Redmi 12 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Aug 2023 09:03:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన Redmi 12 5G https://www.91mobiles.com/telugu/redmi-12-5g-launched-india-price-specs-availability/ Tue, 01 Aug 2023 08:53:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=7408 షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో తన కొత్త నంబర్ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi 12 సిరీస్ లో భాగంగా Redmi 12 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ సరసమైన ధరలో మిడ్-లెవెల్ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. సరే, ఓసారి Redmi 12 […]

The post 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన Redmi 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi 12 5G
  • క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వచ్చిన Redmi 12 5G
  • 16జిబి వరకు ఆఫర్ చేస్తున్న Redmi 12 5G

షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో తన కొత్త నంబర్ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi 12 సిరీస్ లో భాగంగా Redmi 12 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ సరసమైన ధరలో మిడ్-లెవెల్ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. సరే, ఓసారి Redmi 12 5G ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 12 5G డిజైన్

Redmi 12 5G డివైజ్ స్పెషల్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ లో సెన్సర్స్ ఉన్నాయి. బాటమ్ లో రెడ్మీ బ్రాండింగ్ ఉంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వచ్చింది. మొత్తం మీద, ఫోన్ ప్రీమియమ్ లుక్ ని కలిగి ఉంది.

Redmi 12 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్, 91 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12 5G లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ఉంటుంది. ఈ చిప్ 4నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • స్టోరేజీ: Redmi 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. కంపెనీ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా అందిస్తోంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi 12 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 22.5 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 12 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై 5, బ్లూటూత్ 5.1, డ్యూయల్ సిమ్ 5జీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

భారత్ లో Redmi 12 5G ధర

Redmi 12 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఇక టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,499 గా నిర్ణయించారు.

The post 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన Redmi 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! https://www.91mobiles.com/telugu/redmi-12-4g-redmi-12-5g-price-ram-storage-leaked-before-launch/ Tue, 25 Jul 2023 05:31:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=7306 షావోమి సంస్థ భారత్ లో త్వరలోనే Redmi 12 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 1 న ఈ రెండు డివైజెస్ లాంచ్ కానున్నాయి. అవి: Redmi 12 4G, Redmi 12 5G. రెడ్మీ 12ఆర్ ని రీబ్రాండ్ చేసిన Redmi 12 5G ని తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Redmi 12 4G ఇప్పటికే థాయిల్యాండ్ లో లాంచ్ అయ్యింది. డివైజ్ కూడా ఫ్లిప్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ తో వస్తోన్న Redmi 12 4G
  • Redmi 12 4G అంచనా ప్రారంభ ధర రూ.9,999
  • 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ తో రానున్న Redmi 12 5G

షావోమి సంస్థ భారత్ లో త్వరలోనే Redmi 12 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 1 న ఈ రెండు డివైజెస్ లాంచ్ కానున్నాయి. అవి: Redmi 12 4G, Redmi 12 5G. రెడ్మీ 12ఆర్ ని రీబ్రాండ్ చేసిన Redmi 12 5G ని తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Redmi 12 4G ఇప్పటికే థాయిల్యాండ్ లో లాంచ్ అయ్యింది. డివైజ్ కూడా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుందని బ్రాండ్ ఖరారు చేసింది.

Redmi 12 4G డివైజ్ జేడ్ బ్లాక్, పేస్టల్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. లాంచ్ కోసం వేచి చూస్తున్న తరుణంలో, టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ డివైజ్ ధర వివరాలు షేర్ చేసారు.

లీకైన Redmi 12 4G, Redmi 12 5G ధరలు

టిప్‌స్టర్ ప్రకారం, Redmi 12 5G 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.13,999 నుంచి మొదలవుతుందని సమాచారం. మరోవైపు Redmi 12 4G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Redmi 12 4G ధర రూ.9,999 తో మొదలవుతుందని టిప్‌స్టర్ చెబుతున్నారు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12 4G లో 6.79-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 550 నిట్స్ బ్రైట్నెస్, 70 పర్సెంట్ కలర్ గేముత్, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Redmi 12 4G లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12 4G డివైజ్ లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi 12 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • రియర్ కెమెరా: Redmi 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Redmi 12 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12 4G డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్-సిమ్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi 12 5G, Redmi 12 4G ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>