మీ 11 ప్రైమ్ 5జీ చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11ఈ ని పోలినట్లున్న రెడ్మీ 11 ప్రైమ్ 5జీ భారత్ లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ధర రూ.12,000 గా ఉండే అవకాశం షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ, త్వరలోనే భారత మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నివేదికల ప్రకారం, […]

The post భారత్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లైట్ అనే కోడ్ నేమ్, 22041219l అనే కోడ్ నంబర్ ని కలిగిన రెడ్మీ 11 ప్రైమ్ 5జీ
  • చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11ఈ ని పోలినట్లున్న రెడ్మీ 11 ప్రైమ్ 5జీ
  • భారత్ లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ధర రూ.12,000 గా ఉండే అవకాశం

షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ, త్వరలోనే భారత మార్కెట్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నివేదికల ప్రకారం, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ భారత్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 11ఈ 5జీ ఫోన్ కి ఇది రీబ్రాండెడ్ వర్షన్ అని అర్థమవుతోంది. కొన్ని వారాల క్రితం కొన్ని స్వల్ప మార్పులతో నోట్ 11ఈ 5జీ ఫోన్ పోకో ఎం4 5జీ గా భారత్ లో లాంచ్ అయ్యింది.

ఇలా రీబ్రాండ్ చేసి ఫోన్లను మార్కెట్ లోకి వదలడం షావోమీకి కొత్తేమీ కాదు. రీసెంట్ గా షావోమీ, రెడ్మీ నోట్ 11ఈ 5జీ ఫోన్ ని రెడ్మీ 10 5జీ పేనుతో ఇండోనేషియాలో లాంచ్ చేసింది. షావోమీయూఐ ప్రకారం, లైట్ అని కోడ్ నేమ్, 22041219l మోడల్ నంబర్ ని కలిగి ఉన్న రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

భారత్ లో Redmi 11 Prime 5G లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ త్వరలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, షావోమీ ఈ నెలలో ఫోన్ ని సైలెంట్ గా లాంచ్ చేసే అవకాశముంది. రెడ్మీ నోట్ 11ఈ 5జీ చైనా మోడల్ లాగే దీని స్పెసిఫికేషన్స్ ఉండనున్నాయి.

భారత వర్షన్ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, వాటర్-డ్రాప్ నాచ్, ప్లాస్టిక్ ఫ్రేమ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉండనున్నాయి.

భారత్ లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.12,000 గా ఉండే అవకాశముంది. రానున్న పండుగ సీజన్లో షావోమీ ఈ ఫోన్ ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో షావోమీ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షావోమీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రోటోటైప్ ని జనాల ముందుకు తీసుకువచ్చే అవకాశముంది. అలాగే ఇతర డివైజెస్ ను కూడా లాంచ్ చేయనుంది.

The post భారత్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G first appeared on 91Mobiles Telugu.

]]>